Skip to main content

Posts

ఇందిరా ఏకాదశి తేదీ 28-9-2024 శనివారం

  ఈ ఏడాది ఇందిరా ఏకాదశి ఉపవాసం పితృ పక్ష సమయంలో వస్తుంది. పూర్వీకుల మోక్షానికి ఇది అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మనిషి పాపాలు నశించడమే కాకుండా పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల మోక్షం లభిస్తుంది. పురాణాల ప్రకారం ఇందిరా  ఏకాదశి  నాడు ఉపవాసం ఉండే వ్యక్తి ఏడు తరాల వరకు వాళ్ళ పూర్వీకుల దగ్గరకు వెళతాడని చెబుతారు. తన పూర్వీకులు కూడా పుణ్యాన్ని పొందుతారు. వారు తమ పితృలోకం నుండి విముక్తి పొంది స్వర్గంలో స్థానం పొందుతారు. శ్రీమహావిష్ణువును పూజించి ఇందిరా ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల భక్తులు సర్వ దుఃఖాల నుంచి విముక్తి పొందుతారు. వారి జీవితంలో  ఆనందం , శ్రేయస్సు వస్తాయి.  విష్ణుమూర్తికి నైవేద్యాలలో తులసిని తప్పకుండా చేర్చండి. విష్ణువు తులసి లేని ఆహారాన్ని స్వీకరించడు అని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున విష్ణువుతో పాటు, లక్ష్మీ దేవిని కూడా పూజిస్తారు. హిందూ గ్రంథాలయ ప్రకారం ఇందిరా ఏకాదశి ఉపవాసం ఉండటం వల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తుంది. వైకుంఠప్రవేశం లభిస్తుంది. పూర్వీకులు స్వర్గం చేరుకుంటారని నమ్ముతారు. 

అనంత పద్మ నాభ స్వామి వ్రతం తేదీ 17-9-2024 మంగళవారం

  అనంత చతుర్దశి వ్రతము గురించి శ్రీకృష్ణుడు స్వయముగా ధర్మరాజుకు తెలియచేసినట్టుగా మహాభారతం తెలిపినదని చిలకమర్తి తెలిపారు. జూదంలో ఓడిపోయి వనవాసం చేస్తూ ఎన్నో ఈతిబాధలు అనుభవిస్తూ దిక్కుతోచని స్థితిలో ఉన్న పాండవ అగ్రజుడు ధర్మరాజు శ్రీకృష్ణుని చూచి ఓ జగద్రక్షకా! మేం అనుభవిస్తున్న ఈ కష్టాల నుంచి దూరం కావడానికి మార్గం చెప్పాలని ప్రార్ధించగా అందులకు కృష్ణుడు భాద్రపద శుక్ల చతుర్దశి నాడు అనంత పద్మనాభ వ్రతము ఆచరించాలని సూచిస్తాడు. ధర్మరాజు వెంటనే అనంతుడు ఎవరని ప్రశ్నిస్తాడు. దానికి శ్రీకృష్ణుడు బదులిస్తూ ఆ అనంతుడు అంటే ఎవరో కాదు... ఆ కాలపురుషుడిని నేనే. కాలమే అనంతుడు అని పరమాత్మ బదులిస్తాడు.  కృతయుగమందు సుమంతుడు, దీక్ష అను బ్రాహ్మణ దంపతులకు మహావిష్ణువు అనుగ్రహముతో ఒక కుమార్తె కలుగగా ఆ బాలికకు శీల అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగినారు. ఈ క్రమంలో సుమంతుని భార్య దీక్ష అనారోగ్యముతో మరణించగా సుమంతుడు వేరొక స్త్రీని వివాహమాడెను. ఇలా ఉండగా రూపలావణ్యవతియైన శీలను కౌండిన్యుడు వివాహమాడదలచి సుమంతుని అంగీకారముతో ఆమెను వివాహమాడుతాడు. అనంతరం శీలతో కలసి ఎడ్లబండిపై తిరుగు ప్రయాణంలో ఒక చెట్టు కి...

వామన జయంతి తేదీ 15-9-2024 ఆదివారం

  త్రిమూర్తులలో శ్రీ మహా విష్ణువు విశ్వాన్ని సంరక్షించే ప్రభువుగా పరిగణించబడుతున్నాడు. విశ్వాసాన్ని కాపాడడం కోసం శ్రీ మహా విష్ణువు 10 అవతారాలు ఎత్తాడు. వాటిల్లో రామ, కృష్ణ అవతారాలు చాలా ప్రసిద్ధమైనవి. అయితే శ్రీ మహా విష్ణువుకి సంబంధించిన ఇతర అవతారాలను కూడా పూజిస్తారు. శ్రీ మహా విష్ణువు ఐదవ అవతారం వామన అవతారం.  విష్ణువు ఈ అవతారం దేవతలను, విశ్వాన్ని రక్షించడానికే.. అందుకే ఈ అవతారం వర్ణన జానపద కథల్లో వినిపిస్తుంది. భూమిపై రాక్షస రాజు బలి ప్రభావం పెరిగి.. దేవతలలో ఆందోళన నెలకొంది. అప్పుడు బలి గర్వాన్ని అణచడానికి, అతనికి గుణపాఠం చెప్పడానికి శ్రీ మహా విష్ణువు వామనుడిగా జన్మించాడు. అదితి, ఋషి కశ్యపుల కుమారుడిగా విష్ణువు (వామనుడు) జన్మించాడు. పురాణ కథ ఏమిటంటే పురాణాల ప్రకారం రాక్షస రాజు బాలి శక్తి పెరిగేకొద్దీ..అతనిలో క్రూరత్వం కూడా పెరిగింది. అప్పుడు మానవులపైనే కాదు దేవతలపై కూడా తన ప్రభావం చూపించడం మొదలు పెట్టాడు. అటువంటి పరిస్థితిలో శ్రీ మహా విష్ణువు బాల వటువు బ్రాహ్మణుడి రూపంలో బలి చక్రవర్తి దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఓ యాగం జరుగుతోంది. యాగ సమయంలో దేవ గురువు శుక్రాచార్యుడు కూడా అక్కడే...

పరివర్తని ఏకాదశి తేదీ 14-9-2024 శనివారం

  వివాహిత స్త్రీలకు ఈ వ్రతానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించడం ద్వారా ప్రజలు కోరుకున్న ఫలితాలను పొందుతారు. ఈ రోజు ఏదైనా శుభ యోగంలో పూజ చేస్తే విష్ణువు అనుగ్రహం మరింత పెరుగుతుంది. ఈ రోజున ఉపవాసం మరియు విష్ణువును ఆరాధించడం వల్ల కష్టాలు మరియు బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. భాద్రపద మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండటం ద్వారా విష్ణువును ధ్యానిస్తారు. ఈ ఏకాదశిని పరివర్తినీ ఏకాదశి అంటారు. పరివర్తినీ ఏకాదశి శుభ యోగం పరివర్తిని ఏకాదశి రోజున అనేక శుభ యోగాలు ఏర్పడతాయి. ఈ రోజు సాయంత్రం 6.18 గంటల వరకు శోభన యోగం ఉంటుంది. దీనితో పాటు సెప్టెంబర్ 15వ తేదీ రాత్రి 8:32 నుండి 06:06 వరకు సర్వార్థ సిద్ధి యోగం, ఉదయం 06:06 నుండి 08:32 వరకు రవియోగం ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 8:32 గంటల వరకు ఉంటుంది, ఆ తర్వాత శ్రవణా నక్షత్రం కనిపిస్తుంది. ఈ యోగాలు మరియు రాశులు శుభప్రదంగా పరిగణించబడతాయి, దీనిలో చేసిన పని విజయవంతం అవుతుంది. మరియు జీవితంలో తెలియక చేసిన పాపాలు నశించి కోరికలు తీరుతాయి. విష్ణువు అనుగ్రహం వలన దీర్ఘాయుష్షు మరియు ఆరోగ్య దీవెనలు లభిస్తాయి. పరివర్తినీ ఏకాద...

రాధాష్టమి తేదీ 11-9-2024 బుధవారం

  సంస్కృత గ్రంథం పద్మ పురాణం (సంపుటి 5) లోని భూమి ఖండాలోని 7 వ అధ్యాయం రాధాష్టమి పండుగకు సంబంధించిన వివరణాత్మక సమాచారం , ఆచారాలను అందిస్తుంది. స్కంద పురాణంలోని విష్ణు ఖంశంలో, కృష్ణ భగవానునికి 16,000 మంది గోపికలు ఉన్నారని, వారిలో రాధా దేవి అత్యంత ప్రముఖమైనది అని పేర్కొన్నారు. వృషభాను మహారాజు, అతని భార్య కీర్తిదలు చెరువులోని బంగారు తామరపై రాధా దేవిని కనుగొన్నారు. జానపద గాథల ప్రకారం, కృష్ణుడు స్వయంగా తన ముందు ప్రత్యక్షమయ్యే వరకు రాధ ప్రపంచాన్ని చూడటానికి కళ్ళు తెరవలేదు.  ఈ నాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ దినానికి 'రాధాష్టమి' అని పేరు. ఈ రోజు రాధాకృష్ణులను పూజించడంవల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది. శ్రీకృష్ణుని ప్రియురాలు రాధ జన్మదిన వేడుకలను సంద్భంగా రాధకృష్ణుల విగ్రహాలకు పెరుగు, పాలు, పండ్ల రసాలు, పాలు, కొబ్బరినీరు తదితరాలతో అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తితో గీతాలు ఆలపింస్తారు. ప్రత్యేక పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాధాకృష్ణుల విగ...

Dhanvantari Homam for recovery to good health

గృహ ప్రవేశం పూజ సామగ్రి

                        //  జై  శ్రీరామ్ // ముందుగా గోమాత పూజ చెయ్యాలి .   పసుపు 200 గ్రాములు, కుంకుమ 150 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా, , దేవత ఫోటో 1,  బియ్యం 4 కిలోలు, తెల్లని వస్త్రము అంచు తో ఉన్న  దోవతి, ఉత్తరీయం 1 సెట్, చీర 1  తమల పాకులు 100   , అరటి కొమ్మలు  small size 4 ,  వక్కలు 45, పసుపు కొమ్ములు 21,  ఎండు కుడుక 2,  ఖర్జూరం  పాకెట్ 1 ,పంచామృతం (ఆవు పాలు 1 లీటరు ,పెరుగు 1/2 కిలో , మంచి తేనె,ఆవు నెయ్యి, చక్కెర,1/2 కిలో ,  టెంకాయలు 15   , రాచ గుమ్మడి కాయ, 1  బూడిద గుమ్మడి కాయ 1, ఉట్టి తో సహా తేవాలే.   కనుములు 12, (blouse peaces ) అరటి పండ్లు 2 డజన్, అయిదురకాల పండ్లు ఒక్కొక్కటి 5 చొప్పున  ఆగరబతి, సాంబ్రాణి పొడి, దారం బంతి 1,  కర్పూరం పాకెట్  మామిడి కొమ్మ 1, ,  రాగి  కలశం చెంబులు 3, పాలు పొంగిచ్చటానికి  కొత్త ఇత్తడి గిన్నె 1,  దీపాలు 2 ఆవు నెయ్యితో ,(మంగళ హారతి ) మట్టి దీపాలు పెద్దవి 2, ...

భూమి పూజ/ శంఖుస్తాపన పూజ సామగ్రి

  భూమి పూజా విధానం..  భూమి పూజ చేసే చోట ముందుగా ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి. అక్కడ ఎలాంటి దుమ్ము, దూళి లేకుండా చూసుకోవాలి. శుభ్రం చేసిన ప్రాంతంలో, అంటే నిర్మాణం యొక్క ఈశాన్య దిశలో ఒక గొయ్యి తవ్వాలి. భూమి పూజ చేసే సమయంలో యజమాని తూర్పు వైపు కూర్చుని ఉండాలి. ఆ ప్రాంతంలో విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి ఇతర దేవతల విగ్రహాలను శుభ్రమైన వేదికపై ఉంచాలి.  పూజ సామగ్రి ;-  పసుపు 100 గ్రాములు ,  కుంకుమ 100 గ్రాములు,,  గంధం  50 గ్రాములు,  కొ బ్బరి కాయలు5,  నవరత్నాలు,  పంచలోహాలు,  శంఖు,  గవ్వలు,  తెల్లని వస్త్రములు 2, (బంగారు అంచు ఉన్నది కావాలి ) ,  కనుము (blouse peace 1, )బట్టలు 1,  రాగి పైసలు,  ఆవు పాలు లీటరు,  నవధాన్యాలు అన్నీ కలిపినవి కిలో,  ఇటుకలు 5,  కంకణ దారం,  పార, తట్ట, కొంచెం సిమెంట్,  అరటిపండ్లు,  స్వీట్ బాక్స్ కిలో,  ఆగరబతి,  కర్పూరం,  పూలు,  ఫోటో కి పూల దండ , రాగి చెంబు 1,  బియ్యం 3 కిలోలు,  తమల పాకులు, 50,  వక్కలు, 25,  కరజూరామ్ 25,  దీప...

కామిక ఏకాదశి తేదీ 31-7-2024 బుధవారం

    ఆషాడ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు. ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించడానికి అంకితం చేయబడింది. ఈ కాలంలో కఠోర వ్రతాన్ని ఆచరించిన వారికి రెట్టింపు పుణ్యఫలితాలు లభిస్తాయని చెబుతారు. ఇది ఆషాడ మాసంలో వస్తుంది కనుక కామిక ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుతో పాటు శివుడిని ఆరాధించడం వలన అతని అనుగ్రహం లభిస్తుంది. కొన్ని పురాణాల ప్రకారం కామిక ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే గొప్ప సంతానం కలుగుతుంది. కామిక ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే మరు జన్మ రాదని విశ్వాసం. శాస్త్రాల ప్రకారం సరైన పద్ధతిని, నియమాలను పాటిస్తూ సరైన సమయంలో కామికా ఏకాదశి వ్రతం ఆచరించినప్పుడే ఈ వ్రతానికి ఫలితం దక్కుతుంది. కామిక ఏకాదశి రోజు భక్తి శ్రద్దలతో చేసే పూజతో కోరికలు నెరవేరతాయి.  కామికా ఏకాదశి వ్రతం గురించి, బ్రహ్మ దేవుడు దేవర్షి నారదునితో చెబుతూ పాపాలకు భయపడేవారు కామిక ఏకాదశి వ్రతాన్ని తప్పక పాటించాలని చెప్పారు. అప్పులు తొలగిపోవాలంటే: కామిక ఏకాదశి రోజు సాయంత్రం రావి చెట్టుకు నీళ్ళు సమర్పించి దాని కింద నెయ్యి దీపం వెలిగించాలి. మహావిష్ణువు రావి చెట్టులో నివసిస్తాడని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల అప్పుల బాధ ను...

Kamala chuka.....

  కమలా కుచ చూచుక కుఙ్కుమతో నియతారుణితాతుల నీలతనో . కమలాయతలోచన లోకపతే విజయీ భవ వేఙ్కటశైలపతే .. ౧ Kamala looked at her with a smile The blue of the rules. Kamalayathalochana Lokapathe Vijay Bhava Vegkatashailapathe .. సచతుర్ముఖషణ్ముఖపఞ్చముఖ ప్రముఖాఖిలదైవతమౌలిమణే . శరణాగతవత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే .. ౨ Sachaturmukhashanmukhapanchamukha The famous Akhiladaivatamaulimane. Saranagatavatsala Saranidhe The administration is in the form of ..