ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్ల పక్షంలో ఏర్పడే ఏకాదశిని పరివర్తిని ఏకాదశి, పద్మ ఏకాదశి, వామన ఏకాదశి అని అంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 03 సెప్టెంబర్ 2025 బుధవారం రోజున పరివర్తిని ఏకాదశి వచ్చింది. పరివర్తన ఏకాదశి పూజా విధానం మిగతా ఏకాదశుల మాదిరిగానే, పరివర్తన ఏకాదశి రోజు కూడా ఉపవాస దీక్షను చేపట్టవలసి ఉంటుంది. ఈ రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి శుచియై, పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని శ్రీలక్ష్మీ నారాయణులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. చేమంతులతో నారాయణుని పూజించాలి. చక్ర పొంగలి, పులగం వంటి ప్రసాదాలను నివేదించాలి. పూజా చేసేవారు రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండాలి. సమీపంలోని విష్ణు ఆలయాలను సందర్శించాలి. సాయంత్రం పూజ ఏకాదశి రోజు సాయంత్రం శుచిగా దేవుని సమక్షంలో దీపారాధన చేసి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. ఏకాదశి రోజు చేసే విష్ణు సహస్రనామ పారాయణకు కోటి రెట్ల అధిక ఫలితం ఉంటుందని శాస్త్రవచనం.
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B,(corporate lawyer), D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com