Skip to main content

Posts

Showing posts from September, 2025

మహార్నవమి విశేషాలు

  నవరాత్రుల నవమి నాడు హోమం చేయాలనే నియమం కూడా ఉంది. ఇందులో సహస్రనామాలను పఠిస్తూ అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు. మహార్నవమి రోజున  అమ్మవారికి పిండివంటలతో పాటు చెరుకుగడలు నైవేద్యంగా సమర్పిస్తారు . మహానవమి చేసే పూజలు ముఖ్యంగా ఫలవంతమైనవిగా పరిగణించబడతాయి. విజయ దశమి పూజ అనేది పున: పూజ, ఉద్వాసన మాత్రమే అని నిర్ణయ సింధువులో స్పష్టంగా తెలియజేయబడినది. ప్రధానపూజ నవమి రోజే చేయాలి. నవమి పూజ చేసిన వారే దశమి రోజు పున: పూజ చేస్తారు. మహర్నవమి నాడు అమ్మవారిని ''అపరాజిత''గా పూజిస్తారు. మహిషాసురమర్దినిగా అలంకరించి ఆరాధిస్తారు.  వివిద రకాల పిండి వంటలు, చెరుకు గడలు  అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ మొదలైన ప్రదేశాల్లో మహర్నవమి రోజున ''కన్యా పూజ'' నిర్వహిస్తారు. నవరాత్రులను పురస్కరించుకుని తొమ్మిదిమంది కన్యా రూపాలు సంకేత పూర్వకంగా ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆ శక్తి స్వరూపాలను ఆరాధిస్తారు. అమ్మవారికి అభిషేకం చేసి ముఖాన కుంకుమ దిద్ది, కొత్త బట్టలు సమర్పిస్తారు. ఇంకొన్ని ప్రాంతాల్లో మహర్నవమి నాడు సువాసిని పూజ, దంపతి పూజ జరుపుకుం...

అన్నం వలన ప్రాణి కోటి

  *అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః* *యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞఃకర్మ సముద్భవః* అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షం వలన అన్నం లభిస్తుంది. యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే... అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించాలంటే... దేవతలు కరుణించాలి. దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి.  మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద జీవాత్మగా అవతరించడానికి ... అన్నాన్ని ఆశ్రయించి, తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి, శుక్ల కణముగా రూపొంది, స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి, శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది. మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే... పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే మోక్షం అంటే. ఎవరికైనా ఇంతే..

మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?

 మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము. భాద్రపద బహుళపాడ్యమి నుంచి భాద్రపద అమవాస్య  (21-9-2025) వరకు మధ్యనున్న పదిహేను రోజులు మహాలయ పక్షములు అంటారు. మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు.

తర్పణం గురించిన విశేషాలు

  *తర్పణం!*                    ఎన్ని రకముల తర్పణాలు ఉన్నాయో తెలుసుకుందామా....! తృప్తినిచ్చే అర్పణం తర్పణం అంటారు. *1.) తర్పణం అంటే ఏమిటి? పితృదేవతలకు తృప్తినిచ్చి, వారికి ఊర్ధ్వ లోకాలను ప్రాప్తించేలా చేయడమే తర్పణం. విధి విధానాలను బట్టి, సందర్భాన్ని బట్టి తర్పణం పలురకాలు. *2. ) తర్పణము ఎన్నిరకాలు ? తర్పణము రెండు విధములుగా చేయ వచ్చును అవి సకామ లేక నిష్కామములు. సకామ తర్పణములో కొన్ని ప్రత్యేక ద్రవ్యముల ద్వారా తర్పణము చేస్తారు. నిష్కామ తర్పణము జలముతో చేయబడుతుంది. ఋగ్వేదులు, యజుర్వేదులు, సామ, అధర్వణ వేదాలను అనుసరించేవారు ఒక్కో రకమైన తర్పణ విధానాన్ని అవలంబిస్తారు. *ప్రధానంగా తర్పణాలు నాలుగు రకాలు. 1-గరుడ తర్పణం : - ఎవరైనా పరమపదించిన రోజున చేసే తర్పణాన్ని గరుడ తర్పణం అంటారు. 2-బ్రహ్మ యజ్ఞ తర్పణం : - నిత్యానుష్టానం లో భాగంగా విడిచే తర్పణాలు ఇవి. 3-పర్హెణి తర్పణం : - యేటా చేసే పితృకర్మల తరువాతిరోజు ఇచ్చే తర్పణాలు. 4-సాధారణ తర్పణం : - అమావాస్య రోజున, పుణ్యనదీ స్నానాలలో, పుష్కరాలలో, సంక్రమణ, గ్రహణ సమయాలలో విడిచే తర్పణాలు. మన ఋషులు ఇటువంటి తర్పణ...

ఇందిరా ఏకాదశి తేదీ 17-9-2025 బుధవారం

  ఇందిరా ఏకాదశి అనేది  భాద్రపద మాసం  కృష్ణ పక్షంలో వచ్చే ఎంతో పవిత్రమైన, విశేషమైన ఏకాదశి . సాధారణంగా ఇది  పితృ పక్షంలో వస్తుంది  కాబట్టి పితృ దేవతలకు, పూర్వీకులకు అంకితం చేయబడిన ఏకాదశిగా దీన్ని పరిగణిస్తారు. ఈ ఇందిరా ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించడం,  ఏకాదశి ఉపవాసం ఉండటం వల్ల  పూర్వీకుల ఆత్మ శాంతిస్తుందని, అలాగే వారికి మోక్షం లభిస్తుందని పురాణోక్తి. అలాగే.. ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల పాపాల నుంచి విముక్తి కలిగి స్వర్గాన్ని లేదా వైకుంఠాన్ని చేరుకుంటారని నమ్మకం. అంతే కాకుండా పితృ దోషాలు తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు, శాంతి నెలకొంటాయి. ముఖ్యంగా  ఏకాదశి వ్రతం  ఆచరించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీ దేవిని కూడా పూజిస్తారు. పితృ దోష నివారణకు ఆచరించాల్సిన పరిహారాలు ఇందిరా ఏకాదశి రోజున పూర్వీకులకు సంబంధించిన పరిహారాలు పాటించడం వల్ల పితృ దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ఈరోజున పూర్వీకులకు తర్పణం వదలడం చాలా ముఖ్యమైనది. నల్ల నువ్వులు నీటిలో కలిపి దక్షిణ ముఖ...

దేవాలయాలలో భక్తులు పాటించవలసిన నియమాలు

    ఆలయంలోకి అడుగుపెట్టిన తరువాత పెద్ద పెద్దగా మాట్లాడకూడదు. లౌకిక విషయాలపై ప్రసంగాలు చేయకూడదు. పక్క వ్యక్తుల గురించి అస్సలు మాట్లాడకూడదు. ఈమధ్యకాలంలో గుడిలోకి వెళ్లాక సెల్‌ఫోన్లలో మాట్లాడటం అలవాటుగా మారింది. ఇలా చేయడం ముమ్మాటికీ పాపమేనని అంటున్నారు పెద్దలు. తోటి భక్తులకు ఇబ్బందులు కలిగేలా ప్రవర్తించకూడదు. అదేవిధంగా రజోగుణసంపన్నమైన విషయాలను ఆలయ ప్రాంగణంలో ప్రదర్శించకూడదు. ప్రతీ ఆలయానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. వస్త్రధారణ కూడా ముఖ్యమైనదే. ఆలయ నియమానుసారమే వస్త్రాలు ధరించి ఆలయంలోకి ప్రవేశించాలి. శౌచం లేకుండా, స్నానాదులు చేయకుండా, బొట్టు లేకుండా గుడకి వెళ్లరాదు. గుడికి వెళ్లేసమయంతో తమతో పాటు కనీసం ఒక పండైనా తీసుకొని వెళ్లాలి. స్వామివారికి నైవేధ్యం సమర్పించాలి. ఇక ప్రదక్షిణ చేసే విధానం కూడా ముఖ్యమే. గబగబా పరుగులు తీసినట్టుగా కాకుండా నిదానంగా చేయాలి. ప్రదక్షిణ చేయకుండా మూలమూర్తిని దర్శించుకోరాదు. అంతేకాదు, ముఖమంటపంలో గోడలకు ఆనుకొని కూర్చోవడం, కాళ్లు జాపుకొని కూర్చోకూడదు. స్వామివారి సన్నిధానంలో ఉండాలని బలంగా కోరుకునే భక్తులు... దేహాన్ని విడిచిన తరువాత ఆలయంలో ఇటుకలు, స్తంభాల రూపంల...