Skip to main content

Posts

Showing posts from June, 2023

వివస్వత్ సప్తమి తేదీ 25-6 -2023 ఆదివారం

  ఆషాడ మాసంలో శుక్ల పక్షంలోని సప్తమి తిథి నాడు వివస్వత్ సప్తమి జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఇది 25 జూన్ 2023న జరుపుకుంటారు. ఈ రోజున సూర్య దేవు డిని  పూజిస్తారు. సూర్యుడికి చాలా పేర్లు ఉన్నాయి వాటిలో వివస్వత్ ఒకటి. సప్తమి తిథి సూర్య దేవుడిని ఆరాధించడానికి పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అందుకే సప్తమి తిథి నాడు సూర్య దేవుడిని పూజించాలని గ్రంధాలలో నిర్దేశించబడింది.ఒక రాగి చెంబులో శుద్ధ నీరు పోసి ఎర్రని పుష్పాలు, ఎర్ర చెందనం పొడి వేసి సూర్యునికి అర్గ్యమ్ ఇవ్వాలి. ఆదిత్య హృదయం చదువుకోవాలి. ఆరోగ్య వoతులు అవుతారు. 

గో క్షీరం తో దేవునికి అభిషేక0 ఎందుకు ?

గో క్షీరం తో   అభిషేకం అనేది సర్వశక్తిమంతుడిని ఉత్తేజపరిచే అభ్యంగనము. పూజా  ఆగమాలను ఉదహరిస్తూ, , నీరు, పాలు మరియు ఇతర  పదార్థాలతో దేవుడిని  పూజించడం వల్ల  శక్తి శుద్ధి అవుతుందని  పేర్కొంది. నీరు ప్రాథమికంగా ఎలక్ట్రోలైట్ అని నమ్ముతారు, ఇది గాలి కంటే చాలా వేగంగా శక్తిని ప్రసారం చేస్తుంది. అ భిషేకం చేయడం వల్ల దేవుడు  సంతోషిస్తాడు మరియు అతను మన చింతలు మరియు సమస్యల నుండి దూరం  చేస్తాడు.  లేదా విముక్తి చేస్తాడు. మీరు అతనికి పాలు సమర్పిస్తే, ఆ నైవేద్యం మీకు  దీర్ఘాయువును మరియు వ్యాధుల నుండి విముక్తిని  కలిగిస్తుంది. మరణం మరియు జీవిత చక్రంలో ఉపశమనం (మోక్షం) అందించడానికి పరమాత్మ  బాధ్యత వహిస్తాడు.

ఆషాడ మాసం విశేషాలు

  పౌర్ణమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం రావడంతో ఈ మాసాన్ని ఆషాఢం అని పిలుస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసి సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోని ప్రవేశించడంతో దక్షిణాయణం మొదలవుతుంది. ఈ మాసంలో వర్షాలు కురుస్తాయి. రోగాలు ప్రబలే కాలం కూడా కావడంతో ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు తలపెట్టరు. ముఖ్యంగా పెళ్లి, నిశ్చితార్థ వేడుకలు, ఉపనయనం, గృహప్రవేశం వంటి వేడుకలు నిర్వహించరు. ఇక ఈ సంవత్సరం ఆషాఢ మాసం తెలుగు క్యాలెండర్ ప్రకారం జూన్ 19న మొదలుకాబోతోంది. ఆషాఢమాస శుక్ల పక్షం జూన్ 19న మొదలై జూలై 3న ముగుస్తుంది. ఆషాఢ మాస బహుళ పక్షం జూలై 4 మొదలై జూలై 17న ముగుస్తుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ మాసంలోనే భక్తులు చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. శుక్ల ఏకాదశి నుంచి ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీయుజ మాసాల్లో శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శయనిస్తాడు. భక్తులు ఈ నాలుగు నెలలు చాతుర్మాస వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ మాసంలో పూరీ రథయాత్ర, కుసుమహర జయంతి, సికింద్రాబాద్ బోనాల జాతర, స్కంద షష్ఠి, ప్రదోష వ్రతం, సంకష్టహర చతుర...

సాలగ్రామ పూజ మహిమ

  సాలగ్రామాన్ని రోజూ పూజించడం వల్ల వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. దు:ఖాలు నశించి సుఖ సంతోషాలు లభిస్తాయని అంటారు. సాలగ్రామం నల్లని రాయిలా కనిపిస్తుంది. దీన్ని శ్రీమహా విష్ణువు రూపంగా భావిస్తారు. సాలగ్రామ విగ్రహం గండకీ నదిలో లభించే రాయి. విష్ణువు మీద పూర్తి భక్తి విశ్వాసలతో వైష్ణవులు ఈ సాలగ్రామాన్ని ప్రతి రోజు పూజిస్తారు. సాలగ్రామాన్ని పూజించుకునే వారు సాత్వికాహారం తీసుకుంటూ సాత్వికమైన ఆలోచనలతో జీవితం సాగిస్తే ఆ పూజ ఫలప్రదం అవుతుందని నమ్మకం. విష్ణు భక్తులకు సాలగ్రామ ఆరాధన మోక్షప్రదాయనిగా పరిగణిస్తారు. సాలగ్రామ పూజలో తులసి ఆకులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. శివ లింగానికి అభిషేకం చేసిన తర్వాత శివుడికి బిల్వపత్రాన్ని సమర్పిస్తే శివానుగ్రహ ప్రాప్తి లభిస్తుందన్నట్టుగానే సాలగ్రామ రూపంలో కొలువైన నారాయణుడికి తులసీ దళాన్ని సమర్పిండం ద్వారా ప్రసన్నుడిని చేసుకోవచ్చు. సాలగ్రామ పూజ వల్ల సర్వరోగాలు నశించి ఆయురారోగ్యాలు కలుగుతాయి. దు:ఖాలు తొలగిపోయి ఆనందాలు సొంతమవుతాయి. అశాంతి, ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారు తమ పూజా మందిరంలో సాలగ్రామాన్ని ప్రతిష్టించుకుని రోజు సేవించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది...

గృహ ప్రవేశం & హోమం, కళ్యాణం , సత్యనారాయణ పూజ సామగ్రి వివరాలు

పసుపు 200 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 4  కిలోలు,   తమల పాకులు 100   ,  వక్కలు 35, పసుపు కొమ్ములు 21,  ఎండు కుడుక 2,  ఖర్జూరం  పాకెట్ 1 ,  టెంకాయలు 15  (ప్రతి దర్వాజకు ఒక టెంకాయ కొట్టాలి )   , తెల్లని  ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు 2,  అరటి పండ్లు 2 డజన్  అగర్ రబత్తి ,, సాంబ్రాణి పొడి, దారం బంతి 1,  ఆవు పంచితం, 100 ml  కర్పూరం పాకెట్  మామిడి కొమ్మ 1 నవగ్రహ పూజ, వాస్తు పూజ సామాను: - గోధుమ పిండి 1,250 గ్రాములు, కంది పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినప్పప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు., విస్టారి ఆకులు 10, దొప్పలు 8.   రాగి  కలశం చెంబులు 3, పాలు పొంగిచ్చటానికి  కొత్త ఇత్తడి గిన్నె 1,  దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2,  వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి  బిళ్ళలు...

పుణ్యాహవాచనం/ఉదక శాంతి పూజ సామగ్రి వివరాలు

 పసుపు 100 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం చిన్న డబ్బా 10  గ్రాములు, బియ్యం 2 కిలోలు, గ్లాసులు disposable 5, రాగి చెంబు 1, వి డి పూలు, 100 గ్రాములు, తమలపాకులు 11, వక్కలు 11, ఖర్జూరం 11, మామిడి కొమ్మ 1, ఆవు పంచితం, 200 ml, సాంబ్రాణి పొడి లేదా ఆగరబత్తి, పాకెట్ 1, కర్పూరం పాకెట్ 1, అరటిపండ్లు 6, రూపాయి బిళ్ళలు 11, తెల్లని వస్త్రము 1 మీటరు 1,( అంచు ఉన్నది తీసుకోవాలి.) కొబ్బరి కాయ 1, బ్రాహ్మణ దక్షిణ 

జ్యేష్టఅభిషేకం తేదీ 21-6-2024 Friday ప్రాముఖ్య త

  ఏటా జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠానక్షత్రానికి ముగిసేలా మూడు రోజులపాటు జరిగేదే ఈ ఉత్సవం.   అంగాలు (నేత్రాలు, ముక్కు, చెవులు వంటివి), మహాంగాలు(శిరస్సు, కంఠం, ఉదరం, బాహువులు వంటివి), ఉపాంగాలు  (కేశాలు, నఖం వంటివి), ప్రత్యాంగాలు (శంఖుచక్రాలు, మకుటం, పీఠం వంటివి) తరుగులకు గురయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా జరగకుండా చూసేందుకు ఉత్సవమూర్తిని రక్షించే ప్రక్రియను భృగువు క్రియాధికారంలో వివరించారు. ఆ రక్షించే ప్రక్రియే జ్యేష్ఠాభిషేకం. దీన్ని సుగంధ తైల సమర్పణోత్సవం, అభిదేయక అభిషేకం అని కూడా పిలుస్తారు. చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంలో కలిసి ఉన్న మాసంలో విశేషమైన సుగంధతైల సమర్పణం చేయాలని భృగువు వివరించారు. దీనివల్ల విష్ణుమూర్తి దివ్య తేజస్సుతో వెలుగొందుతారని చెప్పారు. దీని ప్రకారమే  జ్యేష్ఠాభిషేకం జరుగుతోంది.  జ్యేష్ఠాభిషేకం ప్రారంభంనాడు యధావిధిగా సుప్రభాతం, నామార్చన, నైవేద్యం, ఉచ్ఛవ మూర్తి గర్భాలయం నుంచి  వేంకటరమణ కల్యాణమంటపానికి చేరుకుంటారు.. శతకలశప్రతిష్ఠ, ఆవాహన, తర్వాత నవకలశ ప్రతిష్ఠ, ఆవాహన పూజలు నిర్వహిస్తారు. తర్వాత నివేదనలు, హారతులు సమర్పించి కంకణ ప్రతిష్ఠ చేస్తారు. అనంతరం ...

గృహ ప్రవేశం పూజ సామగ్రి

  మొదట గోపూజ చెయ్యాలి. తర్వాత గృహప్రవేశం చెయ్యాలి.    పసుపు  1 00  గ్రాములు ,  కుంకుమ  5 0  గ్రాములు ,  శ్రీ గంధం  1  చిన్న డబ్బా ,  బియ్యము 4    కిలోలు , తెల్లని ఆవాలు  100  గ్రాములు , , దొప్పలు 5,    మామిడి ఆకులు ,  తమల పాకులు 5 0 , అరటి కొమ్మలు   4 nos. నల్లని పోక వక్కలు 3 0,  ఖర్జూరము కాయలు ,30,  పసుపు కొమ్ములు  1 5,  విడి పూలు కిలో ,  పూల దండలు  2, తులసి మాల    1,    సత్యనారాయణ స్వామి దేవుని ఫోటో ,  దారము బంతి ,  ఆవు మూత్రము , ఆవు పేడ,    ఆవు పాలు  ½ litre, ,  పెరుగు  ½ kg. ,  తేనె  200 grams ,  ఆవు నెయ్యి  100 grams.  , కొబ్బరి కాయలు  1 0 , రాగి    కలశం చెంబులు  3 ,  దీపం చె మ్మేలు  2,  వత్తులు ,  అగ్గిపెట్టె ,  నెయ్యి దీపాలు చిన్నవి  2,  అయిదు రకముల పండ్లు ఐదేసి చొప్పున,  ,  అరటి పండ్లు  2...

AACHARYA NAMMALWAAR BIRTH DAY ON 2-6-2023 FRIDAY

  Respected Bhagavatha Bandhus, Today is Vaikasi Visagam, which has to its credit being the Thirunakshatram of an Alwar and an Acharya Swamy Nammalwar and Thiruvaimozhipillai, both were born under the auspicious star of Vaikasi Visagam, The following are some similarities between this alwar and acharya 1)Swamy Nammalwar is present in the alwar goshti and also in the acharya goshti,Nammalwar is the leader among the alwars,(because alwar being ("Vedam tamil seidha Maaran")and other alwars are considered as his angas (angangal) and his presence in the acharya goshti is due to his act of giving Naalayeeram to Nadhamunigal, Similarly Thiruvaimozhi Pillai, is present among the acharya goshti in our Guruparampara 2)Swamy Nammalwar gave us the Thiruvaimozhi, the essence of Samavedam, and Similarly acharya Thiruvaimozhi Pilllai,(his other names were Srisailesarand Thirumalai alwar) was so called out of his infinite devotion towards nammalwar and his thiruvaimozhi and bringing back the...

2=6=2023 శుక్రవారం న‌మ్మ‌ళ్వార్ తిరున‌క్ష‌త్ర‌మ్ (జ‌యంతి)

  భాగవతోత్తములు శ్రీ నమ్మాళ్వార్ విశిష్టత దేవాల‌యాల్లో శ‌ఠ‌గోపం ఎందుకు ఇస్తారు? కలియుగం ఆరంభమైన 42 వ రోజున ఒక మహానుభావుడు అవతరించాడు. అంటే సుమారు 5100 సంవత్సరాల క్రితం అన్న మాట. కారిమారులనే దంపతులకు భగవత్ ప్రార్థన చేస్తే ఒక చిన్న శిశువు పుట్టింది. ఆ శిశువు పుట్టగానే మాట లేదు, కదలిక లేదు, ఎట్లాంటి స్పందన లేదు. ఆ పిల్లవాడు పాపం ఆహారం ముట్టడం లేదు, ఆ పిల్లవాడి ప్రవృత్తి ఏం పనికి వచ్చేలా లేదు. తల్లి తండ్రులకు ఏంతోచక ఆళ్వారు తిరునగరి అనే ఊరి దేవాలయం వద్ద వదిలి వెళ్ళారు.ఆశ్చర్యం ఆ శిశువు క్రమేపి జరగడం ప్రారంబించింది,ఆ గుడిలో ఉన్న చింతచెట్టు క్రిందకు చేరింది. మాటలేదు, చూపులేదు,ఎట్లాంటి ప్రవృత్తిలేదు.కేవలం కూర్చొని ఉంది. అట్లా 16సం||రాలు గడిచాయి, శరీరం మాత్రం పెరుగుతూ వచ్చింది.అందరికి ఆశ్చర్యంగా అనిపించేది,క్రమంగా అందరూ మరచి పోయారు అదే ఊరికి ప్రక్కనే తిరుక్కోరూర్ అనే ఊరు ఉంది. ఆ ఊరికి చెందిన ఒక మహానుభావుడు అందమైన కంఠస్వరం కల్గినవాడు, అందంగా పాడగలడు. అందుకే *మధురకవి అని పేరు* . చాలా కాలం ఉత్తర దేశ యాత్ర చేస్తూ అక్కడే ఉండి పోయాడు. అలా తన యాత్ర సాగిస్తూ అయోధ్యాపురంలో ఉన్నప్పుడు, ఒక నాడు రాత్ర...