Skip to main content
శ్రీ సుదర్శన స్తోత్ర మహాత్యం:
ఈ స్త్రోత్రరాజము శ్రీమద్రామానుజాచార్యుల వారి శిష్యులైన, శ్రీ కూరనారాయణ మునులు లేదా కూరనారాయణ జీయర్ అనే వారిచే రచింపబడింది. 100 శ్లోకాలు కల ఈ స్తోత్రము, శ్రీవైష్ణవసంప్రదాయం లో ముఖ్య స్థానం కలిగి ఉంది. వీరు శ్రీ కూరత్తాళ్వాన్ కు శిష్యులు మరియు సుదర్శన మంత్రోపాసన నిష్టులు. తమకు గల ఆచార్య అభిమానం చే ఆచార్య నామమునే ధరించిన ఉత్తమ శిష్యులు. శ్రీ రంగనాధుని సన్నిధిలో దివ్య ప్రబంధగానము చేయు సాత్వికులైన శ్రీ తిరువరంగ పెరుమాళరైయర్ స్వామి తీవ్ర వ్యాధిచే బాధ పడుతున్న సమయం లో, వారి బాధ చూచి సహించలేక పొఇన శ్రీ కూరత్తాళ్వాన్ సతీమణి, కూరనారాయణ మునివరులను చూచి, అరైయర్ స్వమి యొక్క వ్యాధి పరిహార్ధమై మీ మంత్ర శాస్త్రము వినియోగించరాఅదా అని అడుగగా, రచించినదే ఈ సుదర్శన శతక స్తోత్ర రాజము. ఈ శతక రచన గూర్చి వేరొక వృత్తాంతము కూడా కలదు. ఒకప్పుడు శ్రీ రంగనాధుని వైభవమును చూచి సహింపలేకపోయిన ఒక ప్రభువు , ఒక మంత్రవేత్త సహాయంతో రంగనాధుని కళలను అపహరించదానికి నియమించాడు. ఆ ప్రభావం వలన శ్రీ రంగనాధుదు శేష శయ్య పైనుండి నాలుగు అంగుళములు పైకి లేచి కనపడగా ...అర్చకులు పెద్దలు ఈ విషయాన్ని శ్రీ కూర నారాయణ మునివరులకు విన్నవించగా ..ఇది మంత్రవేత్త ప్రభావమని గుర్తించి వానిని పట్టుకొని స్వామి ని యాధాస్థానమున దించవలెనని తలచినారు. అందుకు ఉపాయముగా ఆ రోజు ప్రసాదములో ఆవపొడి ఎక్కువ వేయించినారు.. అట్లు స్వామి ని అపహరించదలచిన మంత్రవేత్తలు బలిహరణ మెతుకులు తినవలెనని నియమము కలదు.. ఈ విషయము తెలిసి కూర నారాయణులు ఆవ పొడి ని పులిహోర యందు కలిపించారు. రోజూ మాదిరిగానే కళ్ళకు అంజనం వ్రాసుకొని ఆ మంత్రవేత్త బలిహరణ మెతుకులు తినడానికై వచ్చి తినగా, ఆవపొడి ఘాటు వలన కన్నీరు కారగా అందువలన కంటికి రాసుకొనిన అంజనపు కాటుక కరిగిపోగా పట్టు పడిపోయినాడు ఆ మాంత్రికుడు.. అతడి ద్వారానే విషయమును తెలిసికొని శ్రీరంగనాధుని ఆభరణములు ఇచ్చివేయుదుమని ప్రలోభపెట్టి ఇచ్చివేసి, శ్రీ రంగనాధుని మరల ఆ మంత్రవేత్త చేతనే యధా పూర్వముగ కళలతో అలరారునట్లుగా చేయించినారు............. ఇట్టి దుష్ట స్వభావము కలిగిన వాని వలన మరల ఎప్పుడైనా ఏ దేవాలయములోనైనా ఇట్టి ప్రమాదము జరుగవచ్చును అని భావించి ఇట్టి మంత్రవేత్త జీవించుత దివ్య దేశ వైభవమునకు హానికరమని తలంచిన శ్రీ కూరనారాయణులు వాడి తోడుగా వెళ్ళిన మల్లులచేతనే వాడిని వధింపచేసి మరల శ్రీ రంగనాధుని ఆభరణరాషిని శ్రీస్వామివారి భండాగారములో చేర్పించిరి. సంహరింపచేయుట వలననే నేమో కూరనారాయణుల 'పవన శక్తి ' కుంటుపడినది. అపుడు వీరు నూరు త్రాళ్ళుతో నిర్మింపబడిన ఒక ఉట్టిని గాలిలోనికి వ్రేలాడదీయించి తాము అందుండీ, ఈ సుదర్శన శతకమందలి ఒక్కొక్క శ్లొకమును పటించుచూ ఒక్కొక్క త్రాటిని తొలగించసాగారు. అట్లు నూరు శ్లొకములు పూర్తి అయినప్పటికి నూరు త్రాళ్ళను చేదించినా శ్రీ కూరనారయణ జీయర్ క్రింద పడిపోక వియత్తలముననే నిలువగలిగినారు. ఇట్లు వీరు కోల్పోఇన 'పవన శక్తి ' ని తిరిగి పొందునటూల చేసినదీ సుదర్శన శతక స్తోత్ర రాజము ఈ స్తోత్రము పటించువలన ఎంత శక్తి కలుగునో వినుట చేతకూడ అంతే ప్రయోజనము కలుగును అందకే ఆస్తికులందరూ ధర్మార్థ కామ మోక్షాది నిమిత్తమై ఈ స్తోత్రమును పారాయణాదులు జరిపించెదరు.
"యస్యస్మరణ మాత్రేణ విద్రవంతి సురారయ:, సహస్రార నమస్తుభ్యం విష్ణు పాణి తలాశ్రయ:" ఎవ్వని స్మరించిన మాత్రముననే అసురరాక్షసాదులందరూ భయపడి పరుగులు పెట్టుదురో, అట్టి మాహాత్మ్యము గల శ్రీమన్నారయణుని పాణి తలమున అలంకరించి ఉండు ఓ సహస్రార దేవా ! నీకు నమస్సులు.
శ్రీ సుదర్శన శతకము ఆరు వర్ణనములతో నూరు శ్లోకములతో అలరారుతుంది. జ్వాలా వర్ణనము 24 శ్లోకములు, నేమి వర్ణనము 14 శ్లోకములు, అర వర్ణనము 12 శ్లోకములు, నాభి వర్ణనము 11 శ్లోకములు, అక్ష వర్ణనము 13 శ్లోకములు మరియు పురుష వర్ణనము 26 శ్లోకములు కలిగి 101 శ్లోకము ఫలశ్రుతిగా చెప్పబడినది.

Comments

Popular posts from this blog

తద్దినం సమయము మరియు నియమాలు

ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము ,  2.సంగవకాలము ,  3. మధ్యాహ్నకాలము ,  4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. ·            ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా ,  వ్రత ,  శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. ·            ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. ·            ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.