నవరాత్రుల నవమి నాడు హోమం చేయాలనే నియమం కూడా ఉంది. ఇందులో సహస్రనామాలను పఠిస్తూ అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు. మహార్నవమి రోజున అమ్మవారికి పిండివంటలతో పాటు చెరుకుగడలు నైవేద్యంగా సమర్పిస్తారు. మహానవమి చేసే పూజలు ముఖ్యంగా ఫలవంతమైనవిగా పరిగణించబడతాయి.
విజయ దశమి పూజ అనేది పున: పూజ, ఉద్వాసన మాత్రమే అని నిర్ణయ సింధువులో స్పష్టంగా తెలియజేయబడినది. ప్రధానపూజ నవమి రోజే చేయాలి. నవమి పూజ చేసిన వారే దశమి రోజు పున: పూజ చేస్తారు.
మహర్నవమి నాడు అమ్మవారిని ''అపరాజిత''గా పూజిస్తారు. మహిషాసురమర్దినిగా అలంకరించి ఆరాధిస్తారు.
వివిద రకాల పిండి వంటలు, చెరుకు గడలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ మొదలైన ప్రదేశాల్లో మహర్నవమి రోజున ''కన్యా పూజ'' నిర్వహిస్తారు. నవరాత్రులను పురస్కరించుకుని తొమ్మిదిమంది కన్యా రూపాలు సంకేత పూర్వకంగా ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆ శక్తి స్వరూపాలను ఆరాధిస్తారు. అమ్మవారికి అభిషేకం చేసి ముఖాన కుంకుమ దిద్ది, కొత్త బట్టలు సమర్పిస్తారు. ఇంకొన్ని ప్రాంతాల్లో మహర్నవమి నాడు సువాసిని పూజ, దంపతి పూజ జరుపుకుంటారు.
అమ్మ దుర్గాదేవి అనేకావతారాల్లో అపరాజితాదేవి దుర్మార్గులను ఓడించి సన్మార్గులకు సుఖజీవనాన్ని అందించే అవతారం అపరాజిత - అంటే ఏవరి చేతా ఓడించబడనిది అని అర్ధం.
మహర్నవమి నాడు ఆయుధ పూజ చేసే సంప్రదాయం కొనసాగుతోంది.
Comments
Post a Comment