ఛైత్ర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని (తేదీ 1-4-2023 శనివారం ) కామద ఏకాదశి అంటారు. శ్రీరామ నవమి తర్వాత వచ్చే ఏకాదశి కావడంతో దీనికి మరింత ప్రాధాన్యత పెరిగింది. ఈ సమయంలో ఉపవాసo ఉన్న వారికి తెలిసి, తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ పవిత్రమైన రోజున శ్రీమహా విష్ణువును పండ్లు, పువ్వులు, పాలు, నువ్వులు, తులసి ఆకులను, నైవేద్యాలను సమర్పించాలి. తులసి ఆకులు లేకుండా మీ పూజ పూర్తవ్వదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అనంతరం శ్రీ విష్ణు సహస్ర నామ , లక్ష్మీ స్తోత్రాలను, మంత్రాలను పఠిస్తూ మనసును దేవుని పైన ఉంచాలి. ఏకాదశి తర్వాత ద్వాదశి తిథి నాడు బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయాలి.
హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని , ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు , ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా , అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై , సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి , భవిష్యత్ దంపతులుగా , కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ , జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో , ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...
Comments
Post a Comment