పురాణాల ప్రకారం హిందూ మతంలో దక్షిణ దిశను యమధర్మ రాజు దిశగా పరిగణిస్తారు. ఈ దిక్కున యమ దీపం వెలిగించడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. యమ దీపం వెలిగించడం వల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తుందని నమ్మకం. ధన త్రయోదశి రోజున సాయంత్రం సమయంలో యమ దీపం వెలిగించాలి. యమ దీపంలో స్వచ్ఛమైన నెయ్యిని మాత్రమే ఉపయోగించాలి. యమ దీపంలోని ఒత్తి నాణ్యమైన పత్తితో చేసింది అయి ఉండాలి. దీపం శుభ్రంగా మరియు అందంగా ఉండాలి. కొంతమంది ఇంటి బయట కూడా యమ దీపాన్ని వెలిగిస్తారు. యమ దీపం వెలిగించేటప్పుడు మీ మనస్సులో స్వచ్ఛమైన భావాలను ఉంచుకోండి. లేకుంటే జీవితంలో ఇబ్బందులు తప్పవు.
27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.
Comments
Post a Comment