జ్యేష్ఠ మాసంలో వచ్చే యోగిని ఏకాదశి. ఈ ఏకాదశి మోక్షాన్ని పొందడానికి, పాపాలను నాశనం చేయడానికి, జీవితంలో ఆనందం, శాంతిని పొందడానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ మత గ్రంథాల ప్రకారం ఈ రోజున ఉపవాసం ఆచరించడం ద్వారా.. 88 వేల మంది బ్రాహ్మణులకు ఆహారం పెట్టినంత పుణ్యం లభిస్తుంది.
పసుపు రంగు దుస్తులు, పువ్వులు, గంధం, ధూపం, దీపాలు, నైవేద్యం (పండ్లు, స్వీట్లు) భగవంతుడికి సమర్పించండి. విష్ణు సహస్రనామం లేదా “ఓం నమో భగవతే వాసుదేవాయ” మంత్రాన్ని జపించండి. ఏకాదశి వ్రత కథ చదవండి లేదా వినండి. రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండండి. సాధ్యం కాకపోతే పండ్లు తినవచ్చు.
ఉప్పు అస్సలు తినకండి. సాయంత్రం విష్ణువుకు హారతి ఇచ్చి మీరు తెలిసి తెలియక చేసిన తప్పులకు క్షమాపణ కోరండి. ద్వాదశి (పరణం) రోజున సూర్యోదయం తర్వాత స్నానం చేయండి. బ్రాహ్మణుడికి లేదా పేదవాడికి ఆహారం పెట్టి శక్తి మేరకు దానధర్మాలు చేయండి. దీని తర్వాత ఉపవాసం విరమించండి. సాత్విక ఆహారం తినండి.
యోగిని ఏకాదశి ఉపవాసం సకల పాపాలను నాశనం చేస్తుందని, మరణానంతరం మోక్షాన్ని అందిస్తుందని నమ్ముతారు. ఈ రోజున విష్ణువును నిర్మలమైన హృదయంతో పూజించడం ద్వారా, ఉపవాస నియమాలను పాటించడం ద్వారా.. ఒక వ్యక్తి జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతాడని నమ్ముతారు. ఈ రోజు చేసే ఉపవాసం జీవితంలో ఆనందం, శ్రేయస్సు , శాంతిని కూడా తెస్తుంది. ఈ ఉపవాసం పాటించే వ్యక్తికి అన్ని రకాల ఆనందాలు లభిస్తాయని.. చివరికి మోక్షం లభిస్తుందని నమ్మకం.
Comments
Post a Comment