శ్లోకం:- నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్
జ్యోతిష్య శాస్త్రరీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత, దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాత గా చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది. భౌతిక దృష్టిలో శనిక్రూరుడుగా కనపడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు గురిచేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్ళిస్తాడు.
శాసనంలో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మాలకే దండన విధిస్తాడు నిస్పక్షపాతంగా ఉన్న న్యాయాధిపతిలా శని దండన విధిస్తాడు. శనివారానికి స్థితి కారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి. ఈ రోజున శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం తప్పకుండా చేయాలి.
Comments
Post a Comment