Skip to main content

రామనుజాచార్యుల జయంతి 2-5-2025 శుక్రవారం

                                 // శ్రీమతే రామనుజాయ నమః //

ఈ ఏడాది మే 2వ తేదీ వైశాఖ శుద్ధ పంచమి, శుక్రవారం రోజు రామానుజ జయంతి జరుపుకోనున్న సందర్భంగా ఆయన జీవిత విశేషాలను, రామానుజాచార్యులు ప్రచారం చేసిన సిద్ధాంతాలను గురించి తెలుసుకుందాం.

రామానుజాచార్యులు జన్మ విశేషాలు
రామానుజులు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో చెన్నై నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూరులో చైత్ర శుద్ధ పంచమి, ఆరుద్ర నక్షత్రం రోజున జన్మించారు.

విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారకర్త
దాదాపు 123 ఏళ్ళు జీవించిన రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు.

ఆదిశంకరుల బాటలో పయనం
దాదాపు వెయ్యి సంవత్సరాల కిందట ఆది శంకరుల జయంతి రోజునే జన్మించిన రామానుజులు శంకరుల విశిష్ట అద్వైతాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవతరించారు. అయితే ఆదిశంకరులు అద్వైతాన్ని విశేషంగా ప్రచారం చేస్తే రామానుజులు ఆ అద్వైతం శ్రీ మహావిష్ణువే అని నొక్కి చెప్పారు.

విశిష్టాద్వైతమే సిద్ధాంతం
అద్వైతం అంటే ఉన్నది ఒకటే అని, శైవ వైష్ణవ భేదాలు లేవని శంకరులు ప్రచారం చేసారు. అయితే రామానుజులు కూడా ఉన్నది ఒక్కటే అని, ఆ ఒక్కటి శ్రీ మహావిష్ణువే అని ప్రచారం చేయడం గమనార్హం. అందుకే రామానుజులు ప్రచారం చేసింది విశిష్టాద్వైతం అంటారు.

విశిష్టాద్వైతం ఎందుకు
ఆది శంకరుల వారు తమ కాలంలో ప్రబలంగా పాతుకొని పోయి ఉన్న ఆచారకాండలను ఖండించడానికి అద్వైతాన్ని ప్రచారం చేసారు. కానీ రామానుజుల కాలం నాటికి పరిస్థితులు మారిపోయాయి. హిందూ మతంను బౌద్ధ, జైన మతాల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రామానుజులు నిరాకార పరబ్రహ్మాన్ని ఉపాసించే అద్వైతంకు బదులుగా మూర్తి రూపంలో విష్ణువును పూజించే విశిష్టాద్వైతంను ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకు వచ్చారు.

ఆదర్శవాది
రామానుజులు మనుష్యులంతా ఒక్కటే అని నమ్మిన ఆదర్శవాది. తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రామానుజుల కాలంలో అష్టాక్షరీ మంత్రం పరమ రహస్యంగా ఉండేది. ఈ మంత్రం ఎవరు పడితే వారు అనుష్ఠానం చేయకూడదని నియమం ఉండేది. అందుకే సదాచార సంపన్నులైన పెద్దలు, గురువులు అర్హులైన వారికి మాత్రమే అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించే వారు. అంతే కాదు ఈ మంత్రాన్ని గురు ముఖతా ఉపదేశం పొందిన వారికి ముక్తి కలుగుతుందని ప్రబల విశ్వాసం. ఎవరైతే ఈ మంత్రాన్ని బహిరంగంగా ప్రకటిస్తారో వారు నరకానికి వెళ్తారన్న మూఢ నమ్మకం కూడా ఆనాటి సమాజంలో ప్రబలంగా ఉండేవి.

జనహితమే తన మతం
రామానుజులు సమాజ శ్రేయస్సు కోసం అందరి బాగు కోసం తానొక్కడు నరకాన్ని వెళ్లినా ఫర్వాలేదని ఆ రోజుల్లోనే అందరినీ ఎదిరించి ఆలయ గోపురం పైకి ఎక్కి అష్టాక్షరీ మంత్రాన్ని సామాన్యులందరికీ బోధించిన నిస్వార్ధ పరుడు. ఈ మంత్రోపదేశంతో అందరికీ ముక్తి కలిగితే తన జీవితం ధన్యమని భావించి సహజీవన, సమతా భావాలను ఆనాడే ఆయన ప్రతిపాదించారు.

Comments

Popular posts from this blog

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి. 

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-