పన్నెండుమంది ఆళ్వార్లలో ఒకడైన కులశేఖర ఆళ్వార్ పునర్వసు నక్షత్రమున జన్మించాడు. అతను చేర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. గొప్ప రామభక్తుడైన అతను రాముని కష్టాలు తన స్వంత కష్టములుగా భావించేవాడు. అందువలన అతనిని ‘పెరుమాళ్’, (అంటే ‘అతి గొప్పవాడు’ – సాధారణముగ వెంకటేశ్వరస్వామికి ఉపయోగించే పేరు) అనికూడా పిలిచేవారు. అతని భక్తి ఎంత తీవ్రమైనదంటే స్వామి భక్తులను సాక్షాత్తు స్వామివలే పూజించేవాడు. అతను శ్రీరంగములో నివసిస్తూ అక్కడి ఆలయములో రంగనాథ స్వామి సేవచేస్తుండేవాడు.ఈయన వేంకటేశ్వరస్వామి ని నీ గర్భగుడి ముందు గడపగా నైనా పడివుండే వరమీయమని అడిగితే స్వామి తథాస్తు అన్నారట. నేటికీ తిరుమల లో గర్భగుడి ద్వారానికున్న గడపని 'కులశేఖర పడి' అని అంటారు. ఇతడు ముకుందమాల అను భక్తి స్తోత్రాన్ని సంస్కృతంలో రచించాడు.
ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము , 2.సంగవకాలము , 3. మధ్యాహ్నకాలము , 4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. · ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా , వ్రత , శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. · ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. · ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...
Comments
Post a Comment