Skip to main content

Posts

Showing posts from March, 2022

ఫాల్గుణ మాసం అమావాస్య నాడు చేయాల్సిన విధి

  తెలుగు నెలల్లో చివరి నెల అయిన ఫాల్గుణ మాసంలో అంటే ఏప్రిల్ 1  తేదీన శుక్రవారం  నాడు ఫాల్గుణ అమావాస్య వచ్చింది. ఈ పవిత్రమైన రోజున నదిలో స్నానం చేయడం, దానం చేయడం వంటి అనేక సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. ఈ అమావాస్య పూర్వీకులకు అంకితం ఇవ్వబడింది. ఫాల్గుణ అమావాస్య రోజున దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తులందరూ ఉదయాన్నే నిద్ర లేచి పవిత్ర నదులలో స్నానం చేస్తారు. ఈ పవిత్రమైన రోజున స్నానమాచరించి దానధర్మాలు చేయాలి. ఈరోజున ఉపవాసం ఉంటూ పూజలు చేస్తే పూర్వీకుల మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. పేదలకు వస్త్రాలను దానం చేయాలి. అలాగే ఈరోజున పూర్వీకులకు తర్పణం చేయాలి. * ఈరోజున పూర్వీకులను సంత్రుప్తి పరిస్తే.. మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అంతేకాదు ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయి. చేయకూడనివి.. * ఈ ఫాల్గుణ అమావాస్య రోజున పగటిపూట పొరపాటున కూడా నిద్రపోకూడదు. * ఈరోజున వెల్లుల్లి, ఉల్లి, మాంసం, ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు. * ఈరోజున నలుపు రంగు దుస్తులను ధరించరాదు. అలాగే శుభ్రమైన బట్టలు ధరించాలి. * ఈరోజున కచ్చితంగా బ్రహ్మచార్యాన్ని పాటించాలి. ...

త్వరగా వివాహం అగుటకు చిట్కాలు

H ere have a look at the remedies to get married: If you are short of good proposals to marry off the girl, give her to wear yellow clothes on Thursday and white clothes on Friday. If these clothes are new, that’s better. Do it for 4 weeks and you will surely get good proposals. Therefore, no cloth should be repeated. If marriage negotiation is breaking down repeatedly after reaching final stages, make it a point to put off shoes/slippers before entering the room where talks are taking place. Visit lord Venkateshwara swamy temple on Shravana nakstram and observe the lord kalyaanam  Read/listen Rukmini Kalyanam story frequently  carefully till get marriage. People fall between the age of 36-40 should get 108 bel patra leaves and write Lord Rama’s name with sandalwood paste. Now offer these bel patra leaves onto Shivlinga, while chanting- “Om Namah Shivay”. Boys and girls whose marriage is getting delayed should mix a little turmeric powder in their bath water and after taking t...

నామ కరణం పద్దతి

  “నామాఖిలస్య వ్యవహార హేతుః శుభావహం కర్మసు భాగ్య హేతుః నామ్నేవ కీర్తిః లభతే మనుష్య స్తతః ప్రశస్తం ఖలు నామ కర్మ”  అని వీరమిత్రోదయ సంస్కార ప్రకాశికలో బృహస్పతి పేర్కొనటం జరిగింది. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి నుండి విడిగా గుర్తించటానికి పేరే కారణ మవుతుంది. తనదైన ప్రత్యేక నామం లేక సంజ్ఞ లేక పేరు లేక పోతే సమాజంలో వ్యవహరించటం కష్టం. పేరు వ్యవహారానికి వీలుగా ఉండటమే కాదు, శుభాలను, అదృష్టాన్ని  కలిగిస్తుంది. కీర్తికి  కారణ మౌతుంది. ఒకప్పుడు గురువులు లేదా వంశ పురోహితులు జీవుడి లక్షణాన్ని బట్టి నామ కరణం చేసే వారు. తరువాతి కాలంలో తల్లి తండ్రులు కాని, ఇంటిలోని పెద్దలు కాని తమ అభిరుచులు, ఆదర్శాలు, ఇష్టాల ననుసరించి పేరు పెట్టటం ఆనవాయితీగా వస్తోంది. పేరును బట్టి పెట్టిన వారి సంస్కారం వ్యక్తమౌతుంది.  అంతే  కాదు పేరుని బట్టి వ్యక్తి జీవితం ఉంటుందనే నమ్మకం కూడా చాలా మందిలో ఈ నాడు కనపడుతోంది.  “ఆయుర్వర్చోభి వృద్ధిశ్చ సిద్ధిర్వ్యవహృతే స్తదా          నామకరణ ఫలంత్వే తత్సముద్దిష్టమ్ మనీషిభిః ”   శిశువుకి ఆనందం, ఆయుస్సు, తేజస్సు, కీర్త...

సంకష్ట హర చవితి తేదీ 19-5--2022 గురువారం

  గ ణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిథి . అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు. మొదటిది వరదచతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు(సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితి (19-5--2022 గురు వారం నాడు ) గా పరిగణించాలి. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి.సంకటాలు నివారణకై పచ్చి గరిక తో పూజలు,అభిషేకం,అర్చనలు , గణపతి నైవేద్యాలు, గణపతి ఉపనిషద్ పారాయణం చేయటం,అష్టకాల పారాయనాలు  , గ కార సహస్ర నామo  చాలా మంచిది. 

నృసింహ ద్వాదశి తేదీ 15-3-2022 ప్రత్యేకత

 ఫాల్గుణ మాసం శుద్ధ ద్వాదశి ని నృసింహ ద్వాదశి/గోవింద ద్వాదశి అని పిలుస్తారు.    ఈ రోజున హిందూ భక్తులు విష్ణువును సంతోషకరమైన మరియు సంపన్నమైన జీవితం కోసం తన దైవిక ఆశీర్వాదం కోరుకుంటారు. విష్ణువు యొక్క 'నరసింహ' అవతారం ఈ రోజున పూజిస్తారు .   గోవింద ద్వాదశి రోజున, గంగా, సరస్వతి, యమునా మరియు గోదావరి వంటి పవిత్ర నదులలో ఉత్సవ స్నాన వేడుక చేయడానికి భక్తులు సూర్యోదయానికి ముందే లేస్తారు. ఈ పవిత్ర నదులను సందర్శించలేకపోతే, ఈ కర్మ స్నానం ఏ సరస్సులోనైనా లేదా నదుల దగ్గర కూడా చేయవచ్చు. అయితే అలా చేస్తున్నప్పుడు భక్తులు గంగా దేవి మరియు విష్ణువు పేర్లను జపించాలి.  భగవంతుడు విష్ణువు యొక్క 'పుండారికా క్ష' రూపాన్ని గోవింద ద్వాదశి గా  పూజిస్తారు.  పండ్లు, పువ్వులు, గంధపు పేస్ట్, నువ్వులు, మరియు ధూపం కర్రల రూపంలో ప్రభువుకు అనేక నైవేద్యాలు చేస్తారు. గోవింద ద్వాదశి నాడు, భక్తులు సాయంత్రం విష్ణు దేవాలయాలను సందర్శించి అక్కడ జరిగే పూజ ఆచారాలలో పాల్గొంటారు. విష్ణువు పేరు జపించడం మరియు 'శ్రీ నరసింహ కవచం' మంత్రాన్ని పఠించడం గోవింద ద్వాదశిపై చాలా అనుకూలమైనదిగా భావిస్తారు. అందుచేత...

అమలైకాదశి తేదీ 14 -3-2022 సోమ వారం

 ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి ని అమలై కాదశి అని అంటారు. ఆహార నియమాలు తప్పకుండా పాటించాలి. వివిధ ఆహార దినుసులు ఆహారంలో ఉండేట్టు చూసుకోవాలి.  చంద్రుడు ప్రభావం మన దేహంపై చూపిస్తూ ఉంటాడు. మన దేహం పెరిగేది ఆహారం వల్ల. ఆహారాన్ని పెంచేవాడు చంద్రుడు అని ఆయనకి ఓషధీపతి అని పేరు పెట్టాయి మన శాస్త్రాలు. మనం తినే బియ్యం, పప్పులు మొదలుకొని అన్నింటినీ ఓషధులు అని అంటారు. భగవంతునికి నివేదిన పెట్టిన తరువాతనే భుజించాలి. భగవంతుడు అంటే సర్వమూ  ఇచ్చేవాడు. కాబట్టి పరమాత్మకు నివేదించకుండా తినగూడదు అని పెద్దల వచనం.  అన్న ప్రసాదం వ్యర్ధం చేయడం మహా మహా పాపం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకే ఆకలి ఉన్నవాడికి పెట్టి మనం తినాలి అని శాస్త్రాలు గోషిస్తున్నాయి. 

ఫాల్గుణ మాసం విశిష్టత

  ఆర్థిక ఇబ్బందులుపడుతున్న వారు ఫాల్గుణ మాసం (తేదీ 3-3-2022 నుండి)   లక్ష్మీదేవి ని భక్తిశ్రద్ధలతో పూజిస్తే.. ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయి. అలాగే శుక్ల ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువును ఆరాధించడం ఎంతో మంచింది.   ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని అమలకీ ఏకాదశి అంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజిస్తే ఆయన  అనుగ్రహం  పొందొచ్చు.  ఫాల్గుణ మాసంలో మొదటి పెన్నెండు రోజులు అంటే శుక్లపక్షపాడ్యమి మొదలు ద్వాదశి వరకూ శ్రీమహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన రోజులు. ప్రతి రోజూ తెల్లవారు ఘామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని శిరస్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చిన అనంతరం శ్రీమహావిష్ణువును షోడశోపచారాలు అష్టోత్తరాలతో పూజించి పాలను నైవేద్యంగా సమర్పించాలి. ఈ పన్నెండు రోజుల్లో ఒకరోజుగానీ లేదంటే ద్వాదశి నాడుగానీ వస్త్రాలు వివిధ దాన్యాలను గురువులకు లేదా గోమాతకు దానముగా ఇవ్వడం మంచిది. శక్తివున్నవారు ఏదైనా వైష్ణవాలయానికి ఆవును దానమివ్వడం విశేష ఫలితాలనిస్తుంది. పూర్ణిమనాడు పరమశివుడిని, శ్రీకృష్ణపరమాత్మను, మహాలక్ష్మినీ పూజించడంతో పాటూ "లింగపురాణం" ను దానముగా ఇవ్వ...

వాస్తు హోమం పూజ సామగ్రి

  పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 5 కిలోలు,  దోవతి, ఉత్తరీయం  అంచుతో 1 , కనుములు 3, (blouse peaces ) ఆవు పేడ  కొంచెం, ఆవు మూత్రం 200 ml  తమల పాకులు 100 , వక్కలు 35  , ఖర్జూరం పాకెట్ 1,  అరటి పండ్లు 2  డజన్ , అయిదు రకాల పండ్లు,  ఆగరబతి packet, సాంబ్రాణి  powder పొగ  కర్పూరం పాకెట్  మామిడి కొమ్మలు,  రాగి కలశం చెంబులు 3 , దీపాలు 2 ఆవు నెయ్యితో  వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి  బిళ్ళలు  21  పూలు,  1/2 kg. చిన్నవి పూల దండలు 3,  బూడిద గుమ్మడి కాయ, 1  రాచ గుమ్మడి కాయ 1, ఉట్టి తో సహ టెంకాయలు 8, హోమం సమిదలు పెద్దవి 5 కట్టలు ,  హోమం పౌడర్ పాకెట్,  పూర్ణాహుతి పాకెట్ చిన్నది, 1, ఇటుకలు 24 , సన్నని ఇసుక సగం సిమెంట్ bag  మట్టిది పెద్ద చిప్ప, 2,++ ఆవు నెయ్యి కిలో,  తెల్లని ఆవాలు, 50 గ్రాములు, నవ ధాన్యాలు 1/2 కిలో,  పేపర్ plates 2, పాయసం ప్రసాదం, ప్లాస్టిక్ గ్లాసులు 5,  ఆచమనం పాత్ర 1 బ్రాహ్మణ  పూజ దక్షిణ  మాత్రమే  ...

మౌని అమావాస్య తేదీ 2-3-2022 బుధవారం

  మాఘ మాసం లో  ఈ మౌని అమావాస్య ఒకటి. దీనిని మాఘీ అమావాస్య అని కూడా అంటారు. 'మౌని' అనేది సంస్కృత పదం.‘మౌన్’ నుంచి మౌని అనే పదం వచ్చింది. మౌని అంటే అర్థం ‘సంపూర్ణ నిశ్సబ్దం’. అందుకే ఈరోజున పూజలు చేసేవారంత మౌనవ్రతం చేస్తారు. గంగానది నీరు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని నమ్ముతారు.  పవిత్ర నగరాలైన హరిద్వార్, ప్రయాగ్రాజ్ మరియు గంగా నదులలో ఈరోజున వేలాది మంది భక్తులు వచ్చి స్నానమాచరిస్తారు. మౌని అమావాస్య ని  జ్ఞానంను నిద్రలేపే చర్యగా భావించి, దానికోసం మాటలు అవసరం లేదని భావిస్తారు. ఏమీ చెప్పవలసిన అవసరం కానీ, చెప్పగలిగేందుకు కూడా ఏమీ ఉండదని నమ్ముతారు. గంగానది నీరు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని నమ్ముతారు. మౌని అమావాస్య రోజును మాఘి అమావాస్య అని కూడా అంటారు.అమ అంటే చీకటి అని అర్థం. అలాగే వాస్య  అంటే కామం. అమావాస్యకి మరో అర్థం కలిసి వెతకడం. దీని అర్థం పగటిపూట మౌనంగా ఉండి చీకటిని, కామాన్ని తొలగించుకోవాలనేది. చందమామ మన మనస్సులను నియంత్రించే గ్రహమని నమ్ముతుంటారు. మౌని అమావాస్య నాడు చంద్రుడు మనకు కనిపించడు. ఈ రోజు మాట్లాడే మాటలు, తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను కలి...