మామూలు పరిభాషలో ' పురుష ' అంటే మగవ్వాడు అని అర్థము వస్తుంది. కాని శ్రీ వైష్ణవ సాంప్రదాయములో పురు అంటే చాలా అని అర్థము. పురుష అంటే చాల ఇచ్చే వాడు అని అంటారు. ఆ చాల ఇచ్చే వాడు శ్రీమన్నారాయణుడు. ఆయన దయగలవాడు కాబట్టి చాల ఇస్తాడు. లక్ష్మి దేవి అతనిచేత ఇప్పింప జేస్తుంది.ఆమె దయ లేకపోతే నారాయణుడు తనకు తానుగా ఇవ్వడు.
ఒక పిల్లవాడు తనకు కావలసిన వస్తువును ముందుగా తన అమ్మదగ్గరికి వెళ్లి అడగగా ఆ తల్లి తన బర్తకు చెప్పి ఇప్పించినట్టు ఉంటుంది. తండ్రి కంటే తల్లి తో పిల్లవాడు చనువుగా ఉండటము వలన ముందుగ తల్లి తో చెప్పుకుంటాడు. అలాగే భగవంతుడు కూడా తన బార్య అయిన లక్ష్మిదెవి చేబుతేనే భక్తునికి వరాలు ఇస్తాడు.
కాకాసురుడు అనే రాక్షసుడు కాకి వేషములో వచ్చి సీతమ్మ చాతిని పొడుస్తూ ఉండగా రాముడు వెంటనే తన భాణము తో ఆ కాకి మీదకి విసరగా, కాకి రాక్షస రూపములోకి వచ్చి రాముని కాళ్ళ మీద పడతాడు. సీతమ్మ పక్కన ఉండి తన భర్త రాముని కోపాన్ని గ్రహించి చిన్న శిక్ష విధించి అతనిని రక్షించండి అని చెప్పడము వలన ఆ కాకాసురుడు బతికి భయట పడినాడు. కాని రావణా సురునిని మన్నించలేదు. ఎందుకని ? రాముని పక్కన సీతమ్మ లేదు కాబట్టి. ఆ రావణాసురుడు సీతమ్మను భగవంతునికి దూరము చేసినాడు కాబట్టి. రావణాసురిని మీద అమ్మవారికి దయ లేదు కాబట్టి.
అమ్మవారి దయ ఎంత ముఖ్యమో నమ్మాల్వారుల పాశురము చెబుతున్నది. అమ్మవారు భగవంతుని హృదయము మీద శాశ్వతముగా తన నివాసము ఏర్పాటు చేసుకున్నది. ఆ శాశ్వత నివాసమునుండి విడిపోకుండా ప్రమాణము చేసుకొని ఉన్నది. ఒక సారి ప్రమాణము చేసినాక తన శాశ్వత నివాసము గురించి పదే పదే చెప్పవలసిన పని ఏమున్నది ? ఇక్కడ అమ్మవారు ఒక చిన్న పిల్ల. ఒక పిల్ల తన ఆట వస్తువును ఎలాగ అయితే ఒదులు కోలేదో ఎప్పుడు కూడా ఆ అట వస్తువు నాది నాది అని అంటూ వుంటుందో , అలాగే అమ్మవారు గూడ తన నిత్య నివాసము గురించి పదే పదే చెప్పనవసరము లేదు అని అర్థము.
పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె, విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు, రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు బాదాం పలుకుల బాస్కెట్, etc . తమల పాకులు 100, నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్, సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా. పురోహిత్ దక్షిణ ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి.
Comments
Post a Comment