వైశాఖ పురాణాన్ని కూడా వ్యాసదేవుడు
రచించాడు. ఆధ్యాత్మికంగా భగవదనుగ్రహం పొందడానికి ఈ మాసం అన్ని విధాలా అనుకూలమైనది.
సాధనా మాసంగా దీనిని నిర్వచించవచ్చు. వసంతఋతువులో రెండవ మాసం. ఇది. దీనికి వైదిక
నామం మాధవ నామము. మధు అని చైత్రమాసానికి, మాధవ అని వైశాఖ మాసానికి అంటారు.
వైశాఖమాసం లక్ష్మీ నారాయణుల ఆరాధనకి చాలా ప్రసిద్ధమైనది. శ్రీ మహావిష్ణువు
దశావతారాలలో ఉన్న నరసింహ స్వామి,వరాహ స్వామి,రాముడు, కృష్ణుడు మొదలగు దేవతలు కూడా లక్ష్మి నారాయణ స్వరూపాలే.
వైశాఖంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా అనునిత్యం ఆయా దేవతలకు తులసితో ఆరాధించడం చేయాలి. వైశాఖంలో ఉదకుంభ దానము. అంటే నీటితో నింపిన పాత్రను దానం చేయడం. బాటసారులకు చలివేంద్రములు ఏర్పాటు చేసి జలాన్ని ఇవ్వడం వైశాఖంలో ప్రసిద్ధి.
విష్ణుసహస్రనామ పారాయణ వైశాఖం అంతా చాలా ప్రశస్తమైనటువంటిది. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, మయూరిమార్గ్, బేగంపేట్, హైదెరాబాద్ లో శ్రీ రామ చంద్రునికి ఉదయం 7 గంటలనుండి పూజలు, పారాయణాలు ప్రారంభం అవుతాయి.

Comments
Post a Comment