హిందువులు ఈ చెట్టును విశేషంగా పూజిస్తారు. ఇది పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను ఉంచిన స్థలం. ఈ చెట్టు యొక్క శాస్త్రీయ నామం ప్రోసోపిస్ సైసిజెరా. వైదిక భాషలో శమీ వృక్షాన్ని 'అరణీ' అనే పేరుతో పిలుస్తారు. అగ్నిని ఉద్భవించేందుకు కాష్టాంతరంచే మధింప యోగ్యమైన దారువని "ఆరణి' అని అర్ధం. అందుకే పూర్వకాలం నుండి శమీవృక్షం పూజనీయమైంది.
అందుకే అప్పటి నుంచి విజయదశమి నాడు జమ్మి చెట్టుని దేవీ ప్రతిరూపంగా కొలిచి పూజిస్తారు. జమ్మి ఆకుని బంగారంగా పంచుకుంటారు. పెద్దవాళ్ల ఆశ్వీరాదాలు తీసుకుంటారు.
దసరా రోజున తెలంగాణ ప్రజలు తొలుత పాలపిట్టను చూస్తారు. పాలపిట్టను చూసేందుకు ప్రజలంతా కలిసి ఊరి బయటకు వెళతారు.. అనంతరం ఊరంతా ఒకచోట చేరి జమ్మిచెట్టుకు పూజలు చేస్తారు.
నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది అని అంటారు. కనుక ఆ రోజు కొత్త విద్యలు ఏమైనా నేర్చుకుంటే మంచిదంటారు. అలానే ఆ రోజు జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీ ప్రదమని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని పురాణాలు చెబుతున్నారు. అలానే జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, నగదు పెట్టెల్లో ఉంచుకోవటం వల్ల ధనవృద్ది జరుగుతుందని విశ్వాసం. అంతేకాదు.. జమ్మి చెట్టుకు పురాణాల్లో ప్రత్యేకమైన ప్రముఖ్యత ఉంది
Comments
Post a Comment