వచ్చే నెల 6వ తేదీ నుంచి 12వ తేదీ (November) వరకు నగరంలోని ఎగ్జిబిషన్ మైదానంలో 108 హవన కుండలాలతో అష్టోత్తర శతనామ లక్ష్మీనారాయణ యజ్ఞంను నిర్వహిస్తున్నట్లు శ్రీ లక్ష్మీనారాయణ యజ్ఞ కమిటీ భాగ్యనగర్ కన్వీనరు వరకుమార్ గుప్తా తెలిపారు. ఇందులో భాగంగా శ్రీమత్ భాగవత కథా కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆదివారం కార్యస్థలి అయిన ఎగ్జిబిషన్ మైదానంలో త్రిదండి శ్రీనివాస వ్రతధర నారాయణ రామనుజ జీయర్ స్వామీ చేతుల మీదుగా భూమి పూజ జరిపించారు. అనంతరం వరకుమార్‌గుప్తా మాట్లాడుతూ 6వ తేదీన బేగంబజార్ ఫీల్‌ఖానా నుంచి మహా శోభాయాత్ర ప్రారంభమై ఎగ్జిబిషన్ మైదానంకు చేరుకుంటుందని తెలిపారు. 7వ తేదీ యజ్ఞం, భాగవత కథ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో భట్టడ్ స్వామి, పురుషోత్తం లాహోటీ, మేగరాజ్ అగర్వాల్, శశికాంత్, గోకుల్‌చంద్, అనిల్ మిశ్రా, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.Purohiths wanted please call 9989324294 Rachakonda Rama charyulu.
ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము , 2.సంగవకాలము , 3. మధ్యాహ్నకాలము , 4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. · ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా , వ్రత , శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. · ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. · ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...
Comments
Post a Comment