శ్రవణ నక్షత్రం ప్రవేశంతో వచ్చేదే శ్రావణ మాసం. తేదీ 17-8-2023 గురువారం నుండి నిజ శ్రావణ మాసం ప్రారంభo . ముక్కంటికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం శ్రావణం. అలాగే శ్రీనివాసుడి జన్మ నక్షత్రం కూడ శ్రావణమే. కాబట్టి తేదీ 29-8-2023 నాడు సాయంత్రం మన దేవాలయం లో స్వామి వారి మాస కళ్యాణం . శ్రీకృష్ణుడు అవతరించింది శ్రావణ మాసంలోనే.. బలిచక్రవర్తికి పట్టాభిషేకం జరిగిన మాసం.. భక్తి మార్గాల్లో శ్రవణభక్తి మొదటిది. శ్రవణ నక్షత్రానికి అధిపతి శివుడు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజిస్తాడని ప్రతీతి. అందుకే శ్రావణ మాసానికి ప్రత్యేకత సంతరించుకున్నది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు విశిష్టతే. ఈ మాసమంతా శ్రవణ నక్షత్రం ఉండటమే కారణమని పండితులు చెబుతున్నారు. రాచకొండ రామాచార్యులు, పూజారి, శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం,మైత్రినగర్, ఫేజ్ II , మదీనగూడ , హైదరాబాద్.
హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని , ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు , ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా , అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై , సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి , భవిష్యత్ దంపతులుగా , కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ , జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో , ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...
Comments
Post a Comment