శని త్రయోదశి అంటే శనివారం
రోజు త్రయోదశి తిధి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామి
వారిని నువ్వులతో,నూనేతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు. శనీశ్వరుడికి
నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. కుటుంబ,ఉద్యోగ,వ్యాపార,ఆరోగ్య ,కోర్టు కేసులు, శత్రువులు,రుణాలు
నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని నియమాలు పాటిస్తారు. శనీశ్వరుడి ఆలయం
నుంచి బయటికు వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న బిక్షగాల్లకు,పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కాని
,వస్త్ర,ధన,వస్తు రూపంలో కాని దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి.
పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు రెండు మీటర్ల పోడవు అంటే ఒక లుంగి లాంటిది
ఉండాలి. పూజ తర్వత ఆ వస్రాన్ని దానం చెస్తే దానం తీసుకున్నవారు ఉపయోగించుకునేలా
ఉండాలి అని అర్ధ0. కేవలం నిరుపేదలకు, పేద బ్రాహ్మణులకు, పశు పక్షాదులకు
చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది ఇది గమనించాలి.
ఉదయాననే నువ్వుల నూనేతో ఒళ్ళంతా మర్ధన చేసుకుని తలస్నానం చేయాలి. * ఆ రోజు మద్య,మాంసాలు ముట్టరాదు. * వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది. * శనిగ్రహ స్థానదోషాల వలన బాధపడేవారు నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది. అలాగే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం, లక్ష్మి స్తోత్రం కూడా చదవాలి లేదా వినాలి. * వీలైనంత వరకు ఏపని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి. * అందరిలోను ప్రతీ జీవిలోను దేవున్ని చూడగలగాలి. * ఎవరితోను వాదనలకు దిగరాదు. * ఆరోజు ఆకలితో ఉన్న వారికి,పశు పక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది. * ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి నువ్వుల నూనే రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. * మూగ జీవులకు ఆహార గ్రాసలను,నీటిని ఏర్పాటు చేయాలి. * కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వులనూనేతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి. * అనాధలకు,అవిటి వారికి,పేద వితంతువులకు,పేద వృద్ధులకు ఏదో రూపంగా సహయపడాలి. * జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి. * ప్రతి రోజు తలి దండ్రుల పాద నమస్కారం చేసుకోవాలి. * అత్త మామలను ,వంట చేసి వడ్డించిన వారిని,మన మేలు కోరేవారిని,ఉద్యోగం ఇప్పించిన వారిని,ఆపధ కాలంలో సహాయంగా నిలచిన వారిని ఎట్టి పరిస్థితులలో నిందించరాదు.
Comments
Post a Comment