Skip to main content

Posts

Showing posts from May, 2024

శ్రీ వైష్ణవ దేవాలయాలలో భక్తుల తల మీద శటారి ఎందుకు పెడతారు ?

  శ్రీ వైష్ణవులు నమ్మాళ్వార్ (అతని పేరు షడ గోపన్ కాబట్టి) యొక్క శిరస్సును సూచించడానికి సడగోపం అని పిలువబడే కిరీటాన్ని ఉపయోగించడం ప్రారంభించారు, మరియు షడ గోపం పైభాగంలో విష్ణువు యొక్క పాదముద్రలు ఉంటాయి.   నమ్మాళ్వార్ విష్ణువు యొక్క పాద పద్మములకు శరణాగతి చేసినట్లే, మీరు కూడా లొంగిపోవాలని ఆలోచనలతో  శ్రీ వైష్ణవ దేవాలయాలలో శ డగోపం ప్రజల తలపై ఉంచడం యొక్క మూలం. Sri Vaishnavas started using a crown, called the Sadagopam, to represent the head of Nammalwar (since his name was Sadagopan), and on the top of the Sadagopam are the footprints of Vishnu.  The idea is that just as Nammalwar surrendered to the lotus feet of Vishnu, so should you. That is the origin of placing the Sadagopam on people's heads in Sri Vaishnava temples.

పూజ లలో ఆగరబత్తి ని ఎందుకు వెలిగిస్తారు ?

  అగర్బత్తిని అగరబత్తి అని కూడా పిలుస్తారు, ఇది హిందూ పూజ (ఆరాధన) వేడుకలలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ఆచారాల సమయంలో వాటిని ఎందుకు వెలిగిస్తారో  వివరిస్తాను: గౌరవం యొక్కచిహ్నం: అగరబత్తిని వెలిగించడం దేవతలకు గౌరవం మరియు భక్తిని చూపించే మార్గం. ఒక దేవత యొక్క చిత్రం లేదా విగ్రహం ముందు ధూపం వేయడం సాధారణ ఆచారం. శుద్ధి మరియు ప్రక్షాళన: అగర్బత్తి యొక్క పొగ మరియు సువాసన గాలిని శుద్ధి చేసి పవిత్ర వాతావరణాన్ని సృష్టిస్తాయని నమ్ముతారు. ఇది ప్రతికూల శక్తి నుండి పర్యావరణాన్ని శుభ్రపరచడానికి సహాయపడుతుంది. తైలమర్ధనం మరియు ధ్యానం: అగర్బత్తిలు ఆహ్లాదకరమైన సువాసనలను వెదజల్లుతాయి, ఇది అక్కడ ఉన్నవారిపై ప్రశాంతమైన ప్రభావాలను కలిగిస్తుంది. ఇది ఏకాగ్రతకు సహాయపడుతుంది, కర్మలు మరియు ధ్యానం చేయడం సులభతరం చేస్తుంది. వైద్యం చేసే గుణాలు: అగరుబత్తీల సువాసన వైద్యం చేసే లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఆశీర్వాదాలను కోరుతుందని మరియు శ్రేయస్సును ప్రోత్సహిస్తుందని నమ్ముతారు. సాంస్కృతిక సంప్రదాయం: హిందూమతంలో అగరుబత్తీల వాడకం పురాతన కాలం నాటిది. ఇది భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయింది మరియు మతపరమైన మరియు ఆ...

ఈ రోజు తేదీ 25-5-2024 శనివారం నుండి రోహిణి కార్తె ప్రారంభం

  Jyo   తిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడు మే 25వ తేదీన రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఇదే నక్షత్రంలో జూన్ 8వ తేదీ వరకు ఉంటాడు. ఈ పక్షం రోజుల పాట ఎండలు మరింత మండిపోతాయి. నాలుగు నెలలుగా వచ్చే వేడి గాలులు ఒక ఎత్తు అయితే.. కేవలం రోహిణి కార్తె సమయంలో మాత్రం నేరుగా రోళ్లు పగిలేంత ఎండలు పెరిగిపోతాయి. ఈ కాలంలో సూర్య భగవానుడు భగ భగ మండిపోతూ ఉంటాడు. ఈ పక్షం రోజుల్లో సూర్యుడి తీవ్రత తీవ్ర స్థాయికి చేరుకుని, కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది.  తెలుగు వారు మాత్రం ఇవే నక్షత్రాలతో వ్యవసాయ పంచాంగాన్ని రూపొందించుకున్నారు. ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలుస్తారు. ఈ లెక్కన సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరా ఉంటే ఆ కాలానికి కార్తె అని పేరు పెట్టారు. అంటే ఏడాదికి 27 కార్తెలు. అంతేకాదు ఈ కార్తెలను అందరికీ అర్థమయ్యే విధంగా సామెతల రూపంలో రూపొందించారు. అందులో ఒకటే రోహిణి కార్తె.

పుణ్యాహ వాచనం పూజ సామగ్రి వివరాలు

పసుపు, 200 గ్రాములు,  కుంకుమ 50 గ్రాములు, బియ్యం 2 కిలోలు,  తమలపాకులు 50, మామిడి కొమ్మ 1, నల్లని పోక వక్కలు 21, ఖర్జూరం 1 పాకెట్,  శ్రీ గంధం 1 చిన్న పాకెట్, పూలు, పూల దండ,  అరటి పండ్లు 1/2 డజన్  రాచ గుమ్మడి కాయ 1, ముద్ధ కర్పూరం 1 పాకెట్, ఆగరబతి లేదా సాంబ్రాణి పొడి లేదా సాంబ్రాణి కడ్డీలు 2, రాగీ చెంబు, 1, ఆవు పంచితం 50 ml , ఆవు పేడ లేదా. పిడక 1,  తెల్లని కొత్త వస్త్రం (అంచు ఉండాలి ) బ్రాహ్మణ దక్షిణ Rs . 

బుధ పూర్ణిమ & కూర్మ జయంతి & అన్నమయ్య జయంతి తేదీ 23-5-2024 గురువారం

  గౌతమ బుద్ధుడు వైశాఖ మాసంలో శుక్ల పక్షం పూర్ణిమ రోజున జన్మించాడు. అందుకే ఈరోజున బుద్ధ పూర్ణిమగా జరుపుకుంటారు. బుద్ధ పూర్ణిమ రోజున రావిచెట్టును పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయని, ఎందుకంటే ఈ చెట్టులో శ్రీ మహా విష్ణువు నివాసం ఉంటారని చాలా మంది నమ్ముతారు. పురాణాల ప్రకారం, బుద్ధ పూర్ణిమ రోజున రావిచెట్టును పూజించడం వల్ల పూర్వీకుల ఆత్మ కూడా శాంతిస్తుందని చాలా మంది నమ్మకం. శాస్త్రాల ప్రకారం, ఈ పర్వదినాన చెట్లను నాటడం వల్ల గురు, శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుందట.   హిందూ పురాణాల ప్రకారం, రావి చెట్టులో ముక్కోటి దేవతలు, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు నివసిస్తారు. అందుకే బుద్ధ పూర్ణిమ రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి రావి చెట్టుకు నీరు సమర్పించి దీపారాధాన చేయడం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. మరోవైపు జ్యోతిష్యం ప్రకారం, జాతకంలో గురు, శని గ్రహాల ప్రభావం తగ్గి.. శుభ ఫలితాలొస్తాయి. కృతయుగంలో దేవ , దానవులు అమృతం కోసం  క్షీరసాగరం చిలకడం  మొదలు పెట్టారు. మందరగిరిని కవ్వంగా, వాసుకుని తాడుగా చేసుకుని దేవాసురులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా మందరగిరి సముద్రంలోకి జారిపోతూ సము...

ఈ రోజు నమ్మాళ్వార్ జయంతి కూడా ..

   దేవాలయంలో శట్టారి   ఎందుకు ఇస్తారు? కలియుగం ఆరంభమైన 42 వ రోజున ఒక మహానుభావుడు అవతరించాడు. అంటే సుమారు 5100 సంవత్సరాల క్రితం అన్న మాట. కారిమారులనే దంపతులకు భగవత్ ప్రార్థన చేస్తే ఒక చిన్న శిశువు పుట్టింది. ఆ శిశువు పుట్టగానే మాట లేదు, కదలిక లేదు, ఎట్లాంటి స్పందన లేదు. ఆ పిల్లవాడు పాపం ఆహారం ముట్టడం లేదు, ఆ పిల్లవాడి ప్రవృత్తి ఏం పనికి వచ్చేలా లేదు. తల్లి తండ్రులకు ఏంతోచక ఆళ్వారు తిరునగరి అనే ఊరి దేవాలయం వద్ద వదిలి వెళ్ళారు.ఆశ్చర్యం ఆ శిశువు క్రమేపి జరగడం ప్రారంబించింది,ఆ గుడిలో ఉన్న చింతచెట్టు క్రిందకు చేరింది. మాటలేదు, చూపులేదు,ఎట్లాంటి ప్రవృత్తిలేదు.కేవలం కూర్చొని ఉంది. అట్లా 16సం||రాలు గడిచాయి, శరీరం మాత్రం పెరుగుతూ వచ్చింది.అందరికి ఆశ్చర్యంగా అనిపించేది,క్రమంగా అందరూ మరచి పోయారు అదే ఊరికి ప్రక్కనే తిరుక్కోరూర్ అనే ఊరు ఉంది. ఆ ఊరికి చెందిన ఒక మహానుభావుడు అందమైన కంఠస్వరం కల్గినవాడు, అందంగా పాడగలడు. అందుకే *మధురకవి అని పేరు* . చాలా కాలం ఉత్తర దేశ యాత్ర చేస్తూ అక్కడే ఉండి పోయాడు. అలా తన యాత్ర సాగిస్తూ అయోధ్యాపురంలో ఉన్నప్పుడు, ఒక నాడు రాత్రి ఆకాశంలో అధ్భుతమైన తారక క...

నరసింహ జయంతి 2024

  శ్రీ మహా విష్ణువు నరసింహ అవతారం ఈరోజే ఉద్భవించిందని అంటారు. ఈ పండుగ రోజు సాయంత్రం వేళ పూజ చేయడం నియమం. . శుభ సమయం నరసింహ జయంతి మే 21 సాయంత్రం 5:39 గంటలకు ప్రారంభమై మే 22 సాయంత్రం 6. 47 గంటలకు ముగుస్తుంది. ... పూజా విధానం నరసింహ జయంతి సాయంత్రం పూట పూజ నిర్వహిస్తారు.  పది అవతారాల్లో శ్రీ మహా విష్ణువు నాల్గవ అవతారం నరసింహ అవతారం. ఈ అవతారం కాస్త భయం గొలిపేలా ఉంటుంది. సగం మానవ శరీరంతోనూ.. మిగిలిన సగం సింహం శరీరాన్ని కలిగి ఉంటుంది. హిరణ్య కశ్యపుడిని సంహరించడానికి విష్ణుమూర్తి ఈ అవతారాన్ని ఎత్తవలసి వచ్చింది. ఇలా స్వామివారు నరసింహ అవతారాన్ని ఎత్తిన రోజును నరసింహ జయంతిగా జరుపుకుంటారు. ఈ రోజున స్వామివారిని పూజించి ఉపవాసం ఉంటే మంచిదని చెబుతారు.  ఈ ఏడాది స్వామివారి జయంతి రోజున రవియోగం, స్వాతి నక్షత్ర యోగం కూడా ఏర్పడుతోంది. ఇక ఉపవాసాన్ని మే 21న ప్రారంభించి మే 22న ఉదయం సూర్యోదయం తర్వాత ముగించాలి.

జ్యోతిష్య శాస్త్రం లో ప్రయాణ ముహూర్తాలు

హిందూ వివాహలలో త్రీ జే ష్ట విషయాలు

మోహినీ ఏకాదశి తేదీ 19-5-2024 ఆదివారం

  ఈసారి మోహినీ ఏకాదశి నాడు మూడు పవిత్రమైన యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ మూడు పవిత్ర యాదృచ్చికాలను పూజించడం ద్వారా ప్రజలుకోరుకున్న కోరికలు నెరవేరి, ఇంట్లో సుఖ, సంతోషాలు నెలకొంటాయని విశ్వాసం. ఈసారి మోహినీ ఏకాదశి రోజున అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు. ఈ రోజుకి విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ ఏకాదశి రోజున విష్ణువు తో పాటు మోహిని అవతారాన్ని పూజిస్తారు. పాపాలు పోగొట్టుకుని సుఖ సంతోషాలతో జీవించాలని భక్తులందరూ మోహినీ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున ఉపవాసం, పూజలు చేయడం ద్వారా భక్తుడు సుఖ సంతోషాలను పొందుతాడు. ఈసారి మోహినీ ఏకాదశి రోజున అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగాలు జ్యోతిషశాస్త్ర కోణంలో చూస్తే చాలా పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి అమృత యోగం: ఇది మే 19, ఆదివారం ఉదయం 05:28 నుంచి మే 20, సోమవారం ఉదయం 03:16 వరకు ఉంటుంది. వజ్ర యోగం: మే 18, శనివారం ఉదయం 10:25 నుండి మే 19 ఆదివారం ఉదయం 11:25 వరకు సిద్ధి యోగం: ఇది మే 18వ తేదీ శనివారం ఉదయం 11:25 నుండి మే 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12:11 గంటల వరకు ఉంటుంది. ఈ యోగాలలో మోహినీ ఏకాదశి వ...

Ramanujaacharya (Sri Vyshnavite aacharya) birth day on 12-5-2024 Sunday

  Thiruvarangathamudanar, in his 'Ramanuja Nootrandadhi,' has acknowledged the role of the Azhvars in spreading Vedantic truths. Refering to Poigai Azhvar, the first Azhvar, he says he is the one who lit a lamp to get rid of darkness. He refers to Poigai Azhvar with a sense of possession as 'yem' (our). The reason is Poigai Azhvar's work, as that of the other Azhvars, is in Tamil. His verses are not in a language we cannot comprehend, but it is in our language. Hence this is a cause for delight. What was the darkness the lamp lit by Poigai Azhvar's lamp dispelled ?It was the darkness of ignorance in our hearts that the Azhvar dispelled, through his verses. His verses are collectively referred to as the Mudal Thiruvandadi. Poigai Azhvar's work begins with a verse that says that with the world as the lamp, the ocean as the oil, the Sun as the igniting spark, the Azhvar lit a lamp, namely his verses. It goes on to say his verses are the garland he offers to Lor...

వైశాఖ మాసం 9-5-2024 గురువారం నుండి ప్రారంభం.

 గురువారం  నుండి వైశాఖ మాసం ప్రారంభం అవుతుంది. వసంత ఋతువులో రెండవ మాసం వైశాఖ మాసం. దీనికి వైదిక సాంప్రదాయంలో 'మాధవ' మాసం అంటారు. వైశాఖ మాసం లక్ష్మీ నారాయణుల ఆరాధనకి చాలా ప్రసిద్ధమైనది. వైశాఖంలో రకరకాల వ్రతాలు చెప్పారు. వైశాఖ మాసంలో సూర్యుడు మేష సంక్రమణంలో ఉండగా ప్రాత: స్నానం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. మాసాలన్నింట్లో వైశాఖమాసం ఉత్తమమైనది. విశేషదానాలకు ఎంతో పుణ్య ప్రదమైన మాసంగా పురాణాలలో చెప్పబడింది. శ్రీ మహా విష్ణువు కు ప్రీతి కరమైన ఈ వైశాఖ మాసం లో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువు ను లక్ష్మీ దేవితో కలిపి పూజించిన వారికి ముక్తి దాయకం. ఈ మాసం లో ఏక భుక్తం, నక్తం అయాచితం గా భుజించడం ఉత్తమంగా చెప్పబడింది. వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది. యజ్ఞాలకు, తపస్సులకు పూజాదికాలకు, దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి శాంతినిచ్చి కోరికలను తీరుస్తుంది.

శ్రీ వైష్ణవ తదీయా రాధన పూజ సామగ్రి

బియ్యం 50 గ్రాములు,  నల్లని నువ్వులు 50 గ్రాములు, ఆవు నెయ్యి 10 గ్రాములు,  ఆవు పేడ కొంచెం,  ఆవు పంచితం కొంచెం, గంధం పొడి 10 గ్రాములు, దొప్పలు 5, మూడు ఆకుల అంట , (మోదుగ ఆకులు 3 )  ఆచమనం పాత్ర 1,రాగి చెంబు 1,  దీపం 1, ఆగరబత్తి , కర్పూరం , పూలు , తులసి దళాలు,  వక్కలు, తమలపాకులు 20.  చిల్లర పైసలు 15, ధర్భ కట్ట,1  ఆళ్వార్ సంభావన,  స్వాములకు సంభావన,  పేరుమాళ్ళ తీర్థం, సీపా తీర్థ0 (సంప్రదాయం లో ఉంటే)

గోవిందా అని ఎందుకు అంటారు ?

   ఒకనాడు వెంకటేశ్వర స్వామి వారు అగస్త్య ముని దగ్గరకు వెళ్తారు. అగస్యముని తో నా పేరు శ్రీనివాసులు అంటారు నీ దగ్గర చాలా గోవులు ఉన్నాయని తెలిసి వచ్చాను అందులో ఒక దానిని నాకు ఇవ్వవా అనే స్వామివారు అగస్త్య ముని తో అడుగుతారు. ముని చాలా సంతోషించి స్వామి మీకు ఇవ్వటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ వేదాల ప్రకారం సహచారినిఉంటే గాని గోవుని ఇవ్వకూడదు అంటారు.  కాబట్టి స్వామి మీరు సతీమణితో మరోసారి రాగలరు అప్పుడు స్వామి సరే అని వెళ్ళిపోతారు. ఒక్కరోజు అగస్త్య ముని ఆశ్రమంలో లేనప్పుడు పద్మావతి అమ్మవారు సతీసమేతంగా ఆశ్రమానికి వస్తారు. ఆశ్రమంలో శిష్యుని అడుగుతారు మీ గురువుగారు సతీసమేతంగా వచ్చి గోవును స్వీకరించండి అన్నారు మాకు గోవునిస్తారు చెప్పారు. అప్పుడు శిష్యుడు మా గురువుగారు లేరు ఆయన ఆదేశాలు లేకుండా నేను ఏమి చేయలేను మీరు మరోసారి ఆయన ఉన్నప్పుడు గోవును తీసుకొని వెళ్లండి అని శిష్యుడు పలుకుతాడు. దాంతో స్వామి వారు ఆగ్రహించి తిరుమల కొండ వైపు గబగబా నడుచుకుంటూ వెళ్తారు. అంతలో అగస్యముని ఆశ్రమానికి రాగానే శిష్యుడు జరిగిన ఉత్తాంతం వివరిస్తాడు దాంతో ముని ఒక గోవును తీసుకొని శిష్యుల్ని మరి కొం...

మే నెల 4 న వరూధిని ఏకాదశి

వరూథిని ఏకాదశి ( మే 4) న ఏ పనులుచేసిన కూడా అది గొప్ప ఫలితాలను ఇస్తుందని చెబుతుంటారు.. ప్రపంచాన్ని పోషించే శ్రీ మహా విష్ణువు అవతారమైన వామన అవతారాన్ని పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున ఆచారాల ప్రకారం శ్రీమహావిష్ణువు ఐదవ అవతారమైన వామనుని పూజించిన వారికి భయం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా ఆర్ధిక ఇబ్బందుల్లో బాధపడేవారు కొన్ని వస్తువులను బ్రాహ్మణులకు దానం చేసి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలని పండితులు సూచిస్తున్నారు.  వరుథిని ఏకాదశి రోజున చేయాల్సిన దానాలు ఏమిటంటే.. అన్న వితరణ:  వరుథిని ఏకాదశి నాడు అన్నదానం చేయడం వల్ల మానవులు, దేవతలు, పూర్వీకులు మొదలైన వారంతా సంతృప్తి చెందుతారు. వరుథిని ఏకాదశి రోజున అన్నదానం చేయడం వల్ల చాలా ఫలం లభిస్తుంది. అన్నపూర్ణ దేవి ఈ రోజున అన్నదానం చేయడం ద్వారా సంతోషిస్తుంది.దీని వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు నెలవుగా ఉంటుంది. అలాగే, మీ ఇంట్లో సుఖ శాంతులు ఉంటాయి. దాహార్తిని తీర్చడం:  వరుథిని ఏకాదశి నాడు నీటితో నింపిన మట్టి కుండను దానం చేయడం ఉత్తమమైనదిగా భావిస్తారు. ఈ రోజున బాటసారులకు నీరు ఇచ్చినా శుభఫలితాలు లభిస్తాయి. పిల్లలు దీర్ఘాయుష్షు పొందుతారని, వ...