ఇందిరా ఏకాదశి అనేది భాద్రపద మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఎంతో పవిత్రమైన, విశేషమైన ఏకాదశి . సాధారణంగా ఇది పితృ పక్షంలో వస్తుంది కాబట్టి పితృ దేవతలకు, పూర్వీకులకు అంకితం చేయబడిన ఏకాదశిగా దీన్ని పరిగణిస్తారు. ఈ ఇందిరా ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించడం, ఏకాదశి ఉపవాసం ఉండటం వల్ల పూర్వీకుల ఆత్మ శాంతిస్తుందని, అలాగే వారికి మోక్షం లభిస్తుందని పురాణోక్తి.
అలాగే.. ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల పాపాల నుంచి విముక్తి కలిగి స్వర్గాన్ని లేదా వైకుంఠాన్ని చేరుకుంటారని నమ్మకం. అంతే కాకుండా పితృ దోషాలు తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు, శాంతి నెలకొంటాయి. ముఖ్యంగా ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీ దేవిని కూడా పూజిస్తారు.
Comments
Post a Comment