Skip to main content

Posts

Showing posts from April, 2024

చైత్ర శుద్ధ పౌర్ణమి శ్రీ హనుమత్ విజయోత్సవం - జయంతి కాదు తేదీ 23-4-2024

  శ్రీ హనుమాన్ విజయోత్సవం విశిష్టత ఏమిటి శ్రీరామునికి అత్యంత నమ్మకమైన బంటు హనుమంతుడు. శ్రీరాముడు సీతను ఎడబాసి మానసిక క్షోభను అనుభవిస్తూ, సీత జాడ వెతుకుతున్న సందర్భ సమయంలో అడవిలో రాముడుకి హనుమంతునితో పరిచయం ఏర్పడినది. పరిచయం ఏర్పడిన నాటి నుండి శ్రీరామచంద్రున్ని హనుమంతుడు విడిచి ఉండలేదు, రాముడే తన సర్వస్వంగా భావించిన వాయునందనుడు తన ప్రభువైన రాముని మాట ఏనాడు జవదాటలేదు. చివరికి రాముడు రావణునితో యుద్ధం చేసి సీతను తీసుకుని అయోధ్యకు వచ్చి శ్రీ రామ పట్టాభిషేకం అయిన తర్వాత రామునికి అనిపిస్తుంది నేను హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే సీత తిరిగి వచ్చినది, తిరిగి అయోధ్య నగరంలో రాముని పట్టభిషేకంతో ప్రజలు ఆనందంగా ఉండడం గ్రహించిన రాముడు నాకు అన్ని వేళల హనుమంతుడు సహాయంగా ఉన్నాడు అని తన విజయం హనుమంతుని సహకారం ఎంతగానో తోడ్పడినది అని రాముడు చైత్ర పౌర్ణమి రోజు హనుమంతునికి ఘనమైన సన్మానం చేసి ఆలింగనం చేసుకుంటాడు. నాటి నుండి ఆ రాజ్య ప్రజలు హనుమంతుని ఘనతను దృష్టిలో పెట్టుకుని తమ రాజైన రాముడు ఆంజనేయుని ఏ చైత్ర పౌర్ణమి రోజు సన్మానం చేసాడో ప్రతి సంవత్సరం చైత్రపౌర్ణ మి రోజు శ్రీ హనుమత్ విజయోత్సవంగా నాటి నుండి ...

అన్న ప్రాశన పూజ సామగ్రి వివరాలు

 // శ్రీ రామ  // పసుపు 200 గ్రాములు,  కుంకుమ 50 గ్రాములు,  బియ్యం 2 కిలోలు,  తమల పాకులు 50, నల్లని పోక వాక్కలు 15, ఖర్జూరం 11, పసుపు కొమ్ములు 11, ఆచమనం పాత్ర 1, పూలు, పూల దండలు, మామిడి కొమ్మ 1,  అన్నం పాయసం , ఆవు పాలల్లో ఉడ కాలి. బెల్లం,ఆవు నెయ్యి తో ఉండాలి.  కొబ్బరి కాయ, 1, రాగి చెంబు 1, తెల్లని వస్త్రము (బంగారు అంచు ఉండాలి ) కనుము బట్టలు 2, ఆవు పంచితం 50 ml , గంధం,  చిల్లర నాణెములు 15, దీపాలు 2, వత్తులు , అగ్గిపెట్టె 1, ఆగరబత్తి, కర్పూరం పాకెట్, 1, పూజారి దక్షిణ Rs .2,000/-

పెండ్లి పత్రిక, పూలు, పండ్లు తాంబూలాల మార్పిడి కార్యక్రమం పూజ సామగ్రి

                                                      //  జై శ్రీరామ్ // పసుపు 100 గ్రాములు,  కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం ఒక చిన్న డబ్బా ,  మంచి బియ్యం 2  కిలోలు,  తమల పాకులు 50,  నల్లని పోక వక్కలు 25,  ఖర్జూరం కాయలు, 15, పూలు, పూల దండలు, ఆవు పంచితం, 50 ml . అయిదు రకాల పండ్లు ఒక్కొక్కటి 5 చొప్పున ఇందులో అరటిపండ్లు పెట్టగూడదు.  ఆగరబత్తి , పాకెట్,  సెంట్ సీసా చిన్నది 1, రోజ్ వాటర్ చల్లడానికి  కర్పూరం పాకెట్, 1, తెల్లని వస్త్రములు 1 , (బంగారు అంచు తో  ఉండాలి ) అమ్మాయి/అబ్బాయి కి కొత్త బట్టలు, ఆభరణాలు, etc .  వారి తల్లి తండ్రులకు, ఆడ పడుచులకు  కూడా బట్టలు పెట్టాలి.  కనుము బట్టలు 2,  స్వీట్ బాక్స్, 1,  కాజు, బాదం, ఎండు ద్రాక్ష పాకెట్ , etc . ఎండు కుడుకలు 5,  నె య్యి దీపాలు 2, అగ్గిపెట్టె 1 , వత్తులు  ఇంటి దేవుని ఫోటో 1, రాగి చెంబు 1 , ఆచమనం పాత్ర 1  చాపలు ,...

పాప విమోచి ని ఏకాదశి తేదీ 5-4-2024 శుక్రవారం

  పాపమోచని ఏకాదశి చాలా ప్రభావవంతమైనదని పండితులు చెబుతుంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటూ.. శ్రీ మహా విష్ణువు ఆరాధిస్తే మీ పాపాలన్నీ తొలగిపోతాయని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడని నమ్ముతారు. ఈ రోజున నిజమైన మనసుతో ఉపవాసం ఉండటంతో పాటు విష్ణువును పూర్తి ఆచారాలతో ఆరాధించడం ద్వారా, మోక్షాన్ని పొందుతారు. పాపమోచని వ్రత కథ: ఒక అడవిలో ఓ రుషి పరమేశ్వరుడి కోసం తపస్సు ప్రారంభిస్తాడు. తపస్సులో మునిగిపోయిన ఆ రుషిని అప్సరస లాంటి ఓ యువతి భంగం కలిగిస్తుంది. కళ్లు తెరిచి చూసే సరికి అందాల కుందనపు బొమ్మలా ఉన్న ఆ యువతిని చూసి ఆ రుషి మనసు చలించిపోతుంది. తనను మోహిస్తాడు. తనతో ప్రేమలో పడతాడు. అలా కొన్ని సంవత్సరాల పాటు రతీ క్రీడల్లో మునిగిపోతాడు ఆ రుషి. కొంత కాలం తర్వాత ఒకానొక రోజు ఆ యువతి తన గురించి చెబుతూ తనను ఇంద్రుడు పంపించాడని, అనుమతిస్తే తిరిగి స్వర్గలోకానికి వెళ్లిపోతానని వేడుకుంటుంది. తన మాటలు విన్న ఆ రుషి కోపోద్రిక్తుడు అవుతాడు. ఆ యువతి వల్లే తన తపస్సు చెడిపోయిందని ఆవేశంలో యువతిని శపిస్తాడు. ఏ అందంతో తన దృష్టి మరల్చిందో ఆ అందం పోయి పిశాచిలా మారిపోవాలి శపిస్తాడు. అప్పుడు ఆ యువతి రుషి కాళ్లపై పడి తనను క్షమి...

Ugaadi festival on 9-4-2024 Tuesday

  తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి,  ఉగాది  పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. " ఉగాది పచ్చడి " ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం - తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన  ఉగాది పచ్చడి  తెలుగువారికి ప్రత్యేకం. జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలని ఈ పచ్చడి ఇచ్చే సందేశం. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతిగా నిలుస్తాయి. ఈ పచ్చడిలో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉందని తెలుపుతోంది. శ్లోకం:  శతాయు వజ్రదేహాయ సర్వసంపత్‌ కరాయచ  సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం ఈ శ్లోకమును చదివి ఉగాదిపచ్చడిని తీసుకోవాలి ఉగాది పర్వదినం రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. శ్రీ మహావిష్ణువు అయిన కాల పురుషుడిని గౌరవించేందుకు పంచాంగ శ్రవణం చేస్తారు.