భగవంతునికి ఎవరైనా భక్తితో ఒక ఆకుగాని, ఒక పువ్వు
గాని, ఒక పండు గాని, లేదా నీరైనా గాని సమర్పిస్తే, ఆ స్వచ్ఛమైన
మనస్సుగల నా భక్తుని చే ప్రేమతో ఇవ్వబడిన దానిని, భగవంతుడు సంతోషంగా ఆరగిస్తాడు.
పరమేశ్వరుడిని ఆరాధించటం వలన కలిగే
ప్రయోజనాలను , శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు, అది ఎంత
సులువైనదో వివరిస్తున్నాడు. దేవతల మరియు పితృదేవతల ఆరాధనలో, వారిని
ప్రసన్నం చేయటానికి నిష్ఠగా ఆచరించవలసిన ఎన్నో నియమాలు ఉన్నాయి. కానీ, భగవంతుడు తనకు
ప్రేమ నిండిన హృదయంతో తో సమర్పించబడిన ఏదైనా స్వీకరిస్తాడు. మీ దగ్గర కేవలం ఒక
పండు ఉంటే అది సమర్పించండి, భగవంతుడు సంతోషిస్తాడు. ఒకవేళ పండు లేకపోతే
ఒక పువ్వు సమర్పించండి. అది పుష్పించే కాలం కాకపొతే భగవంతునికి కేవలం ఒక ఆకు
సమర్పించండి; ప్రేమతో ఇచ్చినప్పుడు అది కూడా సరిపోతుంది.
ఒకవేళ ఆకులు కూడా దొరకకపోతే, అంతటా లభ్యమయ్యే నీటిని సమర్పించండి, కానీ ఇక్కడ
కూడా అది ప్రేమ/భక్తితో ఇవ్వబడాలి. భక్త్యా అన్న పదం ఇక్కడ మొదటి మరియు రెండవ
భాగాల్లో రెంటిలో వాడబడింది. ఆరాధించే వాని (భక్తుని) యొక్క భక్తి మాత్రమే
భగవంతుడిని ప్రసన్నం చేస్తుంది, ఆ సమర్పించబడిన వస్తువు యొక్క విలువ కాదు.
ఈ అద్భుతమైన ప్రకటన చేయటంతో, శ్రీ కృష్ణుడు
భగవంతుని యొక్క కరుణాపూరిత స్వభావాన్ని తెలియచేస్తున్నాడు. తనకు సమర్పించబడిన
వస్తువు యొక్క భౌతిక విలువ ఆయనకు అవసరం లేదు. అన్నింటికన్నా ఎక్కువగా, ఎంత ప్రేమగా
ఇచ్చామో అనేదే అయనకు ముఖ్యం.
Comments
Post a Comment