Skip to main content

నిర్జల ఏకాదశి తేదీ 6-6-2025 శుక్రవారం

  ఉపవాసం రోజంతా ఆహారం, నీరు తీసుకోకుండా పాటిస్తారు. ఉపవాసం పాటించే వ్యక్తి నియమాల ప్రకారం నీళ్లు కూడా తాగరు. కనుకనే ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి ఉపవాసం పాటించే వ్యక్తి మర్నాడు ఉపవాసం విరమించిన తర్వాతే ఆహారం లేదా నీరు తీసుకుంటారు. 24 ఏకాదశి ఉపవాసాలలో నిర్జల ఏకాదశి ఉపవాసం అత్యంత కష్టతరమైనదిగా పరిగణించబడుతుంది.

దీనిని భీమ సేన ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఉపవాసాన్ని మొదటిసారిగా మహాభారత కాలంలో పాండు కుమారుడు భీముడు పాటించాడని.. అందుకే దీనిని భీమసేని ఏకాదశి అని కూడా పిలుస్తారు.  విశ్వాసం ప్రకారం ఈ రోజున విష్ణువు, లక్ష్మీ దేవిని భక్తితో పూజించి, ఉపవాసం ఉండేవారికి విష్ణువు ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి.అంతేకాదు ఆ వ్యక్తి వంశస్తులందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారని.. పూర్వీకులు పాపాల నుంచి విముక్తిని కూడా పొందుతారని నమ్మకం.

ఉపవాసం ఉండటానికి సుర్యోదయ సమయంలో నిద్రలేచి స్నానం చేయండి. ఆ తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించి, సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించండి. తరువాత భక్తితో, శ్రీ విష్ణువుకు జలాభిషేకం గంగా జలంతో పాటు పంచామృతంతో చేయండి, ఆ తర్వాత భక్తితో విష్ణువును పూజించండి. ఇప్పుడు పసుపు చందనం, పసుపు పువ్వులను స్వామికి సమర్పించండి. పూజ చేసే స్థలంలో తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించండి. రోజంతా ఆహారం లేదా నీరు తీసుకోకుండా ఉపవాసం ఉండండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని జపించండి. నిర్జల ఏకాదశి ఉపవాస కథను చదివి రాత్రి దీప దానం చేసి.. విష్ణువుని పూజించి హారతి ఇవ్వండి.

Comments

Popular posts from this blog

హిందూ వివాహ వేడుక పద్దతులు

హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని ,   ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు ,   ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా ,   అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై ,   సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి ,   భవిష్యత్ దంపతులుగా ,   కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ ,   జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో ,   ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-