గురువారము తేది ౩౧-౧౨-౨౦౦౯ రోజున అర్తా నక్షత్ర ములో, మిథున రాశి యందు చంద్ర గ్రహణము సమయము రాత్రి ౧౨-౨౨ నిమిశాములనుండి రాత్రి ౧-౨౪ నిముషముల వరకు ఉంటుంది. అర్తా నక్షత్ర జాతకులు, మిధున,కర్కాటక, వ్రుచ్చిక రాశి వారు ఈ గ్రహనమును చూడకుండా ఉండటము మంచిది. మధ్యాన్నము ౩-౦౦ గంటలలోపు భోజనములు ముగించడము మంచిది. గ్రహణ దోష నివారణకు వెండి చంద్ర బింబమును, బంగారు నాగ బింబమును నేయిచే నిండిన తామ్ర
లేక కంచు పాత్ర యందు ఉంచి నువ్వులు, వస్త్రములు, దక్షినయు కలిపి, సంకల్ప మంత్రములతో చంద్రున్ని,కేతువుని ధ్యానించి,తమో మయా అనే శ్లోకము చదువుతూ దాన వాక్యములు చదువుతూ మంచి బ్రహ్మునికి దానము చేసినచో దోష నివారణ అవుతుంది. దేవుని విగ్రహాల పైన, నీటిలో, బియ్యము,పప్పుల మీద ధర్బాలు ఉంచవలెను.
హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని , ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు , ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా , అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై , సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి , భవిష్యత్ దంపతులుగా , కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ , జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో , ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...
Comments
Post a Comment