నాగాశాపాలు, సర్పదోషాలు, కాల సర్ప దోషాలు, కుజ దోషాలు మొదలైన వాటి పైన ప్రజలలో చాల అపోహలు ఉన్నాయే. ఎప్పుడో పామును చంపటం వల్ల ఇలాంటి దోషము కలుగుతుంది అనుకుంటారు. నిజానికి కాలమే సర్పము. ఇది జర జరా పాకి పోతూ ఉంటుంది. ఇది ఎన్ని మెలికలు తిరిగినా దీని ప్రయానమార్గము ధర్మ మార్గమే. దీని వెంట వెళ్ళే జీవులు ఎప్పుడూ ధర్మ మార్గములోనే ఉంటారు. లేదా అధర్మ మార్గములో వెళ్ళేవారు ఈ కాలసర్పం కాటేస్తుంది. కాలం భగవంతుని సృష్టి. అయినా ఆయన మానవ శరీరము ధరించినపుడు దానికి కట్టుబడి ఉంటాడు. మార్గ శీర్ష మాసములో ఉదయించే సూర్య భగవానుని "అంశుమాన్" అంటారు. కాలసర్పం ఈయన రథాన్ని "మహాశంకనాగ్" రూపములో అధిరోహిస్తుంది. ఈయన వాయువు రూపములో సమస్త ప్రాణికోటికి ప్రాణవాయువు నందిస్తాడు. ఇంద్రుడి ప్రార్తను మన్నించి హిరణ్యాక్ష, హిరణ్య కశాపులను విష్ణుమూర్తి వధించగా, ఇంద్రవధ కోసం గర్భవతి అయిన దితి వ్రత పాలనం చేయడం మొదలెట్టింది. కపటముతో మారువేషము దాల్చి ఇంద్రుడు సవతి తల్లి సేవ చేయడానికి వచ్చి, వ్రతభంగం చేసి పగలు నిద్రిస్తున్న దితి గర్భము లోనికి ప్రవేశించి పిండాన్ని నలభై తొమ్మిది ముక్కలు చేశాడు. వారు చనిపోక నలభై తొమ్మిది శిశువులుగా మారగా వారిని తీసుకొని బయటికి వచ్చిన ఇంద్రుడు వారిని దేవతలుగా మార్చాడు. అమ్శుమంగా పిలవబడే ఈ వాయువే నలభై తొమ్మిది రూపాలలో సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఈ అమ్శుమానదిత్యుడికి మార్గ శీర్ష మాసములో ప్రతి ఆదివారము బెల్లము, నేతితో వందిన అన్నపాయసాని కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించాలి.
ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము , 2.సంగవకాలము , 3. మధ్యాహ్నకాలము , 4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. · ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా , వ్రత , శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. · ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. · ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...
Comments
Post a Comment