శ్రీ మహావిష్ణువు ధర్మ పరిరక్షణ మరియు దుష్టశిక్షణల నిమిత్తమై యుగయుగాల్లో ఎన్నో అవతారాలు ధరించాడు. వీటిలో దశావతారాలు ప్రముఖమైనవి. ఈ దశావతారాలలో మూడవ అవతారము వరాహావతారము.
శ్వేతవరాహ కల్పములో శ్రీ మహావిష్ణువు రెండు మార్లు వరాహ అవతారం ధరించాడు. మొదటిదైన స్వాయంభువ మన్వంతరములో ఒకసారి మరియు ఆరవదైన చాక్షుష మన్వంతరములో మరొకసారి ఈ అవతారమును ధరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం మనము ఇదే కల్పములో ఏడవదైన వైవస్వత మన్వంతరములో నాలుగవదైన కలియుగంలో వసిస్తున్నాము.
కుంగిపోయిన భూమిని తన నాసికపై చంద్రుని నెలవంక వలె నిలిపి కాపాడిన వరాహావతారమైన శ్రీహరికి, జగదీశ్వరునకు జయము జయము – జయదేవుడు
కరోన మహమ్మారి వ్యాధి నుండి రక్షించండి అని మహావిష్ణువు దశావతార స్తోత్రాలు ఈ రోజు చదువుకుందాం.
Comments
Post a Comment