సంపదలకు అధినేత్రి శ్రీ మహాలక్ష్మి. ఆ అమ్మవారి అనుగ్రహం ఎవరిపై వుంటుందో వారి జీవితాలు సాఫీగా నడిచిపోతాయన్నది భక్తుల విశ్వాసం. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వుంటాయి. సంపద వుంటే ఆరోగ్యంతో పాటు అన్ని సుగుణాలు కలుగుతాయి. సాగరమథనంలో ఉద్భవించిన లక్ష్మీదేవిని శ్రీమహావిష్ణువు తన హృదయేశ్వరిగా చేసుకున్నాడు. ఆమె కటాక్షం కోసం మనం అనేక పూజలు, వ్రతాలు చేస్తుంటాం. శుచి, శుభ్రత, నిజాయతీ కలిగిన ప్రదేశాల్లోకి ఆమె ప్రవేశిస్తుంది. శ్రీమహావిష్ణువును పూజించే వారిని అనుగ్రహిస్తుంది. అందుకనే శ్రీరామ అవతారంలో కోదండరామునికి ఇతోధిక సేవలందించిన విభీషణుడు, హనుమంతుడికి చిరంజీవులుగా వుండమని శ్రీరాముడు సీతాదేవి సమేతంగా వరాన్ని ఇచ్చాడు. హనుమంతుడికి భవిష్యత్ బ్రహ్మ వరాన్ని ఇచ్చింది అమ్మవారు కావడం విశేషం. గృహంలో ప్రశాంతత, మహిళలను గౌరవించడం, తెల్లవారుఝామునే లేవడం, పూజాధికాలను క్రమం తప్పకుండా జరపడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. ఇంటికి సిరి ఇల్లాలు ఆమె మనస్సును ఎటువంటి పరిస్థితుల్లో నొప్పించకూడదని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఆమె కంట తడి పెడితే లక్ష్మి వెళ్లిపోతుంది. అమ్మ కటాక్షం కోసం అగస్త్య మహాముని ప్రవచించిన లక్ష్మీదేవి స్తోత్రం, ఆదిశంకరాచార్యులు ఐదేళ్ల వయస్సులో పఠించిన కనకధార స్తోత్రాం, లక్ష్మీదేవి అష్టోత్తరాలను ప్రార్థన చేయాలి. మనకున్న దానిలో దానం చేయాలి ఇలా చేసేవారికి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ వుంటుంది.
ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము , 2.సంగవకాలము , 3. మధ్యాహ్నకాలము , 4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. · ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా , వ్రత , శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. · ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. · ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...
Comments
Post a Comment