Skip to main content

Posts

Showing posts from October, 2016
సంపదలకు అధినేత్రి శ్రీ మ‌హాల‌క్ష్మి. ఆ అమ్మవారి అనుగ్రహం ఎవరిపై వుంటుందో వారి జీవితాలు సాఫీగా నడిచిపోతా యన్నది భక్తుల విశ్వాసం . ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వుంటాయి. సంపద వుంటే ఆరోగ్యంతో పాటు అన్ని సుగుణాలు కలుగుతాయి. సాగరమథనంలో ఉద్భవించిన  లక్ష్మీదేవిని  శ్రీమహావిష్ణువు తన హృదయేశ్వరిగా చేసుకున్నాడు.  ఆమె  కటాక్షం కోసం మనం అనేక పూజలు, వ్రతాలు చేస్తుంటాం. శుచి, శుభ్రత,  నిజాయతీ  కలిగిన ప్రదేశాల్లోకి ఆమె ప్రవేశిస్తుంది. శ్రీమహావిష్ణువును పూజించే వారిని అనుగ్రహిస్తుంది. అందుకనే శ్రీరామ అవతారంలో కోదండరామునికి ఇతోధిక సేవలందించిన విభీషణుడు, హనుమంతుడికి చిరంజీవులుగా వుండమని శ్రీరాముడు సీతాదేవి సమేతంగా వరాన్ని ఇచ్చాడు. హనుమంతుడికి భవిష్యత్‌ బ్రహ్మ వరాన్ని ఇచ్చింది అమ్మవారు కావడం విశేషం. గృహంలో ప్రశాంతత, మహిళలను గౌరవించడం, తెల్లవారుఝామునే లేవడం, పూజాధికాలను క్రమం తప్పకుండా జరపడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. ఇంటికి సిరి ఇల్లాలు ఆమె మనస్సును ఎటువంటి పరిస్థితుల్లో నొప్పించకూడదని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఆమె కంట తడి పెడితే ల‌క్ష్మి వెళ్ల...
దీపావళి పూజ పద్ధతి  ఈ జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. అందుచేత దీపావళి రోజున జ్యోతి స్వరూపమైన మహాలక్ష్మిని పూజిస్తే అప్పులు తీరడం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. కాబట్టి దీపావళి నాడు ఐదు గంటలకు నిద్రలేచి, శుచిగా స్నానమాచరించి తెలుపు దుస్తులను ధరించాలి. పూజామందిరమును, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరములో ముగ్గులు పెట్టుకోవాలి. పూజకోసం ఉపయోగించుకునే పటములకు గంధము, కుంకుమతో అలంకరించుకోవాలి. పూజమందిరములో కలశముపై తెలుపు వస్త్రమును కప్పాలి. ఆకుపచ్చని రంగు పట్టుచీరను ధరించిన కూర్చుకున్న లక్ష్మీదేవి బొమ్మను లేదా పటాన్ని పూజకు సిద్ధం చేసుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్ర పద్మములు, తెల్ల కలువపువ్వులు, గులాబిపువ్వులు.. నైవేద్యానికి కేసరీబాత్, రవ్వలడ్డులు, జామకాయలు సిద్ధం చేసుకోవాలి. పూజకు ముందు శ్రీ లక్ష్మీ అష్టోత్తరము, శ్రీ మహాలక్ష్మీ అష్టకం, కనకధారాస్తవము, శ్రీ సూక్తము, శ్రీ లక్ష్మీ సహస్రనామములతో లక్ష్మీదేవిని స్తు...
శ్రీ సుదర్శన హోమం నాగోల్ వద్ద ఒక ఇంటిలో. 

రమా ఏకాదశి

 ఆశ్వయుజ బహుళ ఏకాదశి (26-10-2016 బుధవారం) – ‘రమా’ – స్వర్గప్రాప్తి. “ఏకాదశ్యాముపవసేన్న కదాచి దతిక్రమేత్” – ఏకాదశినాడు తప్పక ఉపవాసం చేయాలి. ఉపవాసంనాడు – ఉపవాసః స విఙ్ఞేయః సర్వభోగ వివర్జితః” – పాపకృత్యాలకు దూరంగా ఉండి (చేయక), సకల భోగాలను వదలి, పుణ్యకార్యాలు చేయడమే ఉపవాసం అని పెద్దలమాట! ఇంద్రియ ప్రకోపాన్ని అణచి, 11 ఇంద్రియాలను (పంచ కర్మేంద్రియ, పంచ ఙ్ఞానేంద్రియ మనస్సులు 11 ఇంద్రియాలు) భగవంతుని సన్నిధిలో వసింపజేసేదే నిజమైన ఉపవాసం.  
దీపావళి హారాతి: ఆశ్వయుజ బహుళ చతుర్దశి 29-10-2016 శనివారం   నాడు ఉదయం 5-05 ని:లు:  ఆశ్వయుజ అమావాస్య 30-10-2016 ఆదివారం నాడు దీపావళి పండుగ. దీపావళినాడు అర్ధరాత్రి సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తుంది. ఆమె మన ఇంటికి రావాలంటే మన ఇంట్లో ఉన్న ఆమె అక్కగారిని సాగనంపాలి. ఆమెపేరు జ్యేష్ఠాదేవి. ఆమెను వెళ్లగొట్టేందుకు స్త్రీలు చీపురు, చేట పట్టుకుని చప్పుడు చెయ్యాలి. ధర్మశాస్త్రంలో చెప్పిన ఈ విషయంలో స్వచ్ఛత, పరిశుభ్రత సంపదలకు మూలమనే శాశ్వత సత్యం దాగుంది. ఈ ఆశ్వయుజ అమావాస్య పిల్లల్ని, పెద్దల్ని, స్త్రీ, పురుషుల్ని చీకటిలోంచి వెలుగులోకి నడిపిస్తుంది.  
శ్రీ సుదర్శన స్తోత్ర మహాత్యం: ఈ స్త్రోత్రరాజము శ్రీమద్రామానుజాచార్యుల వారి శిష్యులైన, శ్రీ కూరనారాయణ మునులు లేదా కూరనారాయణ జీయర్ అనే వారిచే రచింపబడింది. 100 శ్లోకాలు కల ఈ స్తోత్రము, శ్రీవైష్ణవసంప్రదాయం లో ముఖ్య స్థానం కలిగి ఉంది. వీరు శ్రీ కూరత్తాళ్వాన్ కు శిష్యులు మరియు సుదర్శన మంత్రోపాసన నిష్టులు. తమకు గల ఆచార్య అభిమానం చే ఆచార్య నామమునే ధరించిన ఉత్తమ శిష్యులు. శ్రీ రంగనాధుని సన్నిధిలో దివ్య ప్రబంధగానము చేయు సాత్వికులైన శ్రీ తిరువరంగ పెరుమాళరైయర్ స్వామి తీవ్ర వ్యాధిచే బాధ పడుతున్న సమయం లో, వారి బాధ చూచి సహించలేక పొఇన శ్రీ కూరత్తాళ్వాన్ సతీమణి, కూరనారాయణ మునివరులను చూచి, అరైయర్ స్వమి యొక్క వ్యాధి పరిహార్ధమై మీ మంత్ర శాస్త్రము వినియోగించరాఅదా అని అడుగగా, రచించినదే ఈ సుదర్శన శతక స్తోత్ర రాజము. ఈ శతక రచన గూర్చి వేరొక వృత్తాంతము కూడా కలదు. ఒకప్పుడు శ్రీ రంగనాధుని వైభవమును చూచి సహింపలేకపోయిన ఒక ప్రభువు , ఒక మంత్రవేత్త సహాయంతో రంగనాధుని కళలను అపహరించదానికి నియమించాడు. ఆ ప్రభావం వలన శ్రీ రంగనాధుదు శేష శయ్య పైనుండి నాలుగు అంగుళములు పైకి లేచి కనపడగా ...అర్చకులు పెద్దలు ఈ విషయాన్ని శ్రీ కూర...
 వచ్చే నెల 6వ తేదీ నుంచి 12వ తేదీ (November) వరకు నగరంలోని ఎగ్జిబిషన్‌ మైదానంలో 108 హవన కుండలాలతో అష్టోత్తర శతనామ లక్ష్మీనారాయణ యజ్ఞంను నిర్వహిస్తున్నట్లు శ్రీ లక్ష్మీనారాయణ యజ్ఞ కమిటీ భాగ్యనగర్‌ కన్వీనరు వరకుమార్‌ గుప్తా తెలిపారు. ఇందులో భాగంగా శ్రీమత్‌ భాగవత కథా కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆదివారం కార్యస్థలి అయిన ఎగ్జిబిషన్‌ మైదానంలో త్రిదండి శ్రీనివాస వ్రతధర నారాయణ రామనుజ జీయర్‌ స్వామీ చేతుల మీదుగా భూమి పూజ జరిపించారు. అనంతరం వరకుమార్‌గుప్తా మాట్లాడుతూ 6వ తేదీన బేగంబజార్‌ ఫీల్‌ఖానా నుంచి మహా శోభాయాత్ర ప్రారంభమై ఎగ్జిబిషన్‌ మైదానంకు చేరుకుంటుందని తెలిపారు. 7వ తేదీ యజ్ఞం, భాగవత కథ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో భట్టడ్‌ స్వామి, పురుషోత్తం లాహోటీ, మేగరాజ్‌ అగర్వాల్‌, శశికాంత్‌, గోకుల్‌చంద్‌, అనిల్‌ మిశ్రా, వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.Purohiths wanted please call 9989324294 Rachakonda Rama charyulu.
నరునిదృష్టికి నల్లరాళ్లుకూడా  పగులుతాయంట .  అందుకే ఇతరుల ద్రుష్టి మన మీద పడకుండావుండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు ఒక్కసారి పరిశీలిస్తే మనిషికంటి  చూపుకు కొన్నివేల శక్తులు ఉంటాయి . అందుకే ఇతరులు ద్రుష్టి యొక్క ప్రభావం మన మీద పడకుండావుండాలంటే ముందుగా ప్రతి వారు చేయాలిసింది ఉదయం నిద్ర లేవగానే మనరెండు అరచేతులను చూస్తూ లక్ష్మీదేవిని ప్రార్ధించాలి . అయితే ఇతరులు మనవైపు సౌమ్యంగాచూస్తే మంచి జరుగుతుంది . అదే అసూయగా చూస్తే కచ్చితంగా చెడు జరుగుతుందని మహా పండితులు నిశితంగా వివరిస్తున్నారు . నరదృష్టి ప్రభావం ఎలావుంటుందో చెప్పాలంటే ఓ గ్లాసుడు మంచి నీళ్లు  పోసి తదేకంగాచూస్తే మన చూపు సాద్వికంగా చూస్తే ఓమార్పు , క్రూరంగా చూస్తే మరొకరకంగా మారుతుంది . కాబట్టి మనిషి చూపుకి అంతటి ప్రభావం వుంది . ఇక ఇంటికి ఎలాంటి ద్రుష్టి దోషం తగలకుండావుండాలంటే ఇంటి సింహద్వారంవద్ద పచ్చిమిరపకాయలు , జీడిగింజ , నిమ్మకాయ కలిపి ఇనపమేకు తో గుచ్చి కట్టాలి . అలాగే బూడిదగుమ్మడికాయ కు కన్ను , ముక్కు , చెవి , నోరు అద్ది సింహద్వారంకి కట్టాలి . వీటి వల్ల మనిషి దృష్టిని మరల్చితే ఇంటి మీద ద్...
Bhokta & Kartha  Rules on Aabdikam days.  For the sanctity of the bhoktha these are all the must. 1. He should be fairly healthy, married and a family man and with no physical handicappedness. 2. He should refrain from family life on the previous day. 3. He should have fasted the previous day. 4. He should be clean, neatly dressed and should have taken oil bath on the day. 5. He should partake only in one sraadha on a day. This is very important. 6. On the sraardha day too other than the food taken no meals should be taken in the night. 7. If not done the Veda Adyayanam fully, at least he must a be a person doing his daily Gayatri Japa. And above all, 8. He should not be from the same Gothra as that of Kartha. I think you agree if I state such a bhoktha has to be fully compensated with Dakshina and other forms . Bhoktha can partake maximum seven sraadhas in a month. The entire month bhoktha and his family has to survive on the dakshina. In general the Nakshatra for...
ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము ,  2.సంగవకాలము ,  3. మధ్యాహ్నకాలము ,  4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. ·            ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా ,  వ్రత ,  శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. ·            ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. ·            ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...
సంస్కృత భాషలో ఆదికవి అయిన మహర్షి వాల్మీకి జయంతి నేడు 16-10-2016 ఆదివారం.    వాల్మీకి గొప్ప మహర్షి,తపఃశాలి. ఈయన రచించిన వాల్మీకి రామాయణాన్నే  భారతీయులు ప్రామాణికంగా తీసుకుంటారు.  రామాయణంలోని ఉత్తరకాండలో మనకి వాల్మీకి పూర్వాశ్రమ జీవితం గురించి తెలుస్తుంది. ఆ కథనం ప్రకారం వాల్మీకికి ఆయన  తల్లిదండ్రులు పెట్టిన పేరు రత్నాకర్ . ఆయన తన కుటుంబాన్ని  పోషించటానికి అడవిలో నివసిస్తూ బాటసారుల సొత్తును దోచుకుని జీవితం గడిపేవారు. ఒకరోజు నారద మహర్షిని కూడా దోచుకోబోగా, నారదుడు ఆ దొంగను …..కుటుంబం కోసం చేసే ఈ దోపిడి ద్వారా వచ్చే పాపాన్ని కుటుంబం కూడా పంచుకుంటుందా అని ప్రశ్నిస్తారు. ఔను అని దొంగ అనగా, ఈ విషయాన్ని భార్య నుండి ధృవీకరించుకోమని నారదుడు అంటాడు. భార్యను అడుగగా, పాపాన్ని పంచుకోడానికి నిరాకరిస్తుంది. ఆ విధంగా ఆత్మసాక్షాత్కారం పొంది, నారదుడిని క్షమాపణ కోరి, జీవిత సత్యాన్ని తెలుసుకుంటారు. నారదుడు రామనామ మంత్రాన్ని వాల్మీకికి ఉపదేశిస్తారు. ఉపదేశం తర్వాత ఆయన జపం చేస్తూ ఉన్న చోటనే తపస్సమాధిలోకి వెళ్ళిపోయారు చుట్టూచీమలు పుట్టలు తయారు చేసుకున్నా చలించకుండా తపస్సు చే...
DASARAA  -  JAMMI  TREE  IMPORTANCE || శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ ||దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈ విజయ దశమి రోజే అని తెలియచేయబడింది . 'శ్రవణా' నక్షత్రంతోకలిసిన ఆశ్వయుజ దశమికి "విజయ"అనే సంకేతమున్నది  .అందుకనే దీనికి 'విజయ దశమి' అను పేరు వచ్చినది. ఏ పనైనా తిధి ,వారము తారా బలము ,గ్రహాబలము ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము .'చతుర్వర్గ చింతామణి 'అనే ఉద్గ్రందము ఆశ్వయుజ శుక్లదశమి నాటినక్షత్రోదయ వేలనే 'విజయం ' అని తెలిపి యున్నది . ఈ పవిత్ర సమయము సకలవాంచితార్ద సాధకమైనదని గురు వాక్యము .'శమీ పూజ' చేసుకునే ఈ రోజు మరింత ముఖ్యమైనది . శమీ వృక్షమంటే 'జమ్మి చెట్టు'. అజ్ఞాతవాసమందున్నపాండ­వులు వారి వారి ఆయుధములను , వస్త్రములను శమీవృక్షముపై దాచి ఉంచారు . అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుదములను ,వస్త్రములను పొంది , శమీవృక్ష రూపమున ఉన్న 'అపరాజిత'దేవి ఆశీస్సులు...
DASARAA  -  JAMMI  TREE  IMPORTANCE || శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ ||దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈ విజయ దశమి రోజే అని తెలియచేయబడింది . 'శ్రవణా' నక్షత్రంతోకలిసిన ఆశ్వయుజ దశమికి "విజయ"అనే సంకేతమున్నది  .అందుకనే దీనికి 'విజయ దశమి' అను పేరు వచ్చినది. ఏ పనైనా తిధి ,వారము తారా బలము ,గ్రహాబలము ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము .'చతుర్వర్గ చింతామణి 'అనే ఉద్గ్రందము ఆశ్వయుజ శుక్లదశమి నాటినక్షత్రోదయ వేలనే 'విజయం ' అని తెలిపి యున్నది . ఈ పవిత్ర సమయము సకలవాంచితార్ద సాధకమైనదని గురు వాక్యము .'శమీ పూజ' చేసుకునే ఈ రోజు మరింత ముఖ్యమైనది . శమీ వృక్షమంటే 'జమ్మి చెట్టు'. అజ్ఞాతవాసమందున్నపాండ­వులు వారి వారి ఆయుధములను , వస్త్రములను శమీవృక్షముపై దాచి ఉంచారు . అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుదములను ,వస్త్రములను పొంది , శమీవృక్ష రూపమున ఉన్న 'అపరాజిత'దేవి ఆశీస...
చైతన్య శక్తి చేసే జన్మ యాత్రల్లో మానవ జన్మ అత్యున్నతమని విజ్ఞులు చెబుతారు. ఒక విత్తనం మొలకగా వెలువడి, మొక్కగా మారి, ఆ తరవాత కొమ్మకు పువ్వుగా పూయడం వంటిదే మనిషి జన్మ. పుణ్యఫలం వల్లనే మనిషిగా పుట్టే అదృష్టం లభిస్తుందంటారు. కొండ అడ్డు వచ్చిందని నది ఆగిపోతుందా? లేదు. అప్పుడు నది పక్కమార్గం వెతుక్కొని సాగిపోతుంది. ఆ కొండ చుట్టూ పారే నది- ప్రకృతి శోభను మరింత పెంచుతుంది. అలాగే, ఉలితో చెక్కితేనే కఠిన శిలైనా సుందర శిల్పంగా మారుతుంది. వెదురు కర్ర అయినా, దాన్ని మురళిగా మారిస్తే మధుర గానం వినిపిస్తుంది. ఆ అమృతంతో లోకాన్ని ఓలలాడిస్తుంది. కష్టాలకు ఎదురొడ్డి, కాలాన్ని ఈదే వారే విజేతలుగా నిలుస్తారు. సమాజమూ వారినే గౌరవిస్తుంది. వారికి అది గొప్ప ఆనందాన్నిస్తుంది. అజ్ఞానంతో ఉన్నంత కాలం జీవితం అంధకారమయమే! అందువల్ల, జీవితానికి అర్థం తెలియజేసే విలువైన పుస్తకాల్ని మనిషి బాగా చదవాలి. మంచి మాటలు వినిపించే సత్సంగాలకు వెళ్లాలి. ఆధ్యాత్మిక బోధనల్ని శ్రద్ధగా వినాలి. ప్రతి పనినీ దైవంలా భావించి చేయాలి. జీవితానికి ఆ ఎరుకే పునాది! మనిషి ప్రతి క్షణాన్నీ ధ్యానంతో సద్వినియోగం చేసుకొన్నప్పుడు, ఆ పయనంలోని అణువణువూ జీవ...
ASTRA & SHASTRA & AAYUDHA PUJA on 10-10-2016 Monday. Muhurath time between   02-09 p.m. and 02-56 p.m. Ayudha Puja  falls during  Maha Navratri  dated:10-10-2016 Monday  and it is popular only in South India mainly in Karnataka, Tamil Nadu, Andhra Pradesh and Kerala. Ayudha Puja is done on Navami Tithi during Navratri. Most of the time, it falls on  Maha Navami  during Navratri. Ayudha Puja is also known as  Shastra Puja  and Astra Puja . Historically Ayudha Puja was meant to worship weapons but in its present form all sort of instruments are worshipped on the very same day. In South India it is a day when craftsmen worship their tools and instruments similar to  Vishwakarma Puja  in other parts of India. In its modern form Ayudha Puja has become  Vahana Puja  when people worship their vehicles including cars, scooters, and motor bikes. During Vahana Puja all sort of vehicles, which are in use, are decorated...
Telangana festival Bathukamma means ‘come back to life mother’ and is asking Goddess Sati to return back. Legend has it that Sati returned as Goddess Parvati and therefore the festival is also dedicated to Goddess Parvati.
A  birth certificate  is a  vital record  that documents the  birth of a child . The term "birth certificate" can refer to either the original document certifying the circumstances of the birth or to a certified copy of or representation of the ensuing registration of that birth. It contains father & Mother names compulsorily.
ASTRA & SHASTRA & AAYUDHA PUJA on 10-10-2016 Monday. Muhurath time between   02-09 p.m. and 02-56 p.m. Ayudha Puja  falls during  Maha Navratri  dated:10-10-2016 Monday  and it is popular only in South India mainly in Karnataka, Tamil Nadu, Andhra Pradesh and Kerala. Ayudha Puja is done on Navami Tithi during Navratri. Most of the time, it falls on  Maha Navami  during Navratri. Ayudha Puja is also known as  Shastra Puja  and Astra Puja . Historically Ayudha Puja was meant to worship weapons but in its present form all sort of instruments are worshipped on the very same day. In South India it is a day when craftsmen worship their tools and instruments similar to  Vishwakarma Puja  in other parts of India. In its modern form Ayudha Puja has become  Vahana Puja  when people worship their vehicles including cars, scooters, and motor bikes. During Vahana Puja all sort of vehicles, which are in use, are decorated wit...
DASARA  NAVARAATHRI స మస్త సృష్టిలో శక్తి ఉపాసనను మించింది లేదు. ఆ శక్తే- ఆది పరాశక్తి. ఆమె జగన్మూర్తి, బ్రహ్మ స్వరూపిణి, వేదవేద్య. ఆ దేవి సకల లోకాలకూ వందనీయగా విరాజిల్లుతోంది. ఇచ్ఛా శక్తి, జ్ఞాన శక్తి, క్రియా శక్తికి ప్రతీకలుగా లక్ష్మి, సరస్వతి, పార్వతీ మాతల్ని పూజించే తొమ్మిది రోజులనూ ‘శరన్నవరాత్రులు’ అంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు శరదృతువులో వచ్చేవి కనుక, ఇవి శరన్నవరాత్రులుగా ప్రసిద్ధమయ్యాయి. దేవిని ఆరాధిస్తారు కాబట్టి, ‘దేవీ నవరాత్రులు’ అనీ వీటిని వ్యవహరిస్తారు. పరాశక్తికి మరో పేరు- శారద. ఆ తల్లిని అర్చించే రాత్రులు కావడంతో, వీటికి ‘శారద నవరాత్రులు’ అనే పేరూ ఉంది. నవరాత్రి ఉత్సవాలు సంవత్సరంలో రెండుసార్లు వస్తాయి. చైత్రమాసంలో వచ్చేవి వసంత నవరాత్రులు. ఈ ఆశ్వయుజ మాసంలో వచ్చేవి శరన్నవరాత్రులు. ఈ రెండు రుతువుల్లోనూ ఆదిశక్తిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. దుష్టులైన రాక్షసుల్ని సంహరించేందుకు అమ్మవారు తొమ్మిది అవతారాలు ధరించిందని చెబుతారు. తొమ్మిది విధాలైన అనుష్ఠానాలు, విధి విధానాలతో తొమ్మిది రోజుల వ్రతదీక్ష చేపట్టిందని, ఆ శక్తి వల్ల కలిగిన అసమాన బలంతోనే పదో ...