సూర్యుడి పుట్టిన రోజున రథ సప్తమి(Ratha Saptami)గా జరుపుకుంటాం. మత్స్య పురాణం ప్రకారం.. సూర్యదేవుని (sun worship)పూజించే రోజు. రథ సప్తమి నాడు చేసే స్నానము, దానము, గృహము, పూజలు మొదలైన పుణ్య ఫలాలు వేయి రెట్లు అధికంగా ఇస్తాయని నమ్మకం.ఈ రథ సప్తమిని అచల సప్తమి, సూర్య రథ సప్తమి, ఆరోగ్య సప్తమి మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు.రథ సప్తమి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేస్తారు. ఎక్కువ మంది భక్తులు ప్రత్యేకంగా గంగాస్నానం చేస్తారు. ఈ రోజున సూర్యోదయ సమయంలో స్నానం చేయడం వల్ల అన్ని రోగాల నుండి విముక్తి పొంది మంచి ఆరోగ్యం పొందుతారని నమ్ముతారు. శాశ్వత ఫలం: రథసప్తమి వ్రతం పాటించిన వారికి జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. కేవలం సూర్య భగవానునికి జలాన్ని సమర్పించినా భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. శారీరక సమస్యలతో బాధపడేవారు ఈ రోజు తప్పనిసరిగా పూజ చేయాలి. ఈ రోజున సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి.థసప్తమి రోజున ఎలా పూజించాలంటే.. రథ సప్తమి రోజున తెల్లవారు జామునే స్నానం చేసి.. సూర్య భగవానుడికి అర్ఘ్యదానం చేయాలి. నదిలో పువ్వు మొదలైన వాటితో అర్ఘం అర్పించాలి. అనంతరం సూర్యభగవానునికి నెయ్యి దీపం, ఎర్రటి పువ్వులు, కర్పూరం, ధూపం వేసి ఆదిత్య హృదయం చదువుతూ పూజించాలి. బాధల నుండి విముక్తి కోసం ప్రార్ధించండి.
ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము , 2.సంగవకాలము , 3. మధ్యాహ్నకాలము , 4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. · ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా , వ్రత , శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. · ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. · ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...
Comments
Post a Comment