మాఘ మాసంలో వచ్చే చవితిని .. అంటే మాఘ శుద్ధ చవితిని 'వర చతుర్థి' .. 'తిల చతుర్థి' .. 'కుంద చతుర్థి' అని పిలుస్తుంటారు.
'వర చతుర్థి' రోజున గణపతిని పూజించడం మంచిదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ విధంగా చేయడం వలన ఆ స్వామి అనుగ్రహంతో తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి. ఇక ఈ రోజున నువ్వులు దానం చేయడం వలన గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయట. అందువలన దీనిని 'తిల చతుర్థి' అని కూడా అంటారు. ఇక ఈ 'కుంద చతుర్థి' రోజున శివుడిని 'మొల్ల' పువ్వులతో పూజించడం వలన కూడా విశేషమైన ఫలాలు లభిస్తాయని చెబుతారు.
హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని , ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు , ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా , అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై , సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి , భవిష్యత్ దంపతులుగా , కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ , జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో , ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...
Comments
Post a Comment