యుధిష్టిర మహారాజు శ్రీ కృష్ణ భగవానునితో ఇలా అన్నాడు " ఓ వాసుదేవ ,ఈ మాఘ మాసం కృష్ణ పక్షం లో వచ్చేటువంటి ఏకాదశి మహత్యాన్ని వివరించమని కోరాడు. శ్రీ కృష్ణ పరమాత్మ :- ఓ యుధిష్టిర ఈ మాఘమాసంలో వచ్చేటువంటి ఏకాదశి పేరు "విజయ ఏకాదశి" ఈ ఏకాదశిని ఎవరు భక్తీ శ్రద్దలతో ఆచరిస్తారో వారిని విజయం వరిస్తుంది, మరియు వారి పాపాలు కూడా తొలిగిపోతాయి.
ఒకానోకసారి నారద ముని బ్రహ్మ దేవుడి దగరికి వెళ్లి తనకి ఈ విజయ ఏకాదశి యొక్క విశిష్టతను తెలుపమని కోరెను అప్పుడు బ్రహ్మ ఈ విధంగా చెప్పనారంబించెను. ఓ నారద మహాముని ఇంతకు ముందు ఎవరికీ దీని వ్రత మహత్యం గురించి చెప్ప లేదు నువ్వు అడిగినవు కావున నీకు తెలియ చేసెదను వినుము. ఈ ఏకాదశి వ్రతం అన్ని పాపాలను హరిస్తుంది. ఈ పేరులో చెప్పిన విదంగానే ఈ ఏకాదశి వ్రతం అన్ని విజయాలను చేకూరుస్తుంది అందుకు సందేహమే లేదు.
శ్రీ రామచంద్రుడు ఋషి చెప్పినట్టుగానే వ్రతం పాటించి లంక మీద విజయం సాదించాడు. ఈ వ్రతం ఎవరు అయితే ఆచరిస్తారో వారికి వైకుంట ప్రాప్తి కూడా కలుగుతుంది. ఓ నారద ఈ విధంగా ఎవరు ఈ ఏకాదశి వ్రతం నమ్మకంతో భక్తీ శ్రద్ధలతో ఆచరిస్తారో వారి అతి ఘోరమైన పాపాలు అయిననూ హరించిపొయి విజయం లబిస్తుంది మరియు వైకుంఠ లోక ప్రాప్తి లబిస్తుంది. అని శ్రీ కృష్ణ పరమాత్మ వివరించి యుధిష్టిర ఎవరు ఈ ఉపవాస దీక్ష చేస్తారో ఈ కధ ను వింటారో వారికీ అశ్వమేధ యాగం చేసిన ఫలితం కూడ లభిస్తుంది అని తెలుపెను.
Comments
Post a Comment