Skip to main content

శ్రీ హనుమన్ విజయము/ హనుమన్ జయంతి 8- 4-2020 బుధవారం


వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం నాడు వైధృతి యోగం కర్కాటక లగ్నమునందు శనివారం మధ్యాహ్నకాలమున కౌండిన్య గోత్రమున ఆంజనేయావతారం జరిగినది.
"
ఆంజనేయః పూజిస్తశ్చేత్ పూజితాస్సర్వ దేవతాః"
ఆంజనేయుని పూజిస్తే సకల దేవతలనూ పూజించినట్లేనని శాస్త్రోక్తి. ఆంజనేయస్వామి ఆరాధన సర్వ గ్రహదోషాలను తొలగించి అభీష్టసిద్ధిని కలుగజేస్తుంది.
ఈ రోజున హనుమంతుని అర్చించిన వారికి సర్వకామనలు తీరుతాయి.
 హనుమంతుని పూజ  జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందన్నారు.  
భర్త చేసిన  పూజ  అయిన పిదప భార్య స్వచ్ఛమైన ఆవునేతిని తీసుకువచ్చి అప్పాలను సాయంకాలం వరకు వేయించాలి. అనగా సాయంకాలం వరకు ఎన్ని చేయగలిగితే అన్ని అని..మాడ్చమని కాదు. ఒకేగోత్రంతో ఉన్న కుటుంబాలలో ఉన్న తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమజ్జయంతి చేస్తారు. హనుమ అంత త్వరగా ప్రీతిచెందే మహాపురుషుడు మరొకరుండరు. ఈ అప్పాలను సాయంకాలం సీతారామచంద్రులకు, హనుమకు, పరివారమునకు మంత్రంతో స్వాగతం పలికి నివేదన చేసి సీతారామచంద్రులయందు అపారభక్తికలిగిన వాడు, హనుమను ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమజ్జయంతినాడు మీకు తారసపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి చనువు మీకున్నా వారు మీఇంటికి వచ్చేటటువంటి అనుగ్రహం వారికున్నా ఒక విషయం చేత మీ జన్మ పండుతుంది అన్నారు. అటువంటి పరమభక్తుడైన వ్యక్తితో పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల ఐదు ఆకులు కానీ, పండ్లు కానీ, అప్పములు కానీ తీసుకెళ్ళి వారికిస్తే వారు ఆ రోజు తీసుకొని ఒక్కపండుముక్క ఆయన నోటిలో వేసుకున్నా మీజన్మ తరించిపోయినట్లే. హనుమజ్జయంతికి అయిదు అంకెతో అంత అనుబంధం. ఒకేజాతికి చెందిన అయిదు ఫలాలను ఇవాళ్టి రోజున సీతారామచంద్ర ప్రభువుయొక్క పాదములయందు అపారమైన భక్తి కలిగినటువంటి వారు, హనుమను సేవించేటటువంటి వాడు, అటువంటి వారి ఇళ్ళకు వెళ్ళగలిగిన చనువు మీకుంటే (నిత్యము, నైమిక్తికము అని రెండు రకాల తిథులుంటాయి. సంధ్యావందనాదులు రోజూ చేస్తూ ఉంటారు. నైమిక్తికము అంటే ప్రత్యేక తిథులు వీటియందు కొన్ని ప్రత్యేకమైన పనులుంటాయి. అవి చేస్తే జన్మ తరిస్తుంది. అవి సులభ మార్గములు.)వారు పుచ్చుకుంటే మీజన్మ తరించిపోయినట్లే. ఎందుకంటే అది సాక్షాత్ హనుమయొక్క స్వీకారమే. ఇలా చెప్పింది పరాశర సంహిత. అయిదంకె మీద పండు, అయిదంకె మీద ఆకు, అయిదంకె మీద నేతి అప్పములు, ఆలయంలో అర్చన చేసేవాళ్ళు, సీతారామచంద్రులను నమ్ముకున్నభక్తులకు ఇవ్వండి. అలా ఇస్తే మీరు తరిస్తారు. హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందంటే అరటి చెట్లు బాగా కట్టి అరటి గెలలు బాగా వంగి ఉండేటట్లుగా అలంకారం చేసి అప్పుడు హనుమజ్జయంతి చేయాలి. హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే అరటితోటలోకి వెళ్ళి హనుమయంత్రం కానీ హనుమ బొమ్మ కానీ హనుమ అని వ్రాసి కానీ అక్కడ పెట్టి మీరు కానీ ఉపాసన చేశారా ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకొని తీరుతారు అని అభయమిచ్చింది పరాశర సంహిత. అన్నింటికన్నా ఆయన తొందరగా ప్రీతి చెందేది అరటిపండు వల్ల. కదళి పూజ అని ప్రత్యేకమైన పూజ ఆయనకి. అలా చేస్తే ఏదో ఒక రూపంతో మీకు కంటికి కనపడే రూపంతో రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకొని వెళ్ళి తీరుతారు. తొందరగా ప్రసన్నుడై వస్తే వానరరూపంలో వస్తారు. తప్పకుండా అరటిపండ్లు నివేదన చేయాలి. పరమ ప్రసన్నుడౌతాడు స్వామి. ఈ రోజు తప్పకుండా దేవాలయంలో హనుమ దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి. ఎవరికి హనుమ అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు.
రాచకొండ రామ చార్యులు, పూజారి, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, (మా ఇంటి ప్రక్కన),మయూరి మర్గ్, బేగుంపేట, హైదెరబాద్. 

Comments

Popular posts from this blog

తద్దినం సమయము మరియు నియమాలు

ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము ,  2.సంగవకాలము ,  3. మధ్యాహ్నకాలము ,  4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. ·            ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా ,  వ్రత ,  శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. ·            ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. ·            ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి.