ఆశ్వయుజ మాసం శుక్ల పక్షంలోని త్రయోదశి తిథి నాడు పాపాంకుశ ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజు విష్ణువు ఆరాధనకు అంకితమైనదిగా పరిగణిస్తారు.
పాపాంకుశ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా 1000 అశ్వమేధ యాగాలు, 100 సూర్య యాగాలకు సమానమైన శుభ ఫలితాలు పొందుతారు.
పాపంకుశ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మూడు తరాల పాపాలు తొలగిపోతాయని చెబుతారు. ఈ ఉపవాస దీక్ష ఆచరించనాడు యమలోక చిత్రహింసలు భరించాల్సిన అవసరం లేదు. ఈ ఉపవాసం ఆచరించే వాళ్ళు నేలపై పడుకోవాలి. ఎవరికి చెడు చేయకూడదు. మనసులోనూ చెడు తలంపులు రాకూడదు. రాత్రిపూట మేల్కొని ఉండాలి. ఈ ఏకాదశి నాడు విష్ణువుకు తేనె సమర్పించడం వల్ల చాలా శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు.
Comments
Post a Comment