హోమ సామగ్రి :
- పిరమిడ్ రూపములొ ఉండే ఒక రాగి పాత్ర ,
- ఆవు పిడకలు ,5, నవధాన్యాలు అన్నీ కలిపి 1/2 కిలో,
- స్వచ్చమైన ఆవు నెయ్యి , కిలో ,
- పాలిష్ చెయ్యని బియ్యము (దంపుడు బియ్యము),
- సూర్యోదయము , సూర్యాస్తమయము వచ్చునట్లు గా ఉన్న ప్రదేశము (చోటు),
- ఎండు మామిడి , రావి,జువ్వి, మర్రి చెట్టు కొమ్మ పుల్లలు ,
- కర్పూరము ,1 ముద్ధ పాకెట్
- పూజా సామగ్రి ,పూలు,పండ్లు, పూర్ణాహుతి పాకెట్,
- తాటాకుల విసనకర్ర , ఎర్రని మట్టి పాత్రలు 2,
- ఔషద మొక్కల సమిధలు , గంధం చెక్కలు , సువాసం ద్రవ్యాలు కొన్ని ,
- బ్రాహ్మణ దక్షిణ Rs .
హోమ శక్తి : ఔషధ ఉపయోగాలు :
- దానివలన కలిగే ఆరోగ్య నియంత్రణ , కాలుష్య నివారణా ప్రయోజనాలు ఎన్నో నిక్షిప్తంచేసి ఉన్నాయి . హోమము లో ఉన్నది అగ్ని శక్తి . ఆరోగ్యము కోసం నీటిని మరిగించడానికి అగ్నిశక్తి ని వాడుతాము .
- హోమము చేయు చోటు లో వెలుతురుకి చుట్టు ప్రక్కలకు క్రిమికీటకాలు చేరవు .
- హోమాగ్నితో వచ్చే వేడికి హానికరమైన సూక్ష్మజీవులు మరణిస్తాయి .
- హోమాగ్ని వేదికి కొన్ని హానికర రసాయనాలు మంచి గా మారుతాయి ,
- మనసులో గూడుకట్టుకొన్న ఒత్తిడులు తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది ,
- ప్రదక్షిణలు చేయడం ఒకరకమైన వ్యాయామము వలన ఉపయోగము ,
హోమము నుండి వెలువడే వేడి
- చర్మాన్ని మెరుగుపరుస్తుంది ,
- రక్తాన్ని శుబ్రపరుస్తుంది ,
- మెదడు కణాలకు కొత్త శక్తినిస్తుంది ,
- శరీరములో ఉన్న రోగకారక సూక్ష్మజీవులను సంహరిస్తుంది ,
- హోమము నుండి వచ్చే వాయులులు పీల్చడం వలన ఊపిరితిత్తులు సుద్ది అవుతాయి , ,
Comments
Post a Comment