Skip to main content

తర్పణం గురించిన విశేషాలు

  *తర్పణం!*

                   ఎన్ని రకముల తర్పణాలు ఉన్నాయో తెలుసుకుందామా....!

తృప్తినిచ్చే అర్పణం తర్పణం అంటారు.

*1.) తర్పణం అంటే ఏమిటి?

పితృదేవతలకు తృప్తినిచ్చి, వారికి ఊర్ధ్వ లోకాలను ప్రాప్తించేలా చేయడమే తర్పణం. విధి విధానాలను బట్టి, సందర్భాన్ని బట్టి తర్పణం పలురకాలు.

*2. ) తర్పణము ఎన్నిరకాలు ?

తర్పణము రెండు విధములుగా చేయ వచ్చును అవి సకామ లేక నిష్కామములు.

సకామ తర్పణములో కొన్ని ప్రత్యేక ద్రవ్యముల ద్వారా తర్పణము చేస్తారు. నిష్కామ తర్పణము జలముతో చేయబడుతుంది. ఋగ్వేదులు, యజుర్వేదులు, సామ, అధర్వణ వేదాలను అనుసరించేవారు ఒక్కో రకమైన తర్పణ విధానాన్ని అవలంబిస్తారు.

*ప్రధానంగా తర్పణాలు నాలుగు రకాలు.

1-గరుడ తర్పణం : -

ఎవరైనా పరమపదించిన రోజున చేసే తర్పణాన్ని గరుడ తర్పణం అంటారు.

2-బ్రహ్మ యజ్ఞ తర్పణం : -

నిత్యానుష్టానం లో భాగంగా విడిచే తర్పణాలు ఇవి.

3-పర్హెణి తర్పణం : -

యేటా చేసే పితృకర్మల తరువాతిరోజు ఇచ్చే తర్పణాలు.

4-సాధారణ తర్పణం : -

అమావాస్య రోజున, పుణ్యనదీ స్నానాలలో, పుష్కరాలలో, సంక్రమణ, గ్రహణ సమయాలలో విడిచే తర్పణాలు.

మన ఋషులు ఇటువంటి తర్పణాలను 96 పేర్కొన్నారు.

*3.) తర్పణాలు ఎందుకు వదులుతాము?

తర్పణము చేయడము వలన దేవతలు శీఘ్రముగా సంతుష్టులౌతారు. లేదా వారిని సంతృప్తి పరచే విధిని తర్పణము అని అందురు. దేవతలను ప్రసన్నము చేసుకొనబడుటకు, వారిని ప్రీతీ చేయుట కొరకు ఈ తర్పణము వదల బడుతుంది.

*4.) ఏ తర్పణానికి ఎటువంటి ఫలితం ఉంటుంది ?

1. తేనె ద్వారా తర్పణము చేయడము వలన అన్ని కోరికలు నెర వేరుతాయి, అన్ని పాతకములు నాశనము అవుతాయి.

2. కర్పూర జలముతో తర్పణము చేస్తే, రాజు వశ మౌతాడు .

3. పసుపు కలిపిన జలముతో తర్పణము చేస్తే, సామాన్య వ్యక్తి వశమౌతాడు.

4. ఆవు నేతితో తర్పణము చేస్తే, …….సుఖము

5. కొబ్బరి నీళ్ళతో తర్పణము చేస్తే, ……. సర్వ సిద్ధి

6. మిరియాలు కలిపిన జలముతో తర్పణము చేస్తే.. శత్రు నాశనము.

*5. )తర్పణం ఎలా వదలాలి ?

కల్పోక్త ప్రకారముగా సాధకుడు, స్నాన, పూజా, హోమ సమయము లందు ప్రతి రోజు దేవతల ప్రీతి కొరకు తర్పణము గావించవలయును. దేవతలకు వారి నామ మంత్రములు ఉచ్చరించుచు, దేవ తీర్ధము ద్వారా తర్పణము చేయ వలెను. వారి నామములకు “స్వాహా” చేర్చి తర్పణము లీయవలెను.

(అగ్ని పురాణము, బ్రహ్మ పురాణము, మంత్ర మహోదధి నుంచి సేకరించ బడినది)


Comments

Popular posts from this blog

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి. 

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-