సూర్య నమస్కారాల వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, నాడీ మండలం, గుండె మొదలైన అవయవాలన్నీ బలపడి రక్తప్రసారం సక్రమంగా జరిగి అంగసౌష్టవం పెరుగుతుంది. నడుము సన్నబడుతుంది. ఛాతీ వికసిస్తుంది. వీటి వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.తేది 12-4-2020 ఆదివారం నాడు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, మయూరిమార్గ్, బేగంపేట లో సూర్య నమస్కారాలు, సూర్య అష్టక పారాయణాలు ఉదయం గంటలు 6-౩౦ నిllము లకు రాచకొండ రామాచార్య పూజారి చేస్తారు.
హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని , ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు , ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా , అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై , సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి , భవిష్యత్ దంపతులుగా , కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ , జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో , ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...
Comments
Post a Comment