Skip to main content

Posts

Showing posts from May, 2020

Nakshatra Suktam | Correct Pronunciation

నవగ్రహ,శివ, hanuman పూజ ఐటమ్స్

pushyam star shaanthi , శివాభిషేకం, hanuman sindoora puja , అభిషేకం పూజ సామాన్:- పసుపు, 200 గ్రాములు, కుంకుం 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా, బియ్యం ౩ కిలొలు, తమల పాకులు 50, నల్లని పోక వక్కలు 40, కజూర్ కాయలు 35, అరటి పండ్లు, ౨ దజాన్, కొబ్బరి కాయలు, 13, పూలు, పూల దండలు, small size 9, bix size 2, ఆవు పాలు, 1 లీటర్లు,   పెరుగు కిలో, ఆవు నెయ్యి 1 కిలో, బెల్లం కిలో, ఉప్పు కిలో, అగర్బతి ప్యాకెట్, కర్పూరం ప్యాకెట్, తేనె ౧/౨ కిలో, చక్కర  1/2 కిలో, హోమం సమిధలు 5 కట్టలు, హోమం పౌడర్, 1 ప్యాకెట్, మట్టి గిన్నె,1 పూర్ణాహుతి ప్యాకెట్,1 హనుమంతునికి చిందూరం 1/2 కిలొ. నువ్వుల నూనె 1/2 కిలొ,పన్ని ఒక పాకెట్.  పూజ దక్షిణ మట్టి చిప్ప ఒకటి.  దీపం వత్తులు, బ్రాహ్మణ దక్షిణ 2,000/-

17-5-2020 ఆదివారం నాడు హనుమాన్ జయంతి

ఆదివారం వైశాఖ బహుళ దశమి  "శ్రీ హనుమాన్ జయంతి " సందర్భంగా భగవద్బవులందరి సహకారం తో  ఉదయం పంచామృత అభిషేకాలు మన్యుసూక్తం,పురుష,శ్రీ సూక్తాలతో మరియు  రుద్రం వేద మంత్రాలతో చేయబడును.   ప్రతి  రోజూ సాయంత్రం 6-30 సమయంలో హనుమాన్ చాలీస  3 సార్లు పారాయణ,శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం  చేసి స్వామి వారికి ప్రసాదం నివేదన చేసి మంగళ హారతి ఇచ్చి, జయంతి రోజున   సాయంత్రం  11 సార్లు చాలీస పారాయణ చేసి, ప్రసాదం నివేదన చేసి , మంగళ నీరాజనం స్వామి కి ఇచ్చి కరోన వ్యాధి పూర్తిగ నివారించి ప్రజలందరికీ ఆయురారోగ్యాలను ప్రసాదించమని ఆంజనేయ స్వామి ని  వేడుకుందాం .  జై బోలో  హనుమాన్ మహారాజ్ కీ ..... జై   🌺జై శ్రీమన్నారాయణ 🌺              ఇట్లు  రాచకొండ రామాచార్యులు, శ్రీ వైష్ణవ ఆగమ శాస్త్ర పూజారి, శ్రీ రామ లింగేశ్వర స్వామి దేవాలయం, మయూరిమర్గ్,బేగంపేట్, హైదరాబాద్. 

Ist year death ceremony puja items

నల్లని నువ్వులు 50 grams, , బియ్యము 6 packets , ఒక్కొక్కటి కిలో చొప్పున    ,   తమల పాకులు 25, వక్కలు 15, ఆవు నెయ్యి  100 grams  5 పాకెట్లు  ,పెరుగు డబ్బాలు 5 చిన్నవి, బియ్యం పిండి 1/2 కిలో, (పిండాలకు), నల్లని నువ్వులు 100 గ్రాములు , ప్లాస్టిక్ గ్లాసులు 5, ఆవు పాలు, ఆవు మూత్రం, ఆవు పేడ కొంచెం, గందం కొంచెము  , మోదుగ ఆకు  విస్తార్లు 10 , దొప్పలు 10, రూపాయి బిళ్ళలు, 15,  ఆచమనం పాత్ర, అరటి పండ్లు 1 డజన్  ,తేనె,ఫోటో కు   పూల మాల, 1,కుల్లా   పూలు 1/4 kilo, తులసి దళాలు , అగర్బతి ప్యాకెట్, కర్పూరం ప్యాకెట్, హోమం కట్టెలు, ఆవు నెయ్యి 1/2 కిలో,ముగ్గు పిండి 50 గ్రాములు,  దర్భ  కట్ట 1,అయ్యగారికి ఆకు కూరలు కిలో , చింతపండు కిలో , ఉప్పు కిలో ,బెల్లం కిలో ,మిరపకాయలు  కిలో,ఎండు మిర్చిపొడి కిలో,   జీలకర్ర,200 గ్రాములు,  మిరియాలు,2 00 గ్రాములు,  ధనియాలు,200 గ్రాములు,దోవతి, ఉత్తరీయం, చెప్పులు, గొడుగు, బెడ్ షీట్ 1,    అయ్యగారి దక్షిణ  2,5 16 /-

నరసింహ స్వామి జయంతి 6-5-2020 బుధవారం

విష్ణుమూర్తి యొక్క దశావతారాలలోని 4వ అవతారమే నరసింహస్వామి. నృసింహ జయంతి వైశాఖ శుక్ల చతుర్ధతి 6-5-2020 బుధవారం  నాడు జరుపుకొంటారు. నరసింహస్వామి రూపంలో దేహం మానవ రూపం, తల సింహం రూపంలో అవతరించిన దేవుడు.నృసింహస్వామి మాహా శక్తి వంతమైన దేవుడు. ఈ రోజున విష్ణుమూర్తి హిరణ్యకశిపుడిని సంహరించి, ధర్మాన్ని నిలబెట్టాడు కాబట్టి నృసింహ జయంతిని వేడుకగా జరుపుకొంటారు.నరసింహ స్వామి మంత్రం జపం, కరావలంభ స్త్రోత్రాలు చేద్దాం. రామా చార్యులు, పూజారి, శ్రీ రామ లింగేశ్వర స్వామి దేవాలయం, మయూరిమర్గ్, బేగంపేట్, హైదరాబాద్. 

పత్రం, పుష్పం, ఫలం, తోయం.........

భగవంతునికి   ఎవరైనా భక్తితో ఒక ఆకుగాని , ఒక పువ్వు గాని , ఒక పండు గాని , లేదా నీరైనా గాని సమర్పిస్తే , ఆ స్వచ్ఛమైన మనస్సుగల నా భక్తుని చే ప్రేమతో ఇవ్వబడిన దానిని , భగవంతుడు   సంతోషంగా ఆరగిస్తాడు. పరమేశ్వరుడిని ఆరాధించటం వలన కలిగే ప్రయోజనాలను , శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు , అది ఎంత సులువైనదో వివరిస్తున్నాడు. దేవతల మరియు పితృదేవతల ఆరాధనలో , వారిని ప్రసన్నం చేయటానికి నిష్ఠగా ఆచరించవలసిన ఎన్నో నియమాలు ఉన్నాయి. కానీ , భగవంతుడు తనకు ప్రేమ నిండిన హృదయంతో తో సమర్పించబడిన ఏదైనా స్వీకరిస్తాడు. మీ దగ్గర కేవలం ఒక పండు ఉంటే అది సమర్పించండి , భగవంతుడు సంతోషిస్తాడు. ఒకవేళ పండు లేకపోతే ఒక పువ్వు సమర్పించండి. అది పుష్పించే కాలం కాకపొతే భగవంతునికి కేవలం ఒక ఆకు సమర్పించండి ; ప్రేమతో ఇచ్చినప్పుడు అది కూడా సరిపోతుంది. ఒకవేళ ఆకులు కూడా దొరకకపోతే , అంతటా లభ్యమయ్యే నీటిని సమర్పించండి , కానీ ఇక్కడ కూడా అది ప్రేమ/భక్తితో ఇవ్వబడాలి. భక్త్యా అన్న పదం ఇక్కడ మొదటి మరియు రెండవ భాగాల్లో రెంటిలో వాడబడింది. ఆరాధించే వాని (భక్తుని) యొక్క భక్తి మాత్రమే భగవంతుడిని ప్రసన్నం చేస్తుంది , ఆ సమర్పించబడిన వస్తువు య...

వైశాఖ మాస ఏకాదశి 3-5-2020 ఆదివారం

శ్రీమహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన మాసం .. ' వైశాఖమాసం '. అనేక పుణ్యవిశేషాలను తనలో దాచుకున్నదిగా ఈ మాసం కనిపిస్తుంది. ఆ క్రమంలో వచ్చే వైశాఖశుద్ధ ఏకాదశి తేది ౩-5-2020 ఆదివారం నాడు   కూడా ఎంతో విశేషాన్నీ, విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. అందుకే ఏకాదశి రోజున ఆ శ్రీ సీత రామచంద్రుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. ఆ స్వామి నామాన్ని స్మరిస్తూ .. స్తోత్రాలు పఠిస్తూ .. కీర్తనలు ఆలపిస్తూ .. పారాయణాలు చేయాలి. ఉపవాస దీక్షను చేపట్టి .. జాగరణతో స్వామిని సేవించాలి. ఈ విధంగా చేయడం వలన సంపదలు .. సంతోషాలే కాదు , మోక్షానికి అవసరమైన అర్హత లభిస్తుందని స్పష్టం చేయబడుతోంది. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, మయూరిమార్గ్,బేగంపేట్, హైదరాబాద్.

పుట్టిన రోజున చదివే శ్లోకం మరియు తీసుకొనే ప్రసాదం

సప్త చిరంజీవి శ్లోకాన్ని పుట్టినరోజు నాడు చదవాలని పండితులు చెప్తున్నారు. పుట్టిన రోజునాడు ఆవు పాలు, బెల్లము, నల్లనువ్వులు కలిపిన మిశ్రమాన్ని నివేదన చేసి ఈ క్రింది శ్లోకం చదివి తీర్ధంగా మూడు సార్లు తీసుకోవడం ద్వారా అపమృత్యు దోషం తొలుగుతుంది. సప్త చిరంజీవి శ్లోకం : అశ్వత్థామ, బలిర్వర్యాసో, హనుమాంశ్చ విభీషణ ! కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవనః !! సప్తైతాన్ సంస్మరేన్నిత్యమ్ మార్కండేయ యథాష్టమమ్! జీవేద్వర్శశతమ్ ప్రాజ్ఞః అపమృత్యు వివర్జితః !! చిరంజీవులు అంటే చిరకాలం జీవించి వుండేవారని అర్థం. కానీ అంతం లేని వారని కాదు. శాశ్వత కీర్తి కలిగిన వారే చిరంజీవులు. అశ్వత్థామా, బలిచక్రవర్తి, వ్యాసుడూ, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరుశురాముడు.. వీరు ఏడుగురు చిరంజీవులు. హనుమంతుడు భవిష్య బ్రహ్మ, బలి చక్రవర్తి భవిష్య ఇంద్రుడు. నిత్యం వీరిని స్మరించడం వల్ల ఆనందంగా వందేళ్ళు జీవిస్తారు. శ్రీ రామ లింగేశ్వర దేవాలయం పూజారి, మయూరిమార్గ్, ,బేగంపేట్, హైదరాబాద్.