ఆలయంలోకి అడుగుపెట్టిన తరువాత పెద్ద పెద్దగా మాట్లాడకూడదు. లౌకిక విషయాలపై ప్రసంగాలు చేయకూడదు. పక్క వ్యక్తుల గురించి అస్సలు మాట్లాడకూడదు. ఈమధ్యకాలంలో గుడిలోకి వెళ్లాక సెల్‌ఫోన్లలో మాట్లాడటం అలవాటుగా మారింది. ఇలా చేయడం ముమ్మాటికీ పాపమేనని అంటున్నారు పెద్దలు. తోటి భక్తులకు ఇబ్బందులు కలిగేలా ప్రవర్తించకూడదు. అదేవిధంగా రజోగుణసంపన్నమైన విషయాలను ఆలయ ప్రాంగణంలో ప్రదర్శించకూడదు.
ప్రతీ ఆలయానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. వస్త్రధారణ కూడా ముఖ్యమైనదే. ఆలయ నియమానుసారమే వస్త్రాలు ధరించి ఆలయంలోకి ప్రవేశించాలి. శౌచం లేకుండా, స్నానాదులు చేయకుండా, బొట్టు లేకుండా గుడకి వెళ్లరాదు. గుడికి వెళ్లేసమయంతో తమతో పాటు కనీసం ఒక పండైనా తీసుకొని వెళ్లాలి. స్వామివారికి నైవేధ్యం సమర్పించాలి. ఇక ప్రదక్షిణ చేసే విధానం కూడా ముఖ్యమే. గబగబా పరుగులు తీసినట్టుగా కాకుండా నిదానంగా చేయాలి. ప్రదక్షిణ చేయకుండా మూలమూర్తిని దర్శించుకోరాదు. అంతేకాదు, ముఖమంటపంలో గోడలకు ఆనుకొని కూర్చోవడం, కాళ్లు జాపుకొని కూర్చోకూడదు. స్వామివారి సన్నిధానంలో ఉండాలని బలంగా కోరుకునే భక్తులు... దేహాన్ని విడిచిన తరువాత ఆలయంలో ఇటుకలు, స్తంభాల రూపంలో వస్తారని నమ్ముతారు.
Comments
Post a Comment