అంజనేయ స్వామిని మన్యుసుక్త వేదం మంత్రాలతో అభిషేకం అర్చనలు తమలపాకులతో
పూజించటం వలన కలుగు ప్రయోజనాలు 1. ఆంజనేయ స్వామికి లేత తమలపాకుల మాలను
వేస్తే రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది. 2. ఇంట్లో
మాంత్రిక దోషాలు ఉన్నవారు ఆంజనేయస్వామికి తమల పాకుల హారాన్ని వేస్తే మంత్ర
సంబందమైన పీడలు తొలగిపోతాయి. 3. సంసారంలో ప్రశాంతత లేని వారు స్వామికి
తమల పాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది. 4. కొందరు
చిన్న పిల్లలు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ సన్నగానే ఉంటారు. చాలా నీరసంగా
కనిపిస్తుంటారు. ఇలాంటి వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే ఆరోగ్యం బాగుపడి
చక్కగా ఎదుగుతారు. 5. వ్యాపారంలో చాల నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి
తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది. 6. ఏ
వ్యక్తి అయితే హీనంగా చూడబడుతాడో అటువంటి వ్యక్తి స్వామికి తమలపాకుల హారాన్ని
సమర్పిస్తే సంఘంలో గౌరవం లభిస్తుంది. 7. శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ
స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది 8. వైద్య
పరంగా నయంకానీ వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి, ప్రసాదాన్ని
స్వీకరిస్తే అన్ని రోగాలు నయమవుతాయి. 9. సుందర కాండ పారాయణం చేసి స్వామికి
తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది. 10. హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్ధించి తమలపాకుల హారాన్ని వేస్తే
పరమాత్మని అనుగ్రహం కలుగుతుంది. 11. వాద ప్రతివాదాల్లో స్వామిని ప్రార్ధించి
తమలపాకుల హరాన్ని సమర్పించి, ప్రసాదం తీసుకుంటే జయం మీదే అవుతుంది. 12. తాంబూల దానంతో గంగా దేవి సంతృప్తి పడుతుంది.పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి
పూజల్లో కూడా వాడతారు. తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు. అనంతరం
తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దేనికి పర్ణ ప్రసాదమనే పేరు.
పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె, విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు, రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు బాదాం పలుకుల బాస్కెట్, etc . తమల పాకులు 100, నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్, సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా. పురోహిత్ దక్షిణ ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి.
Comments
Post a Comment