ఉత్తరాయణం ప్రారంభం అయ్యాకా వచ్చే మాసాలలో మొదటిదైన పుష్యమాసం ఆఖరి రోజైన అమావాస్యని ( తేదీ 11-2-2021 గురువారం ) పుష్య బహుళ అమావాస్య అని చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు.ఈ రోజు అమావాస్య శ్రవణా నక్షత్రం కలిసాయి కాబట్టి ఇది మహోదయ అమావాస్య. ఎంతో మహత్తరమైన రోజు.ఈ ప్రత్యేకమైన రోజున ఎంతో మంది సముద్ర స్నానం ఆచరిస్తారు. ఎందుకో తెలుసా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో వచ్చే పుష్య,మాఘ మాసాల సూర్యకిరణాల్లో ఆరోగ్యకారకాల మోతాదు ఎక్కువగా ఉంటుందని మన ధార్మిక గ్రంథాలే కాదు ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతోంది. ప్రవాహపు నీటిలోనే కాదు సూర్యరశ్మి సోకే నదీజలాలు, బావిలో ఉండే నీరు ఇలా వేటిలో స్నానం చేసినా ఆరోగ్యపరంగా ఎంతో మంచిదంటారు మన పెద్దవాళ్ళు.ఈ అమావాస్య రోజున దేవుని ఎదుట వరిపిండితో చేసిన చలివిడిదీపంలో ఆవునెయ్యి వేసి దీపం వెలిగిస్తారు. ఇలా చేస్తే కడుపుచలవ అంటారు. పితృ తరణాలు ఈ రోజు తప్పకుండా చేయాలి.
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B,(corporate lawyer), D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com
Comments
Post a Comment