కార్తిక మాసం మొదటి రోజు నెయ్యి, బంగారం( Ghee , gold ), దానం చేసి అగ్ని దేవుడిని పూజిస్తే పుణ్యఫలం లభిస్తుంది.అలాగే రెండవ రోజు కలువ పూలు నూనె( Lily flower oil ) దానం చేసి బ్రహ్మ దేవున్ని పూజిస్తే మన శ్శాంతి కలుగుతుంది.అలాగే మూడవ రోజు ఉప్పు( salt ) దానం చేసి పార్వతీ దేవిని పూజిస్తే సౌభాగ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
అలాగే నాలుగో వ రోజు పెసర పప్పు( moong dal ) దానం చేసి గణపయ్యను పూజించాలి.ఐదవ రోజు స్వయంపాకం,విసనకర్ర దానం చేసి ఆదిశేషున్ని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.
అంతే కాకుండా ఆరవ రోజు చిమ్మిలి దానం చేసి చేస్తే మంచిది.అలాగే సుబ్రహ్మణ్య స్వామిని( Lord Subrahmanyam ) పూజించాలి.ఏడవ రోజు పట్టు బట్టలు, గోధుమలు, బంగారం దానం చేసి సూర్యుడిని పూజిస్తే మంచి తేజస్సు, ఆరోగ్యం లభిస్తాయిని పండితులు చెబుతున్నారు.కార్తిక మాసంలో తొమ్మిదవ రోజు యధాశక్తి దానం చేసి పితృదేవతలని పూజించడం పితృతర్పణాలు వదిలితే సంతాన రక్షణ కలుగుతుంది.
అలాగే కార్తీక మాసంలో 10వ రోజు గుమ్మడికాయ, స్వయంపాకం దానం చేసి అష్ట దిగ్గజాలను పూజిస్తే యశస్సు ధన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
Comments
Post a Comment