చైత్ర శుద్ధ ఏకాదశి రోజునే 'కామదా ఏకాదశి'అని ... 'దమన ఏకాదశి' అని పిలుస్తుంటారు. ఈ రోజున వివాహితులు లక్ష్మీనారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి .. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి .. లక్ష్మీనారాయణులను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఉపవాసం ... జాగరణ అనే నియమ నిబంధలను పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఈ రోజున శ్రీ లక్ష్మి నారాయణ సహస్ర నామ స్తోత్రం పారాయణం, దశావతార స్తోత్రాలు చదవాలి. మరుసటి రోజు ద్వాదశి రోజున శ్రీ వైష్ణవ దేవాలయానికి వెళ్ళాలి.
కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని చెప్పబడుతోంది. ఇక వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన తొలగిపోతాయని అంటారు. ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా వినిపిస్తూ ఉంటుంది. ఓ గంధర్వుడు శాపం కారణంగా తన భార్యకు దూరమై, రాక్షసుడి రూపంలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. తన భర్తను ఆ స్థితి నుంచి బయటపడేయడం కోసం ఆ గంధర్వ స్త్రీ ఈ వ్రతాన్ని ఆచరిస్తుంది.
వ్రత ఫలితం వలన ఆ గంధర్వుడుకి శాప విమోచనం కలిగి తన భార్యను చేరుకుంటాడు. భార్యా భర్తలు ఎలాంటి పరిస్థితుల్లోను విడిపోకుండా చూసే శక్తి ఈ వ్రతానికి ఉంది. అందుకే చైత్ర శుద్ధ ఏకాదశి రోజున స్త్రీలు పెద్ద సంఖ్యలో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. లక్ష్మీనారాయణుల ఆశీస్సులను పొందుతూ ఉంటారు.

Comments
Post a Comment