Skip to main content

Posts

"గుడిలో మనం ఏం సేవ చేయొచ్చు?"

భగవంతుడికి మనం చేసే గొప్ప సేవలలో ఒకటి మన శరీరంతో ఒక సామాన్యుడిలా సేవ చేయడం. ఆ సేవ ఒక దేవాలయంలో చేస్తే ఇంకా గొప్ప పుణ్యం.  భగవంతుడి ముందు అందరం సమానమే. అందరూ సామాన్యులమే అనే భావం మనస్సులో నింపుకొని, ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా దేవాలయంలో సేవ చేస్తే, భగవంతుడు తప్పక మనల్ని అనుగ్రహిస్తాడు.  దేవాలయంలో మనం చేసే సేవ, ఆ భగవంతుడి పూజ కన్నా ఎక్కువైనదే అనటంలో సందేహం లేదు. దేవాలయంలో మనం చాలా సేవలు చేయవచ్చు. అవి.....    *దేవాలయం బండలు తుడవడం,  *భగవంతుడు (విగ్రహం) ధరించిన వస్త్రాలు ఉతకడం,  *దేవుడి పల్లకి మోయడం,  *దేవుడి పూజ సామాగ్రిని శుభ్రం చేయడం,  *దేవాలయ ప్రాంగణం శుభ్రం చేయడం,  *దేవుని విగ్రహాల అలంకరణ కోసం పూలమాలలు కట్టడం,  *దేవుడి అలంకరణలో సహాయం చేయడం,  *దేవుడి పూజకు సామాన్లు సర్దడం,  *దేవుడి అభిషేకం కోసం పదార్థాలను వండటం / సర్దడం దేవుడి తీర్థ ప్రసాదాలు పంచడం, *దేవాలయం గోడలు / గోపురాల మీద బూజు దులపడం,  *అన్నదాన కార్యక్రమంలో వంటకు సహాయం చేయడం,  *దేవుడి పూజ యొక్క నిర్మాల్యం శుభ్రం చేయడం,  *అభిషేకం తర్వాత గర్భాలయం శుభ్రం చేయడ...

ఋషి పంచమి తేదీ 19-9-2023 మంగళవారం

    ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున దీనిని జరుపుకుంటారు. ఈ రోజున ఏడుగురు మహర్షులను పూజించడం వల్ల జీవితంలో సుఖశాంతులు లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజున ఉపవాసం ( Rishi Panchami  2023) ఉండడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. పంచాంగం ప్రకారం,  ఋషి పంచమి  సెప్టెంబర్ 19, మంగళ వారం వస్తుంది. ఋషి  పంచమినే రిషి  పంచమి , గురు  పంచమి  అని కూడా  అంటారు . సనాతన ధర్మంలో  ఋషి  పంచమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఏడుగురు ఋషులను పూజిస్తారు. ఈ రోజున ఎవరైతే ఋషులను పూజించి స్మరిస్తారో వారికి పాప విముక్తి లభిస్తుందని నమ్ముతారు.  ఈ పుణ్య రోజున అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమి, వశిష్ఠ, విశ్వామిత్ర మహర్షులను ఒక్కసారైనా వారిని తలచుకోవాలని మన పెద్దలు చెబుతుంటారు. అరణ్యవాసంలో సీతారాములకు అభయం ఇచ్చినవారు అత్రిమహర్షి. సాక్షాత్తూ శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు. సీతారాములకు చిత్రకూటానికి దారి చూపించినవాడు భరద్వాజ మహర్షి. తన భార్య అహల్య ద్వారా రాముడికి తన తపః ఫలాన్ని అందించిన మహారుషి గౌతముడు. రాముడి గురువు విశ్వామిత్రుడు, కులగురువ...

అజ ఏకాదశి తేదీ 10-9-2023 ఆదివారం

    ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని అజ ఏకాదశి అంటారు. దీని గురించి పద్మ పురాణంలో వివరించబడింది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల అశ్వమేథ యాగం చేసిన ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు. మరోవైపు ఈసారి వచ్చిన అజ ఏకాదశి వేళ అనేక శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ ప్రత్యేకమైన రోజున పునర్వసు, పుష్య నక్షత్రాల ప్రభావంతో వరియాన్ యాగం, రవి పుష్య యోగం, సర్వార్ధ సిద్ధి యోగం ఏర్పడనున్నాయి.   మూడు శుభ యోగాలు.. ఈ పవిత్రమైన రోజున సర్వార్ధ, వరియాన్, రవి పుష్య యోగాలు ఏర్పడనున్నాయి. ఈ మూడు యోగాల వల్ల అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. ఈ మూడు యోగాల సమయంలో శ్రీ హరిని ఆరాధించడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతారు.

"సప్త చిరంజీవులు"

చిరంజీవులు అంటే ఎప్పటికీ చావు లేనివారు అని అర్థం. పురాణాల ప్రకారం ఏడుగురు చిరంజీవులు ఉన్నారు. 1. అశ్వత్థాముడు 2. బలి చక్రవర్తి 3. వ్యాసుడు 4. హనుమంతుడు 5. విభీషణుడు 6. కృపుడు 7. పరశురాముడు వారిని స్మరిస్తూ చెప్పేదే సప్త చిరంజీవి శ్లోకం. అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః  కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః  సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమం  జీవేద్వర్షశ్శతమ్ సోపి సర్వవ్యాధి వివర్జిత. శ్రీ కృష్ణ పరమాత్మ శాపం వలన అశ్వత్థాముడు, వామనుని అనుగ్రహం వల్ల బలి చక్రవర్తి, లోక హితం కొరకు వ్యాసుడు, శ్రీరాముని భక్తితో హనుమంతుడు, రాముని అనుగ్రహం వల్ల విభీషణుడు, విచిత్రమైన జన్మం వలన కృపుడు, ఉత్కృష్టమైన తపోశక్తి చేత పరశురాముడు సప్త చిరంజీవులు అయ్యారు.  ఈ ఏడుగురితో పాటుగా, శివానుగ్రహంచే కల్పంజయుడైన మార్కండేయుడిని ప్రతి నిత్యం స్మరిస్తే సర్వ వ్యాధుల నుంచి ఉపశమనం పొంది శతాయుష్యు కలుగుతోందని శాస్త్ర వచనం.

భగవంతుని ఉపచారములు - రకములు

  భగవంతుడిని పూజించే విశేష ఘట్టములను ఉపచారములు అని అందురు. వీనిలో సంక్షేపం, విస్తారం అని రెండు రకములు కలవు.ఈ విషయాలు వివిధ ఆగమ శాస్త్రాలలో తెలిపినారు.  లఘువుగా జరుపబడు ఉపచారములను  సంక్షేప ఉపచారము లని, విశేష రీతిలో జరుపబడు ఉపచారములను  విస్తార ఉపచారము లని అంటారు. ఐదు, పది, పదహారు, పదునెనిమిది, మప్ఫైఆరు, అరవైనాలుగు అని అనేక విధాలుగా ఉపచారములు ఉన్నాయి. పంచోపచారాలు – 1. గంధం 2. పుష్పం 3. ధూపం 4. దీపం 5. నైవేద్యం దశోపచారాలు – 1. పాద్యం 2. అర్ఘ్యం 3. ఆచమనం 4. స్నానం 5. వస్త్రనివేదనం 6. గంధం 7. పుష్పం 8. ధూపం 9. దీపం 10. నైవేద్యం షోడశోపచారాలు – 1. పాద్యం 2. అర్ఘ్యం 3. ఆచమనం 4. స్నానం 5. వస్త్రనివేదనం 6. ఆభూషణం 7. గంధం 8. పుష్పం 9. ధూపం 10. దీపం 11. నైవేద్యం 12. ఆచమనం 13. తాంబూలం 14. స్తవపాఠం 15. తర్పణం 16. నమస్కారం అష్టాదశోపచారాలు – 1. ఆసనం 2. స్వాగతం 3. పాద్యం 4. అర్ఘ్యం 5. ఆచమనీయం 6. స్నానీయం 7. వస్త్రం 8. యజ్ఞోపవీతం 9. భూషణం 10. గంధం 11. పుష్పం 12. ధూపం 13. దీపం 14. నైవేద్యం 15. దర్పణం 16. మాల్యం 17. అనులేపనం 18. నమస్కారం ముప్ఫైఆరు ఉపచారాలు – 1. ఆసనం 2. అభ్యంజనం 3. ఉద్వర్...

వరలక్ష్మి వ్రతం కథ

  ఒకనాడు పరమేశ్వరుడు కైలాస గిరియందు సకల మునిగణ సంసేవితుడైయున్న సమయంబున పార్వతీ దేవి వినయంబుగా, "ప్రాణేశ్వరా! స్త్రీలు సకలైశ్వర్యములు కలిగియుండుటకు ఆచరించదగిన వ్రతమేదియో సెలవీయు"డని కోరెను. అంతట పరమేశ్వవరుడు, "దేవీ! వరలక్ష్మి వ్రతమనునది స్త్రీలకు సౌభాగ్యమొసగును. దానిని శ్రావణమాసమందు పౌర్ణమికు ముందు వచ్చు శుక్లపక్ష శుక్రవారము నాడు చేయవలెను" అనెను. అది విని యామె, "స్వామీ! ఆవ్రతం ఎలా ఆచరించవలెనో సెలవీ"య వేడెను. మరియు, "ఆ వ్రతాన్ని మునుపు ఎవరాచరించి తరించారో తెలుపగోరెద" ననెను. అంతట పరమేశ్వరుడు "ఓ పడతీ! ఆ వ్రతకధను చెప్పెదను వినుము" అని కధ చెప్పెను. పూర్వము మగధ రాజ్యమున కుండిన నగరమను నొక పురము గలదు. అది బహుసుందరమయిన పట్టణము. అందు చారుమతి యను ఒక సాధ్వి కలదు. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె స్వప్నమున ప్రత్యక్షమై ఆమెతో, "చారుమతీ! నీసధ్గుణములకు నేను మెచ్చితిని నీకు కావలయు వరములనొసగు తలంపు నాకు కలిగెను. కావున నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారమునాడు వరలక్ష్మీ వ్రతము చేయుము. అప్పుడు నీవు కోరిన కోరికలను దీర్చెద" నని చెప్పి మాయమయ...

శంఖు స్తాపన పూజ సామగ్రి

  పసుపు, 200 గ్రాములు,  కుంకుమ 100 గ్రాములు,  గంధం చిన్న పాకెట్,  బియ్యం 3 కిలోలు, తమల పాకులు 100,  వక్కలు 35, ఖర్జూరం పండ్లు 21, అరటి పండ్లు డజను 1,  మామిడి కొమ్మ 1, శంఖువు 1, నవరత్నాలు, పంచలోహాలు,  కొబ్బరికాయలు 3,  కనుము బట్ట 1,  తెల్లని వస్త్రము బంగారు అంచు తో ఉండాలి  ప్లాస్టిక్ గ్లాసులు 3,  ఆగరబతి,  కర్పూరం పాకెట్,  పూలు, పూల దండలు చిన్నవి 2, దేవత ఫోటో,  నవధాన్యాలు 1/2 కిలో,  ఆవు పాలు లీటరు 1,  గ్రనైట్ రాళ్ళు, 5,  గునపము, సిమెంట్ తట్ట, సిమెంట్ కొంచెం, తాపే,  కంకణ దారం బంతి,  స్వీట్ నైవేద్యం, 

శ్రీ వరలక్ష్మి దేవి పూజ సామగ్రి వివరాలు

         // జై శ్రీరామ్ // పసుపు 100 గ్రాములు,  కుంకుమ 100 గ్రాములు,  తమల పాకులు 50,  వక్కలు 21, ఖర్జూరం పండ్లు,  పసుపు కొమ్ములు 11,  అరటి పండ్లు, ఊడు బత్తీలు/దూపం,  ఆరతి కర్పూరము,  పసుపు అక్షతలు,  మల్లె  పూలు 1/2  కిలో, , కొబ్బరి కాయ/కలశం మీదికి 1,  కొబ్బరికాయ అర్చనకు 1,  దీపారాధన కుంది - పెద్దది,  దీపారాధన కుంది - చిన్నది,  గంధం, గంట, హారతి పల్లెము,  వత్హులు, దీపారాదన కు  ఆవునెయ్యి,  అమ్మవారికి కలశము, రాగి చెంబు ౧,  ఆవు పంచితం, ఆవు పేడ,  పంచామృతాలు,  అమ్మవారికి పీటము,  ఒక పల్లెము - దీపారాధన హారతి పల్లెము ఉంచుటకు,  బియ్యము కిలోన్నర    ఒక రవికె గుడ్డ,  అమ్మవారి అలంకరణ సామగ్రి (చీర,జాకెట్ ,గాజులు,బొట్టు బిళ్ళలు, కాటుక,ఇతర ఆభరణాలు వగైరా ),  వడపప్పు, (ఆనవాయితి వుంటే) పానకము (ఆనవాయితి వుంటే),  పత్తి ని   కాయిన్  గా   చేసి కుంకుమ తో అద్దినవి , రెండు వస్త్రాలు,  పత్హితో రుద్రాక్షమాల గా చేసి పసుపు/కుంక...

గృహ ప్రవేశం & సత్యనారాయణ స్వామి వ్రతం పూజ సామగ్రి వివరాలు

  పసుపు 200 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 4  కిలోలు,   తమల పాకులు 200   ,  వక్కలు 45 , పసుపు కొమ్ములు 21,  ఎండు కుడుక 2,  ఖర్జూరం  పాకెట్ 1 ,  టెంకాయలు 5  (ప్రతి దర్వాజకు ఒక టెంకాయ కొట్టాలి )   , తెల్లని  దోవతి ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు (blouse peaces ) 2,  అరటి పండ్లు 2  డజన్ , అరటి కొమ్మలు చిన్నవి 4,  అగర్ రబత్తి ,, సాంబ్రాణి పొడి, దారం బంతి 1,  ఆవు పంచితం, 100 ml  కర్పూరం పాకెట్  మామిడి కొమ్మ 1 నవగ్రహ పూజ, వాస్తు పూజ సామాను: - గోధుమ పిండి 1,250 గ్రాములు, కంది పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినప్పప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు., విస్టారి ఆకులు 10, దొప్పలు 8.   రాగి  కలశం చెంబులు 2 , సత్యనారాయణ స్వామి పూజ కు వేరే కలశం పెట్టాలి . పాలు పొంగిచ్చటానికి  కొత్త ఇత్తడి గిన్నె 1,...

శ్రీ సుధర్శన హోమం పూజ సామగ్రి వివరాలు

  ll శ్రీ సుధర్శన యతి రాజాయ నమః ll  పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,     శ్రీ గంధం 1 చిన్న డబ్బా, బియ్యం 4   కిలోలు,  నవధాన్యాలు 150 గ్రాములు,  కలశం చెంబులు 6, ( ఒకటి పెద్దది ) ఆచమనం పాత్ర 1,  పెద్దవి దీప0 చెమ్మెలు  2,  దీపం నూనె 500 ml  పెద్దవి మరియు చిన్నవి నూనె వత్తులు, అగ్గిపెట్టె 1,  మామిడి , రావి ,మేడి ,ఆకులు , మంచి తమల పాకులు, 200, ఎండు కుడుకలు 3  ,  పోక వక్కలు 50, ఖర్జూరం 50, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్క రకం 5,  అరటి పండ్లు, 1/2 డజన్ . వి డి పూలు 1 కిలో, తులసి మాల 1,   దారం బంతి ,1, ఆవు పాలు,1/2 ml , పెరుగు,100 గ్రాములు,  తేనె 200 గ్రాములు, , బెల్లం పొడి పాకెట్,  ఆవు నెయ్యి రెండు న్నర కిలోలు,  తెల్లని ఆవాలు 100 గ్రాములు,  కొబ్బరికాయలు 8 ,,  ఆవు పంచితం , ఆవు పేడ కొంచెం, ప్లాస్టిక్ గ్లాసులు 5,  రూపాయి నాణెములు 25, అంచు దోవతి, ఉత్తరీయము 1,(పూజ దగ్గర) జాకెట్ బట్టలు 5,  ఆగరబత్తులు, 1 పాకెట్,  ముద్ద కర్పూరం పాకెట్ పెద్దది, పాయసం (dry  frui...