మామూలుగా ఒక పెద్దమనిషి, చదువుకున్న మనిషి కాని మనకు ఎదుర్య్నపుడు వారికి తలవంచి గౌరవము ఇస్తాము. ఇది ఒక అణిగి ఉన్నాము అని తెలిశాచేసే ఒక మంచి మానవ లక్షణము. కాని ఒక భక్తుని విషయములో శివుడు ఆ భక్తునికి తలవంచినాడు. ఇది జరిగింది తిరుప్పానంద అనే రాజ్యములో. ఒక రోజు ఒక అమ్మాయి శివుని మేడలో పూలదండ వేయడానికి వచ్చింది. దండ వేయడానికి తన చేతులు పైకి ఎత్తగానే తను వేసుకున్న ఫై వస్త్రము జారిపోతుండగా పట్టుకోవడానికి ప్రయత్నమూ చేస్తూ వున్నది. ఒక మంచి స్నేహము అనేది జారిపోతున్న వస్త్రాన్ని పట్టుకొని ఆమెను రక్షించడము లాంటిది .ఆవిదంగా జారిపోతున్న వస్త్రాన్ని చూసి తన పూలదండను శివుని మేడలో వేయలేక పోయింది. ఆ పరిస్థితి లో శివుని లింగము ఆ మాలను వేయించుకోవడానికి వంగింది. ఆ విధంగా కొన్ని సంవస్చరాలు ఉండిపోయింది. ఆ తరువాత ఆ రాజ్యము పాలించిన రాజు ఆ దేవేలయాన్ని అభివృద్ధి చెయ్యాలని అనుకున్నాడు. ముందుగ ఆ లింగాన్ని చక్కగా చెయ్యాలని అనుకోని గుర్రాలకు, ఏనుగులకు తాడుతో కట్టి లింగాన్ని చక్కగా చేయడములో విఫలమైనాడు. ఒక పరమ భక్తుడు ఆ రాజు తపన చూసి సహాయము చేద్దామని అనుకొన్నాడు.అప్పుడు ఒక పొడవాటి దారమునకు పూలు అల్లి శివలింగామునకు చుట్టూ వేసినాడు. తరువాత గట్టిగా ముడి వేసినాడు. ఆ తరువాత ఆ లింగము కదిలి చక్కని స్థితికి వచ్చింది. ఏనుగు కదలించలేని లింగాని ఒక పూల దండ సరి చేసింది.
ఆవిధంగా ఆ పరమ భక్తుని వలన ఆ శివలింగము సరిచేయబడినది. ఆ విధంగా ఒక భక్తునికి తల దించిన భగవంతుడు మరియొక భక్తుని కోరిక నెరవేర్చినాడు. ఆ విధంగా భగవంతుడు కూడా భక్తుని భక్తి , ప్రేమలకు తలవంచుతాడు.
ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము , 2.సంగవకాలము , 3. మధ్యాహ్నకాలము , 4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. · ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా , వ్రత , శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. · ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. · ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...
Comments
Post a Comment