శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశినే అజ ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశికే అన్నద ఏకాదశి అనే మరో పేరు కూడా ఉంది. ఈ పండుగ విష్ణువు మరియు లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది. ఈ ఏకాదశిని పాటించడం వల్ల భక్తులు అన్ని పాపాల నుండి విముక్తి పొందడమే కాకుండా.. జీవితంలో శ్రేయస్సు లభిస్తుంది. అంతేకాకుండా ఆ శ్రీహరి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ లభిస్తాయి. .
అజ ఏకాదశి పూజా విధానం
అజ ఏకాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఉపవాస దీక్ష తీసుకోవాలి. అనంతరం ఇంట్లోని పూజా మందిరాన్ని శుద్ది చేసి విష్ణువు ప్రతిమను పెట్టండి. పూజలో తులసి మెుక్కను ఉపయోగించండి. విష్ణువు మంత్రాలను జపిస్తూ మంత్రోచ్ఛారణ చేయండి. దాంతో పాటు అజ ఏకాదశి కథను వినండి. మీ శక్తి కొలదీ ఆహారం, బట్టలు, డబ్బు మెుదలైనవి దానం చేయండి.
ఏమి చేయకూడదు?
ఈరోజున సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. తామసిక ఆహారం( మాంసం, చేపలు) జోలికి పోకండి. ఎక్కువ శారీరక శ్రమ చేయకండి. వినోదం, విలాసాలకు దూరంగా ఉండండి. కోపం, హింసను విడనాడండి. మద్యం, మత్తు పదార్ధాలు సేవించకూడదు.
అజ ఏకాదశి వ్రత మహిమ గురించి పురాణాలు, హిందూ గ్రంథాల్లో చెప్పబడింది. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం, శ్రీకృష్ణుడు.. పాండవుల అగ్రజుడైన యుధిష్ఠిరుడికి ఈవ్రత పాముఖ్యత గురించి వివరిస్తాడు. రాజా హరిశ్చంద్రుడు ఈ ఏకాదశని భక్తితో ఆచరించడం వల్ల చనిపోయిన కొడుకును, కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. అజ ఏకాదశి భక్తులను ధర్మమార్గంలో నడవడానికి తోడ్పడుతోంది. అంతేకాకుండా మోక్షం మరియు విముక్తి వైపు పయనించేలా చేస్తోంది. ఇది హృదయం మరియు ఆత్మ రెండింటినీ శుద్ధి చేస్తుంది.
Comments
Post a Comment