ప్రతి నెలలోను వచ్చే బహుళ చతుర్దశిని మాస శివరాత్రి అంటారు.
ఈ నెల 19-7-2020 ఆదివారం నాడు మాసశివరాత్రి. శివుడికి ఈ రోజును ప్రీతి పాత్రమైన రోజుగా
చెపుతారు. ఈ రోజున శివుడికి అభిషేకాలు, పూజలు చేయడం వలన కోరిన కోరిన
కోర్కెలు నెరవేరుతాయి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108సార్లు జపించాలి. ఇలా చేసిన వారికి పాపాలు పోయి వారికి
కైలాస ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. శివుడికి ఆలయాల్లో పంచామృతాలతో
అభిషేకం చేస్తే ఈతి బాధలు, తొలగిపోతాయి. దారిద్య్రం
దరిదాపులకు కూడా రాదని మన పెద్దలు చెబుతున్నారు. రాచకొండ రామాచార్యులు, పూజారి, శ్రీ రామలింగేశ్వర స్వామి
దేవాలయం, మయూరిమార్గ్,బేగంపేట్, హైదరాబాద్.
ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము , 2.సంగవకాలము , 3. మధ్యాహ్నకాలము , 4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. · ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా , వ్రత , శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. · ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. · ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...
Comments
Post a Comment