Skip to main content

Posts

Showing posts from November, 2016
కపిల గోవు గురించి. శివుడి వాహనం వృషభం. ఒకమారు ఆయన హిమాలయాల్లో ధ్యానంలో ఉన్నప్పుడు , సమీపంలోని ఓ తల్లి ఆవు పొదుగు నుంచి లేగదూడ పాలు తాగుతుంటుంది. గాలి ధాటికి ఆ పాల నురగ ఆయనపై పడి , ధ్యానం భంగమవుతుంది. కళ్లు తెరిచి చూసిన ఆయన దృష్టి ఫలితంగా , ఆవులు నల్లగా మారి భయంతో పరుగులు తీస్తాయి. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై- ఆవుపాలకు ఎంగిలి ఉండదని శివుణ్ని శాంతపరుస్తాడు. అలా నల్లగా మారిన ఆవులే కపిల గోవులుగా అనంతరం ఆయన వాత్సల్యాన్ని పొందాయని ; అందువల్ల , బ్రహ్మ ఓ వృషభాన్ని శివుడికి వాహనంగా ఇచ్చినట్లు చెబుతారు. ఒకప్పుడు శ్మశానంలో ఉండే భూత , పిశాచ గణాలు లోకాల్ని పీడించి భయభ్రాంతం చేస్తుండగా వాటిని అణచివేసిన శివుడు శ్మశాన వాసిగా , భూతగణ సేవితుడిగా స్తుతిపాత్రుడైనట్లు మరో గాథ తెలియజెబుతుంది. రాచకొండ రామా చర్యులు , పూజారి , మయూరిమర్గ్ , బేగుంపేట.చరవాని నంబరు. 9989324294
ANNA ABHISHEKHAM on 28-11-2016 Monday at our Neighbour temple The rice is cooked in the temple premises and then it is carried around the temple. Priests chant mantras and musical instruments like naadaswaram, drum and cymbal are sounded. The cooked rice is then used to cover the Shivling and it is referred as Anna Linga. Various different types of rice preparations like pongal, curd rice, Shakara pongal, tamarind rice, sesame rice, payasam and other sweets from freshly harvested rice are prepared and offered to Lord Shiva on the day. The food is then shared by people and is also given to domesticated animals and birds. yours pujari Rachakonda  Rama Charyulu,Mayurimarg,Begumpet,Hyd.
కార్తీక బహుళ ఏకాదశి : ఉత్పత్తైకాదశి : అఖండమైన పుణ్యం . " ఏకాదస్యాం అహోరాత్రాం కర్తవ్యం భోజనత్రయం". మామూలు నాడు రెండు సార్లు భోజనం చేస్తాం , కానీ ఏకాదశి నాడు భోజనత్రయం అని చెప్పారు అంటే , మూడు సార్లు చేయాలని అర్థం అనుకునేరూ భో-జన-త్రయం అంటే మనుష్యులూ మీరు మూడు పనులు చేయాలి అని అర్థం. ఏమిటవి అంటే ఉపవాసం , హరి గుణ గానం మరియూ జాగరణం. ఈ మూడు కూడా ప్రేమతో చేయాలి. ప్రేమతో మాట్లాడినా పాటే అవుతుంది , ప్రేమతో హరి గుణ గానం చేస్తే ఆకలి వేయదు కడుపు నిండుతుంది దాన్నే ఉపవాసం అని అంటారు , నిరంతరం తలుస్తూ ఉంటే నిద్ర రాదు , దాన్నే జాగరణం అని అంటారు. ఇది ప్రతి ఏకాదశికి నియమమే.
Sri Sudharshana Narasimha Homam at Jhansingh Venkateshwara Swamy temple, Gudi Malkapur market, Mehdipatnam, Hyd on 20-11-2016. 
సుదర్శన చక్రరాజం ప్రతిభట శ్రేణి భీషణ! వరగుణస్తోమ భూషణ! జనిభయస్థాన తారణ! జగదవస్థాన కారణ! నిఖిల దుష్కర్మ కర్శన! నిగమ సద్ధర్మ దర్శన! జయ జయ శ్రీ సుదర్శన! జయజయశ్రీ సుదర్శన!   – శ్రీసుదర్శనాష్టకం శ్రీ మహావిష్ణువుకు పంచాయుధాలు ఉంటాయి.   అవి:   సుదర్శన చక్రం , పాంచజన్య శంఖం , కౌమోదకీ గద , నందా ఖడ్గం , శార్ జ్గ ధనువు ;  కింది శ్లోకం పంచాయుధ స్తోత్రంలో సుదర్శన స్తుత్యాత్మకం. స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణవినాశి విష్ణో: చక్రం సదాహం శరణం ప్రపద్యే!! సౌరమాసం – కర్కాటాకంలో – చిత్తానక్షత్రాన సుదర్శన చక్రరాజం   అవతరించినట్లు క్రింది తిరునక్షత్ర తనియన్ తెలియజేస్తుంది. కర్కటే చిత్తనక్షత్రే జాతం సవాయ్ధేశ్వరం | విష్ణో: సంకల్ప వృక్షంతం చక్రరాజ మహం భజే !! ప్రపంచ సృష్టిస్థితిలయ కారకుడయిన భగవంతునికి కూడా ఆయుధాలు అవసరమా అనే సందేహం కొందరికి కలుగుతుంది.   యథార్థంగా ఆళ్వార్లు ఈ ఆయుధాలను భగవానుని భూషణాలుగా అభివర్ణించి స్తుతించారు. భగవానుడు జరిపే కార్యాలకు తన చిహ్నాలయిన ఆయుధాలను ఉపయోగిస్తుంటాడు. భగవానుని ఆయుధాలన్నింటిలోనూ ...