ప్రతి నెల శ్రవణ నక్షత్రం ఉన్న రోజున శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మాస కళ్యాణం నిర్వహిస్తున్నారు. వేదవతీ (పద్మావతి), గోదాదేవి(అలివేలు మంగమ్మ)ల సమేతుడై పద్మావతీ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి భక్తులకు కోర్కెలు తీర్చే కల్యాణ ప్రదాతగా దర్శనమిస్తున్నారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న అవివాహిత యువతీయువకులు కంకణాన్ని ధరిస్తే, అర్చకుల చేత కళ్యాణ అక్షతలు శిరస్సు మీద ఆశీర్వచన రూపకముగా వేయించుకుంటే వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం. వివాహం ఆలస్యం అవుతున్న వారు స్వామి వారి కళ్యాణం లో పాల్గొనవచ్చును. పూల మాలలు గాని , తులసి మాల గాని సమార్పిస్తే కూడా వివాహం జరుగుతుంది.
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com