Skip to main content

Posts

Showing posts from April, 2020

వైశాఖ మాసం ప్రాముఖ్యత తేది 23-4-2020 గురువారం నుండి.

వైశాఖ పురాణాన్ని కూడా వ్యాసదేవుడు రచించాడు. ఆధ్యాత్మికంగా భగవదనుగ్రహం పొందడానికి ఈ మాసం అన్ని విధాలా అనుకూలమైనది. సాధనా మాసంగా దీనిని నిర్వచించవచ్చు. వసంతఋతువులో రెండవ మాసం. ఇది. దీనికి వైదిక నామం మాధవ నామము. మధు అని చైత్రమాసానికి , మాధవ అని వైశాఖ మాసానికి అంటారు. వైశాఖమాసం లక్ష్మీ నారాయణుల ఆరాధనకి చాలా ప్రసిద్ధమైనది. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఉన్న నరసింహ స్వామి,వరాహ స్వామి,రాముడు, కృష్ణుడు   మొదలగు దేవతలు కూడా లక్ష్మి నారాయణ స్వరూపాలే. వైశాఖంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా అనునిత్యం ఆయా దేవతలకు   తులసితో ఆరాధించడం చేయాలి. వైశాఖంలో ఉదకుంభ దానము. అంటే నీటితో నింపిన పాత్రను దానం చేయడం. బాటసారులకు చలివేంద్రములు ఏర్పాటు చేసి జలాన్ని ఇవ్వడం వైశాఖంలో ప్రసిద్ధి. విష్ణుసహస్రనామ పారాయణ వైశాఖం అంతా చాలా ప్రశస్తమైనటువంటిది. శ్రీ రామలింగేశ్వర స్వామి   దేవాలయం, మయూరిమార్గ్, బేగంపేట్, హైదెరాబాద్ లో శ్రీ రామ చంద్రునికి ఉదయం 7 గంటలనుండి   పూజలు, పారాయణాలు ప్రారంభం అవుతాయి.  

ఆంజనేయ స్వామి పూజ మహిమ

అంజనేయ స్వామిని మన్యుసుక్త వేదం మంత్రాలతో అభిషేకం అర్చనలు  తమలపాకులతో పూజించటం వలన కలుగు ప్రయోజనాలు 1. ఆంజనేయ స్వామికి లేత తమలపాకుల మాలను వేస్తే రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది. 2. ఇంట్లో మాంత్రిక దోషాలు ఉన్నవారు ఆంజనేయస్వామికి తమల పాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబందమైన పీడలు తొలగిపోతాయి. 3. సంసారంలో ప్రశాంతత లేని వారు స్వామికి తమల పాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది. 4. కొందరు చిన్న పిల్లలు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ సన్నగానే ఉంటారు. చాలా నీరసంగా కనిపిస్తుంటారు. ఇలాంటి వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు. 5. వ్యాపారంలో చాల నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు , పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది. 6. ఏ వ్యక్తి అయితే హీనంగా చూడబడుతాడో అటువంటి వ్యక్తి స్వామికి తమలపాకుల హారాన్ని సమర్పిస్తే సంఘంలో గౌరవం లభిస్తుంది. 7. శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది 8. వైద్య పరంగా నయంకానీ వ్యాధులు ఉన్నవారు స్వామికి త...

వరాహ జయంతి తేది 20-4-2020 సోమవారం

Home Bhakti వరాహ జయంతి Chandra 19:09:00 0 శ్రీ మహావిష్ణువు ధర్మ పరిరక్షణ మరియు దుష్టశిక్షణల నిమిత్తమై యుగయుగాల్లో ఎన్నో అవతారాలు ధరించాడు. వీటిలో దశావతారాలు ప్రముఖమైనవి. ఈ దశావతారాలలో మూడవ అవతారము వరాహావతారము.  శ్వేతవరాహ కల్పములో శ్రీ మహావిష్ణువు రెండు మార్లు వరాహ అవతారం ధరించాడు. మొదటిదైన స్వాయంభువ మన్వంతరములో ఒకసారి మరియు ఆరవదైన చాక్షుష మన్వంతరములో మరొకసారి ఈ అవతారమును ధరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం మనము ఇదే కల్పములో ఏడవదైన వైవస్వత మన్వంతరములో నాలుగవదైన కలియుగంలో వసిస్తున్నాము.   కుంగిపోయిన భూమిని తన నాసికపై చంద్రుని నెలవంక వలె నిలిపి కాపాడిన వరాహావతారమైన శ్రీహరికి, జగదీశ్వరునకు జయము జయము  – జయదేవుడు కరోన మహమ్మారి వ్యాధి నుండి రక్షించండి అని మహావిష్ణువు దశావతార స్తోత్రాలు ఈ రోజు చదువుకుందాం. 

వరూధిని ఏకాదశి తేది 18-4-2020 శనివారం

వరూధిని ఏకాదశి తేది 18-4-2020 శనివారం . ఛైత్ర మాసములో వచ్చే విశిష్టమైన తిథి ఛైత్ర కృష్ణ ఏకాదశి. పరమపావనమైన ఈ రోజున శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, మయూరిమార్గ్ ,బేగంపేట్, హైదెరాబాద్ లో  లక్ష్మినారాయణులను భక్తితో పూజించి, పాలను నైవేద్యంగా ఉంచి, విష్ణు సహస్రనామములను, విష్ణు అష్టోత్తరములను పారాయన చేసి, పాలు, పండ్ల వంటి సాత్వికాహారం తీసుకొని ఉపవాసం ఉండాలి. ఈ రోజున నిత్యా పూజ, ఉపవాసాది కార్యక్రమములను చేయడం ద్వారా విశేషమైన సిరిసంపదలు కలుగుతాయి, సమస్త పాపముల నుండి విడివడి వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. ఈ వ్రతాన్ని విష్ణుప్రీతిగా భక్తి, శ్రద్ధలతో చేయడం వలన మాంధాత మోక్షాన్నే పొందాడు. చేయవలసినవి:-  దగ్గరలోనున్న వైష్ణవ ఆలయాన్ని సందర్శిస్తే విశేషంగా విష్ణు భగవానుడి అనుగ్రహం పొందుతారు.  రోజంతా కృష్ణ, మాధవ, గోవింద అని హరినామాన్ని జపించండి. ఏకాదశి రోజున ధాన్యంతో(బియ్యం, గోధుమ, బార్లే వంటివి) చేసిన ఆహారం నిషిద్ధము కావున పాలు, పండ్లు వంటి సాత్వికమైన ఆహారం స్వీకరించవచ్చు. *శక్తి కొలది దాన, ధర్మాదులు, జప, తపాదులు చేయడం మంచి ఫలితాన్నిస్తుంది. హరినామ స్మరణం-సమస్తపాపహరణం  *సర్వ...

బుధవారం నాడు గణపతి/ విష్వక్సేన దేవత పూజ

శ్రీ మహా విష్ణువు అనుగ్రహం పొందడానికి బుధవారం  విష్వక్సేన దేవత / గణపతి  పచ్చి గరిక తొ పూజ చేస్తారు. పూజ చేసేవారు వంటకాలలో ఉప్పును ఉపయోగించకూడదు. ఆకుకూరలు, పచ్చ అరటిపండ్లు, పచ్చద్రాక్ష మొదలైన ఆకుపచ్చరంగులో ఉండే ఆహార పానీయాలను మాత్రమే సేవించాలి. పచ్చరంగు వస్త్రాలు, పచ్చరంగు కూరలు, పండ్లు, పచ్చరంగు వస్తువులు దానం చేయాలి. గోవులకు పచ్చగడ్డిని తినిపించడం శ్రేష్ఠం. ముడి పెసలతో చేసిన పదార్థాలను లేదా పిండివంటలను నివేదించి, ప్రసాదంగా స్వీకరించాలి.శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, మయూరిమార్గ్,బేగుంపేట్ లో రాచకొండ రామాచార్యులు  పూజారి ఆధ్వర్యంలో  తేదీ 19-8-2020 బుధవారం న విష్వక్సేన దేవత / గణపతి పూజ గణపతి ఉపనిషద్ వేద మంత్రాల యుక్తముగా జరుపబడుతుంది. 
సూర్య నమస్కారాల వలన  ఊపిరితిత్తులు ,  జీర్ణకోశం ,  నాడీ మండలం ,  గుండె  మొదలైన అవయవాలన్నీ బలపడి రక్తప్రసారం సక్రమంగా జరిగి అంగసౌష్టవం పెరుగుతుంది.  నడుము  సన్నబడుతుంది.  ఛాతీ  వికసిస్తుంది. వీటి వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.తేది 12-4-2020 ఆదివారం నాడు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, మయూరిమార్గ్, బేగంపేట లో సూర్య నమస్కారాలు, సూర్య అష్టక పారాయణాలు  ఉదయం గంటలు 6-౩౦ నిllము లకు   రాచకొండ రామాచార్య పూజారి చేస్తారు. 

శ్రీ హనుమన్ విజయము/ హనుమన్ జయంతి 8- 4-2020 బుధవారం

వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం నాడు వైధృతి యోగం కర్కాటక లగ్నమునందు శనివారం మధ్యాహ్నకాలమున కౌండిన్య గోత్రమున ఆంజనేయావతారం జరిగినది. " ఆంజనేయః పూజిస్తశ్చేత్ పూజితాస్సర్వ దేవతాః" ఆంజనేయుని పూజిస్తే సకల దేవతలనూ పూజించినట్లేనని శాస్త్రోక్తి. ఆంజనేయస్వామి ఆరాధన సర్వ గ్రహదోషాలను తొలగించి అభీష్టసిద్ధిని కలుగజేస్తుంది. ఈ రోజున హనుమంతుని అర్చించిన వారికి సర్వకామనలు తీరుతాయి.  హనుమంతుని పూజ  జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందన్నారు.   భర్త చేసిన   పూజ  అయిన పిదప భార్య స్వచ్ఛమైన ఆవునేతిని తీసుకువచ్చి అప్పాలను సాయంకాలం వరకు వేయించాలి. అనగా సాయంకాలం వరకు ఎన్ని చేయగలిగితే అన్ని అని..మాడ్చమని కాదు. ఒకేగోత్రంతో ఉన్న కుటుంబాలలో ఉన్న తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమజ్జయంతి చేస్తారు. హనుమ అంత త్వరగా ప్రీతిచెందే మహాపురుషుడు మరొకరుండరు. ఈ అప్పాలను సాయంకాలం సీతారామచంద్రులకు , హనుమకు , పరివారమునకు మంత్రంతో స్వాగతం పలికి నివేదన చేసి సీతారామచంద్రులయందు అపారభక్తికలిగిన వాడు , హనుమను ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమజ్జయంతినాడు మీకు తారసపడితే వ...

కామదా ఏకాదశి తేది 4-4-2020 శనివారం

చైత్ర శుద్ధ ఏకాదశి రోజునే 'కామదా ఏకాదశి'అని ... 'దమన ఏకాదశి' అని పిలుస్తుంటారు. ఈ రోజున వివాహితులు లక్ష్మీనారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి .. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి .. లక్ష్మీనారాయణులను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఉపవాసం ... జాగరణ అనే నియమ నిబంధలను పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఈ రోజున శ్రీ లక్ష్మి నారాయణ  సహస్ర నామ స్తోత్రం పారాయణం, దశావతార స్తోత్రాలు చదవాలి. మరుసటి రోజు ద్వాదశి రోజున శ్రీ వైష్ణవ దేవాలయానికి వెళ్ళాలి.  కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని చెప్పబడుతోంది. ఇక వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన తొలగిపోతాయని అంటారు. ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా వినిపిస్తూ ఉంటుంది. ఓ గంధర్వుడు శాపం కారణంగా తన భార్యకు దూరమై, రాక్షసుడి రూపంలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. తన భర్తను ఆ స్థితి నుంచి బయటపడేయడం కోసం ఆ గంధర్వ స్త్రీ ఈ వ్రతాన్ని ఆచరిస్తుంది. వ్రత ఫలితం వలన ఆ గంధర్వుడుకి శాప విమోచనం కలిగి తన భార్యను చేరుకుంటాడు. భా...

Kamada Ekadashi is observed on 4th April,2020

 In the scriptures that observing Kamada Ekadasi will help in getting rid of sins and increasing virtue.   Lord Vishnu is worshipped in the Vasudev Form. Observing this Ekadasi helps in alleviating all problems in life. Bhagavan blesses the devotee with peace and prosperity. the person should have a single meal without rice or grains. The devotee should meditate, read stories of Vishnu and chant mantras of Vishnu. The offering to Vishnu on the day include fruits, flowers, til, milk and  panchamrut .                               JAI  SRIMANNARAYANA